Breaking News
Home / Tag Archives: Anantapur

Tag Archives: Anantapur

జులై1 వరకు జేసీకి రిమాండ్‌

అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్ల వ్యవహారంలో నమోదైన కేసుల్లో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలకు జులై 1వరకు రిమాండ్‌ పొడిగించారు. ఈ కేసుల్లో ఓ కేసుకు సంబంధించి ఈ నెల 24వ తేదీ వరకూ రిమాండ్‌ విధించారు. మరికొన్ని కేసులకు సంబంధించి జులై 1వ తేదీ వరకు జిల్లా కోర్టు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ అరెస్ట్…

ఈఎస్ఐ మెడికల్ స్కాం వివాదంతో ఏపీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సంచలనం సృష్టించింది.. ఈ ఎస్ ఐ మెడికల్ స్కాంలో ఆయనను అరెస్ట్ చేసారు.. కాగా ఇవాళ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు. శంషాబాద్‌లో ప్రభాకర్‌రెడ్డితోపాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. నకిలీ పత్రాలతో ప్రభాకర్‌రెడ్డి …

Read More »

లాక్‌డౌన్ నిబంధనల సడలింపులు…

అనంతపురం: జిల్లాలో రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపులు ఉంటాయని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. కంటైన్మంట్ ఏరియా మినహా మిగిలిన ప్రాంతాల్లో దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వనున్నట్టు తెలిపారు. స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. దుకాణ దారులు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. దుకాణదారులతో మున్సిపల్ కమిషనర్లు, డిఎస్పీలు సమావేశమై విధి విధానాలు నిర్ణయిస్తారని వెల్లడించారు.

Read More »

క్వారంటైన్‌కు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు

అనంతపురం/తాడిపత్రి: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అతడితో సంబంధం ఉన్న పది మందిని క్వారంటైన్‌కు పంపారు. వారిలో కానిస్టేబుల్‌ తల్లి, తొమ్మిది మంది కాని స్టేబుళ్లు ఉన్నారు. కొందరిని రావివెంకటాంపల్లి వద్దగల సీవీఆర్‌టీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌కు, మిగిలిన వారిని వీరాపురం వద్ద గల తాడిపత్రి ఇంజనీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసే పోలీసులంటే ప్రజలు భయపడుతున్నారు. స్టేషన్‌కు వెళ్లాంటే …

Read More »

‘ఓపెన్‌’ పరీక్షలు వాయిదా

అనంతపురం: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు డీఈఓ శామ్యూల్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్‌ ఓబులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 25 నుంచి మే 2 వరకు జరగాల్సి ఉందన్నారు. అయితే కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Read More »

ఏపీలో ఎంఆర్ ఓ కు కరోనా

అనంతపురం: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా అనంతపురంలో 2 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో హిందూపురంకు చెందిన ఓ మహిళా తహశీల్దార్, మహిళా డాక్టర్ ఉన్నారు. హిందూపురంలో లోకల్ ట్రాన్స్‌మిషన్ వల్ల తహశీల్దార్, డాక్టర్‌కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించగా.. జిల్లాలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. అటు అనంతపురం జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 17కు చేరుకుంది.

Read More »

ఏపీలో కొత్తగా 34 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కొత్తగా 34 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 3, నెల్లూరులో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు కరోనా కేసులు 473కి చేరుకున్నాయి. కాగా ఏపీలో ఇప్పటివరకు ఏడుగురు కరోనాతో మరణించగా.. 14 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More »

గుత్తి క్వారెంటైన్‌లో ఉద్రిక్తత…పోలీసులపై దాడి

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 14 రోజుల పాటు క్వారెంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను తమ స్వస్థలాలకు పంపించాలంటూ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన వలసకూలీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఇళ్లకు పంపే వరకు భోజనం కూడా చేయమని క్వారంటైన్ సెంటర్ వద్ద ఆందోళన తెలిపారు. కాగా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చేంత …

Read More »

మధుసూదన గుప్తా బైండోవర్

అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాను బైండోవర్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు ఈమేరకు చర్య తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ను ఆయన ధ్వంసం చేశారు. పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా లేవంటూ గుంతకల్లునియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో గతేడాది ఏప్రిల్‌ 11న ఆయన వీరంగం సృష్టించారు. ఎన్నికల …

Read More »

కౌన్సిలర్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన జేసీ!

అనంతపురం: అనంతపురం స్థానిక ఎన్నికలు వేడెక్కాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయమని చేతులెత్తేసిన జేసీ సోదరులు తాజాగా ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రి పట్టణం 30వ వార్డు నుంచి పోటీ చేయడానికి గురువారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అంతేగాక ఆయన అనుచరులతో కూడా రెండు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయించి అందరిని ఆశ్చర్యపరిచారు. తాడిపత్రి నుంచి అన్ని వార్డుల్లో టీడీపీ …

Read More »