Breaking News
Home / Tag Archives: andhra pradesh

Tag Archives: andhra pradesh

‘సీబీఐకి ఏపీలో ‘నో ఎంట్రీ’..

ప్రభుత్వ సంచలన ఉత్తర్వు.. పాత అనుమతి ఉపసంహరణ ఢిల్లీ పోలీసు చట్టంలోని అధికారం మేరకు నిర్ణయం పౌరులు, ఉద్యోగులు, కేసులు.. దేనిలోనూ జోక్యం కుదరదు గతం: సీబీఐ అంటే అందరికీ ఒక నమ్మకం. వర్తమానం: కేంద్రం ఆడించినట్లు ఆడే బొమ్మ అన్న అపప్రథ. భవిష్యత్తు: రాష్ట్రం ఊ కొడితేనే ఇక్కడ అడుగుపెట్టాల్సిన పరిస్థితి. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ మీ ‘ఇష్టారాజ్యం’ కాదని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్గత కుమ్ములాటలతో …

Read More »

నవ్యాంధ్రకు కొత్త చిహ్నం

రాష్ట్ర అధికార చిహ్నం ఖరారు తెలుగుదనం ఉట్టిపడేలా రూపం నోటిఫికేషన్‌ జారీచేసిన సీఎస్‌ అమరావతి : నవ్యాంధ్రకు నూతనంగా రాష్ట్ర అధికారచిహ్నం ఖరారయింది. అందంగా రూపుదిద్దుకున్న ఈ చిహ్నానికి లాంఛనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర అధికార చిహ్న మకుటం, పాదభాగాల్లో తెలుగు అక్షరాలను కూర్చడం విశేషం. అమరావతి బౌద్ధ సంస్కృతి ఉట్టిపడేలా, నాలుగున్నరేళ్ల రాష్ట్ర ప్రస్థానానికి మరింత వన్నెను తెచ్చేలా సుందరంగా తీర్చిదిద్దారు. అధికార కార్యకలాపాలకు మాత్రమే …

Read More »

మే 15 డెడ్‌లైన్‌

కాఫర్‌ డ్యాంలు ఆ లోపు పూర్తవ్వాల్సిందే డిసెంబరు 17న తొలి గేటు బిగించాలి పోలవరం ప్రాజెక్టుపై సీఎం స్పష్టీకరణ నేడు ఢిల్లీకి శశిభూషణ్‌, ఈఎన్‌సీ అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది మే 15వ తేదీకల్లా పూర్తి కావలసిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం ఇచ్చేలా ఒత్తిడి పెంచాలని జల వనరుల …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: ఇవాళ కార్తీకమాసం తొలి సోమవారం ప్రారంభంకావడంతో తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలు చేసి, స్వామి దర్శనానికి 5గంటలు, అమ్మవారి దర్శనానికి 3గంటల నుంచి భక్తులు క్యూలెన్లలో వేచి ఉన్నారు. నాగులకట్ట దగ్గర కార్తీకదీపాలు వెలిగించి భక్తుల పూజలు చేశారు. తెలంగాణలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కాళేశ్వర-ముక్తీశ్వరాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ వేయిస్తంభాలగుడి, …

Read More »

వైసీపీ సరికొత్త వ్యూహం

వైసీపీ సరికొత్త వ్యూహం అధికార పార్టీలో అంతర్యుద్ధాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం జగన్‌తో బాలినేని భేటీ చంద్రబాబు పర్యటన అనంతర పరిణామాలపై సమీక్ష చీరాలకు నాయకుడిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం దర్శి విషయంలో ద్విముఖ ఆలోచన బూచేపల్లితో చర్చలు జగన్‌ను కలిసేందుకు అన్నా రాంబాబు ప్రయత్నం ఎస్‌.ఎన్‌.పాడు, కొండపిలపై లోతైన చర్చ ఒంగోలు: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన అనంతరం తాజా రాజకీయ పరిస్థితిపై వైసీపీ నేతలు …

Read More »

ఏపీలో కొలువుల కోలాహలం.. పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

3,137 పోలీసు పోస్టులు ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలు 384 కానిస్టేబుల్‌, జైలు వార్డర్‌, ఫైర్‌మెన్‌ 2,753 ఎస్‌ఐ పోస్టులకు 5 నుంచి దరఖాస్తులు డిసెంబరు 16న ప్రాథమిక పరీక్ష కానిస్టేబుళ్లకు 12 నుంచి అప్లికేషన్లు 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష మార్చిలోగా ఎంపిక పూర్తి: ఎస్‌ఎల్‌పీఆర్‌బీ అమరావతి: పోలీసు శాఖలో కొలువుల కోలాహలం మొదలైంది. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు రాష్ట్ర పోలీసుశాఖ తీపి …

Read More »

నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు

భారీగా హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు అంతా ఆన్‌లైన్‌లోనే.. www.cse.ap.gov.inలో పూర్తి వివరాలు ఫీజు చెల్లింపు కూడా.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో ప్రధానమైన దరఖాస్తుల స్వీకరణ గురువారం(నేడు) ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తిచేసింది. ఫీజు చెల్లించాల్సిన విధానాన్ని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు నవంబరు 1 నుంచి 15 వరకు, దరఖాస్తులు …

Read More »

7729 పోస్టులతో డీఎస్సీ

1 నుంచి 16 వరకూ దరఖాస్తులు 29 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ డిసెంబరు 6- జనవరి 2 మధ్య పరీక్షలు వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు షెడ్యూల్‌ విడుదల.. నేడు నోటిఫికేషన్‌ ఎల్పీ, పీఈటీ పోస్టులు ఎస్‌ఏగా అప్‌గ్రెడేషన్‌! అమరావతి: టీచర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. టీఆర్‌టీ, టెట్‌ కమ్‌ టీఆర్‌టీ విధానంలో పరీక్ష నిర్వహించి, నియామక ప్రక్రియ చేపడతారు. …

Read More »

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో 3నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 90ను కోర్టు కొట్టివేసింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని, వారికి …

Read More »

ఏపీలో విపత్తులపై ఆనాడే హెచ్చరించా: చంద్రబాబు

అమరావతి: విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో విపత్తుల గురించి హెచ్చరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగేళ్లలో రెండు తుపాన్లు..మరో రెండేళ్లు కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయని, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరానని తెలిపారు. అయితే కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని విమర్శించారు. అయినప్పటికీ పట్టుదలతో తమకున్న వనరులతో విపత్తులను అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల బాధలను తగ్గిస్తున్నామని..అనుకున్న ఫలితాలను …

Read More »