Breaking News
Home / Tag Archives: andrapradesh

Tag Archives: andrapradesh

విశాఖ వాసుల మంచి వినూత్న ఆలోచన

విశాఖ: సీతమ్మధార నగర నడిబొడ్డులో ఫ్రిజ్ ఆన్‌లోనే ఉంటుంది. 24 గంటలూ అందరికీ అందుబాటులో ఉంటుంది. విశాఖ వాసులకు ఆకలితో ఉన్న పేదవారికి కడుపు నింపాలనే మంచి ఆలోచన తట్టింది. ఆకలితో ఉన్నవారికి 24 గంటలూ ఆహారం అందించే విధంగా ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసి అందులో పండ్లు, కూరలు, అన్నం, బిర్యానీ ఇలా ఎవరికి నచ్చింది వాళ్లు, మరోవైపు ఫంక్షన్ హాల్లో, ఇళ్లల్లోనూ మిగిలిన పదార్థాలను ఇక్కడ భద్రపరుస్తారు. ఆకలితో …

Read More »

ఆ ఊరు ఏనుగులకు కేర్ అఫ్ అడ్రస్

విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లాలో ఏనుగులు ఓవైపు ఆహారం కోసం వెతుకులాడుతూ మరోవైపు తన సహచర గున్నతో ఆటలాడుకుంటూ చెరకుతోటలో సందడి చేస్తుండగా ప్రముఖ పత్రికా కెమెరాకు ఆ దృశ్యాలు చిక్కాయి. ఏనుగుల విందు, వినోదం, ఆనందించడం బాగానే ఉన్నప్పటికీ చెరకు రైతులు తమ పంట నష్టపోవడంతో లబోదిబో మంటున్నారు. ఏనుగులు ఒకేసారి పదుల సంఖ్యలో రావడంతో అధికారులు, స్థానికులు సైతం వాటిని నిలువరించడానికి సాహసం చేయలేకపోతున్నారు. గుమ్మలక్ష్మిపురం ఏనుగులకు …

Read More »

ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు

నెల్లూరు: చంద్రయాన్-2 మిషన్ విజయంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే ఈ విజయం చేకూరిందని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇది చరిత్రాత్మక యాత్రకు శ్రీకారం చుట్టిన రోజు అని పేర్కొన్నారు. చంద్రుడిపైకి భారత్ చేసిన చారిత్రక ప్రయాణమిది అని, వచ్చే 24 గంటలు చాలా కీలకం అని చెప్పారు. చంద్రయాన్‌లో …

Read More »

శాసనమండలిలో అనూహ్యమైన సంఘటన

అమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో కరువు, అనావృష్టిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించి కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కారణాలు తెలీదు కానీ ఉన్నట్లుండి ఆయన సభలో నుంచి వాకౌట్ చేశారు. దీంతో …

Read More »

అనుమానంతో హత్యకు పాల్పడిన భర్త

నాగర్‌ కర్నూలు: ఎల్లూరు దగ్గర దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త బండరాయితో మోది హతమార్చాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

వైఎస్ హయాంలోని 14 లక్షల ఇల్లు ఎక్కడ…..

అమరావతి : ఏపీలో అవినీతి వారసుల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు అసెంబ్లీలో హౌసింగ్‌పై టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ నుంచి సభ్యులు వాకౌట్ చేద్దామన్నా, నిరసన నిరసన వ్యక్తం చేద్దామన్నా అధికార పార్టీ వాళ్ళు మైక్ ఇవ్వడంలేదన్నారు. …

Read More »

గత ప్రభుత్వం టూర్లకే రూ.100 కోట్లు ఖర్చు చేసింది

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల 18 వేల కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం టూర్‌లకే గత ప్రభుత్వం రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. గేట్ల ఏర్పాటుకు, ప్రచారానికే రెండున్నర కోట్లు ఖర్చు చేసిందన్నారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు తిరిగి ప్రారంభం అవుతాయని స్పష్టం …

Read More »

వైద్యుల నిర్లక్ష్యానికి బలైన బాలింత

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. సుకన్య అనే గర్భిణి ఈ నెల 17వ తేదీన ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అయితే బాలింతకు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి.. ‘ఓ’ …

Read More »

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కీలక ఆదేశాలు

అమరావతి : ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం చేపడుతోంది. ఈ మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరి కోటలోని షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ లను తీసుకుని జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3ఎం1 రాకెట్‌ నింగికి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ …

Read More »

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు: పలమనేరులోని బలరామ్ క్వార్టర్స్ వద్ద సుశీల అనే మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read More »