Breaking News
Home / Tag Archives: ap bjp chief kanna lakshminarayana

Tag Archives: ap bjp chief kanna lakshminarayana

గుంటూరులో ఉపవాసదీక్ష చేపట్టిన కన్నా..

గుంటూరు: తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉపవాస దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో తన నవాసంలో ఉపవాస దీక్ష చేప్టటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏపీలో హిందూ ధర్మం మనుగడకు ప్రమాదం ఏర్పడిందని విమర్శించారు. హిందూ దేవాలయాలకు, దేవాలయాల …

Read More »

సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి..

అమరావతి: డాక్టర్ సుధాకర్‌ని సస్పెండ్ చేయడం దారుణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుధాకర్ వ్యవహారంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందన్నారు. ప్రశ్నించే వారిపై ఇలాంటి చర్యలకు దిగడం సమంజసం కాదన్నారు. డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కన్నా డిమాండ్ చేశారు.

Read More »

సీఎం జగన్ కు కన్నా లేఖ…

సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.  కరోనా కేసులకు సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి సరైన సమాచారం రావట్లేదని అన్నారు. హెల్త్ బులెటిన్‌లో జిల్లాల వారీ సమాచారం అందించట్లేదని ప్రస్తావించారు. జిల్లాల వారీ సమాచారం ఇస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త విధానాన్ని రద్దుచేసి పాత విధానంలోనే బులెటిన్ విడుదల చేయాలని లేఖలో కోరారు.

Read More »

కరోనా వేళ విద్యుత్‌ ఛార్జీలు పెంపా?…

గుంటూరు: అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు, ఏపీ బిల్డ్‌పై గుంటూరులోని తన నివాసంలో గంటపాటు నిరసన దీక్ష చేశారు. దీక్ష అనంతరం కన్నా మాట్లాడుతూ… ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతన్న సమయంలో విద్యుత్‌ శ్లాబులు మార్చారని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ …

Read More »

సీఎం జగన్‌కి కన్నా లక్ష్మీనారాయణ లేఖ…

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రస్తుత పీజీ మెడికల్‌ అడ్మిషన్లలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం సరికాదన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను అభ్యసించే అవకాశం కోల్పోతున్నారన్నారు. విద్యా ప్రవేశాలతో పాటు వివిధ నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Read More »

లాక్‌డౌన్‌ ను పొడిగించే అవకాశం ఉంది…

కరోనా విజృంభణ నేపథ్యంలో నాలుగో దశ లాక్‌డౌన్‌ కూడా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ప్రసంగం ద్వారా అర్థమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే కరోనా కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. పేద ప్రజల కోసం ప్రధాని మోదీ రెండుసార్లు ప్యాకేజీలు ప్రకటించారని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కేంద్రం ఇస్తోన్న …

Read More »

ఏపీ బీజేపీ రాష్ట్ర రథసారధిగా రెండు సంవత్సరాలు పూర్తి….

అమరావతి: బీజేపీ రాష్ట్ర రథసారధిగా బాధ్యతలు చేపట్టి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రెండు సంవత్సరాలు పూర్తిచేసుకొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధనరెడ్డి తురగా నాగభూషణం, సెక్రటరీలు అడపా నాగేంద్ర, తల్లా వెంకటేష్ యాదవ్ రాష్ట్ర మానవహక్కుల విభాగం కన్వీనర్ బొమ్మనా సుబ్బరాయుడు, బీజేవైఎం జాతీయ కార్యదర్శి, పనతల సురేష్ పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు..

Read More »

ఆంధ్ర-తెలంగాణ జల వివాదంపై స్పందించిన కన్నా…

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య మరోసారి జల జగడం రాజుకుంది.. శ్రీశైలం డ్యామ్ మిగులు జలాలను పోతిరెడ్డిపాడుకు తరలించాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే  తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు .. న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఇక, ఈ వివాదంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు .. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం …

Read More »

సీఎం జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ…

గుంటూరు: ఎల్జీ పరిశ్రమలో ప్రమాదంపై సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ‘‘గ్యాస్ లీకేజి ప్రమాదంలో మరణించిన వారు, ఆసుపత్రి పాలైన వారంతా పేదలేనని అన్నారు. లీకేజికి కారణం మానవ తప్పిదమేనని స్పష్టంగా తెలుస్తోంది. కనీస రక్షణ చర్యలు చేపట్టుకుండా పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఇతర కమిటీల విచారణతో నిజాలు బయటకు వచ్చే అవకాశం …

Read More »

విశాఖ పరిశ్రమను సందర్శించిన కన్నా ..

విశాఖపట్నం: విషవాయువు విడుదలై పెను విషాదానికి కారణమైన విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, ఇతర బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ… మృతులకు, బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టాలని కోరారు. చిన్నారులు చాలా మంది అస్వస్థతకు గురయ్యారని… వాళ్ళందరికీ దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం …

Read More »