Breaking News
Home / Tag Archives: ap governor

Tag Archives: ap governor

గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ మేరకు గవర్నర్ అపాయింట్‌ ఇచ్చినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు అయిన వెంటనే గవర్నర్‌ను ఒకసారి కలవడం ముఖ్యంత్రులకు ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారని తెలియవచ్చింది.

Read More »

నేడు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు. వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అరెస్టులు, దళితులపై దాడులు, దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు, 4 రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు …

Read More »

రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తోంది: గవర్నర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా మంగళవారం ఆయన రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. 2019-2020లో ఏపీ 8.16 శాతం ఆర్థిక వృద్ధి చెందిందని చెప్పారు. సేవారంగంలో 9.1శాతం గ్రోత్ కనిపించిందని తెలిపారు. ఇక పారిశ్రామిక రంగంలో 5 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి సాధించినట్లుగా తెలిపారు. …

Read More »

ఏపీ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే

అమరావతి: ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. దేశంలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో ప్రధానాంశాలు ఇవే: 1. మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం 2. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం 3. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం 4. అణగారిన …

Read More »

విశాఖ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

విశాఖపట్నం: విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల తరలింపులో రెడ్‌క్రాస్ వాలంటీర్‌ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్‌క్రాస్‌కు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ఏపీ గవర్నర్ తో చంద్రబాబు భేటీ…

అమరావతి: ఏపీ గవర్నర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు తెలిపారు.

Read More »

రాజమండ్రికి చేరుకున్న గవర్నర్…

రాజమండ్రి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం రాజమండ్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్, పాలకమండలి చైర్మన్ ఆచార్య కే.సి.రెడ్డికి గౌరవ డాక్టరేట్, ఉభయగోదావరి జిల్లాల్లోని 567 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు, 8 స్వర్ణ పతకాలు, 6 పీహెచ్‌డీలను గవర్నర్ అందజేయనున్నారు.

Read More »

గవర్నర్ తో చంద్రబాబు భేటీ….

విజయవాడ: ఏపీ గవర్నర్‌తో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మీడియాపై ఆంక్షలు, జీవో 2430ని రద్దు చేయాలని గవర్నర్‌కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు. ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5 చానెళ్లను ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ నేతలు వివరించారు.

Read More »

చట్టం ముందు అందరూ సమానమే…

విజయవాడ: ఏపీ రాజభవన్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముందు సామాన్యులు నుంచి సంపన్నుల వరకు అందరూ సమానమే అన్నారు. ‘దేశ సమగ్రతను దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదు. హక్కులకు భంగం కలిగితే ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. న్యాయవ్యవస్థ, …

Read More »

గవర్నర్ తో మంత్రి ప్రదాన్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కేంద్ర ఇంధన, రసాయన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయనతో చర్చించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ కేంద్ర మంత్రిని కోరారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ధర్మేంద్రప్రదాన్‌కు మాజీ మంత్రి మాణిక్యాల రావు, పలువురు రాష్ట్ర స్థాయి బీజేపీ …

Read More »