విశాఖపట్నం: సకాలంలో పన్నులు చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని మంత్రి పేర్నినాని అన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లలో ఉండడం వల్లే విద్యుత్ మీటర్లు ఎక్కువగా తిరిగి, బిల్లులు కూడా ఎక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలోని పలు కాలనీలల్లో మంత్రి పేర్ని నాని పర్యటించారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక కష్టాలు పడుతున్న వారంతా ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్ చార్జీలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలర్ టీవీ ఆన్‌చేసి ఉంచితే బిల్లు …
Read More »ప్రయాణాలకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం…
విజయవాడ: ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా …
Read More »కర్ఫ్యూ పరిస్థితిని పరిశీలించిన మంత్రి…
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని సుడిగాలి పర్యటన చేశారు. బైక్‌పై తిరుగుతూ కర్ఫ్యూ పరిస్థితిని మంత్రి పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
Read More »బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం…
అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ”కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశాం… 24గంటలు …
Read More »ఇంటర్ వాల్యూయేషన్ వాయిదా
అమరావతి : లాక్డౌన్ క్రమంలో ఏపీ ఇంటర్ పరీక్షల వాల్యూయేషన్ వాయిదా వేస్తున్నట్లు మంత్రి పేర్నినాని ప్రకటించారు. కరోనా జాగ్రత్తలపై ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తామని, అంగన్వాడీలు ఇళ్ల దగ్గరికే వచ్చి పౌష్టికాహారం అందిస్తారన్నారు. కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తామని, కరోనా లక్షణాలు బయటపడితే ఏం చేయాలనే దానిపై వివరిస్తామని నాని వెల్లడించారు. కరోనా కట్టడిలో గ్రామవాలంటీర్లది కీలక పాత్ర అని నాని చెప్పారు.
Read More »సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి…
విజయవాడ: మచిలిపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు బందరు ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనన్నారు. బందరులో ఏర్పాటు చేయబోయే కళాశాలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పదినెలలలోపే కార్యరూపం దాల్చే విధంగా సీఎం …
Read More »ఆ వీడియోను ప్రదర్శించిన ప్రభుత్వం…
అమరావతి: ఏపీ శాసన మండలి రద్దు అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా నాటి వైఎస్ హాయాంలో మండలి పునరుద్ధరణను పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రసంగ వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు తన జీవితంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు యూటర్నేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోనన్న చంద్రబాబు.. ఆ తర్వాత అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చారన్న విషయాన్ని …
Read More »ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత..
మచిలీపట్నం : ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. తన కార్యాలయానికి ఉదయం 6 గంటల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి వారి సమస్యల వినతి పత్రాలను తీసుకున్నారు. కొన్ని అర్జీలను సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ లో మాట్లాడి అప్పటికప్పుడే వాటిని పరిష్కరించారు.
Read More »నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు…
అమరావతి: నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 బస్సులు సీజ్ చేశామని, సంక్రాంతికి 3 వేలకు పైగా స్పెషల్ బస్సులు నడిపామని పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని, పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తామని మంత్రి పేర్కొన్నారు నేటి నుంచి మళ్లీ తనిఖీలు నిర్వహిస్తామని …
Read More »13 జిల్లాల్లో అభివృద్ధి సమానంగా జరగాలి…
అమరావతి: కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ..ప్రత్యేక దృష్టి పెట్టాలని చర్చించామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేవలం పరిపాలనే కాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలన్నదానిపై చర్చించామన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి సమానంగా జరగాలన్నారు. అభివృద్ధి కేంద్రీకృతం అవడం వల్ల గతంలో చాలా నష్టపోయామన్నారు. ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు పెరగకుండా.. అభివృద్ధి వికేంద్రీకృతం కావాలన్నారు. మళ్లీ 13న మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. …
Read More »