Breaking News
Home / Tag Archives: Ashwathama Reddy

Tag Archives: Ashwathama Reddy

ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది..

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయాన్ని ఎండీకి పంపిస్తామని, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. ఆదివారం డిపోల ఎదుట మానవహారం నిర్వహిస్తామని ప్రకటించారు. రేపు ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని, ప్రైవేటీకరణ చట్టంలో లేదని వెల్లడించారు. కార్మికులు ఆందోళన చెందవద్దని, రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని …

Read More »

అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన…

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, నేడు మాట మార్చారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం బేషరతుగా ఆహ్వానిస్తే, సమ్మెను విరమిస్తామని ప్రకటించిన ఆయన నేడు ఆర్టీసీ సమ్మె యధాతథంగా జరుగుతుందని ప్రకటించారు. కార్మికుల వల్ల ఆర్టీసీకి నష్టం రాలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టాల్లో ఉందని ఆరోపించారు. తాము ఎన్నో మెట్లు దిగొచ్చి, సమ్మెను విరమిస్తామని ప్రకటించినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. శనివారం నాడు అన్ని …

Read More »

అశ్వత్థామరెడ్డికి అస్వస్థత…

హైదరాబాద్‌: ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంవో రఫీ తెలిపారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని వారిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం షుగర్‌, బీపీ లెవల్స్ బాగా పెరిగిపోయాయని..సెలైన్స్‌, ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నట్లు ఆయన వివరించారు. మరోవైపు అశ్వత్థామ, రాజిరెడ్డిలను సీపీఐ …

Read More »

ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం….

హైదరాబాద్: ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆఫీసులో దీక్షకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యూనియన్‌ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అశ్వత్థామరెడ్డిని కూడా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు పోలీసుల యత్నిస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Read More »

ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశo

హైదరాబాద్: విద్యానగర్ లో ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. హైకోర్టులో సమ్మెపై వాదనలు, విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ అంశంపై చర్చించనున్నారు.

Read More »

ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలి…..

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసి జేఎసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పందించారు. హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, కమిటీ ఏర్పాటుకు తాము అంగీకరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుతో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More »

ప్రభుత్వంపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాము….

హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను, ఛలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో గాయాలపాలైన కార్మికుల కుటుంబాలను గవర్నర్‌ వద్దకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Read More »

సకల జనుల దీక్ష విజయవంతం…

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జనుల సామూహిక దీక్ష’ విజయవంతమైందని ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు పలు మహిళా సంఘాలు ఈ కార్యక్రమం జయప్రదం చేయడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి మద్దతిచ్చిన మహిళలు, ప్రజాసంఘాలకు ఐకాస తరఫున అశ్వత్థామరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై మహిళలపై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం ఉదయం అన్ని ఆర్టీసీ డిపోల వద్ద …

Read More »

ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం..

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరుకుంది. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును కాదని అంతా సమ్మెలోనే కొనసాగుతున్నారు. అక్కడక్కడా కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే విధుల్లో చేరుతున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్ల పరిష్కారానికి సమ్మెను ఉధృతం చేసే దిశగా ఈ నెల …

Read More »

ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదు…

హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించి నేటి అర్ధరాత్రి లోగా విధుల్లో చేరితే సరేసరని, లేదంటే ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇలాంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూశామన్నారు. కోర్టులనే ధిక్కరించిన ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రెవెన్యూ అధికారులను విలన్లుగా చిత్రీకరించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.

Read More »