Breaking News
Home / Tag Archives: Baby

Tag Archives: Baby

అప్పుడే పుట్టిన చిన్నారికి ‘కరోనా’

బీజింగ్‌: చైనాలో వేగంగా విస్తరిస్తూ వందలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా వైరస్‌.. అప్పుడే పుట్టిన వారిని సైతం వదలడం లేదు. తాజాగా.. పుట్టిన 30 గంటలకే ఓ చిన్నారికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఈ చిన్నారే అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం. బిడ్డకు జన్మనివ్వడానికి ముందే తల్లి సైతం కరోనా బారిన పడింది. దీన్ని …

Read More »

‘అమ్మా’నుషం.. చిన్నారిని చంపేసిన కన్నతల్లి

కాలువలో శవమై తేలిన నాలుగు నెలల పసికందు చిన్నారిని చంపేసిన కన్నతల్లి భార్యాభర్తలను విచారిస్తున్న పోలీసు అధికారులు జమ్మలమడుగు/మైలవరం: ఓ తల్లి తన కన్న బిడ్డనే కడతేర్చిన ఘటన జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన లింగాల నాగేంద్రయాదవ్‌, సుభాషిణి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. రెండు సంవత్సరాలు వయస్సు కలిగిన ఒక బాలిక కాగా రెండో …

Read More »

వాషింగ్ మెషీన్‌లో పిల్లాడిని చూసి షాకైన తండ్రి….?

కొన్ని సంఘటనలు నవ్వుకోవడానికి బాగుంటాయి. మరికొన్ని గుండె ఆగిపోయాలా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే దుస్తులు ఉతుకుతుంటే వాషింగ్ మెషీన్‌ లో పిల్లాడు కనిపిస్తే ఎలా ఉంటుంది, మేరె చెప్పండి. చాలా భయం వేస్తుంది కదా. ఇలాంటి సంగటన ఒకటి రష్యాకు చెందిన ఓ తండ్రికి కూడా ఇదే అనుభవం ఒకటి ఎదురైంది. వాషింగ్ మెషీన్‌ లో దుస్తులు ఉతుకుంతుండగా సడన్ గా …

Read More »

పాపం.. పసిపాప.. రైలు బోగీలో చంటిబిడ్డ…..!

తిరుపతి: పాపం ఏ కన్నతల్లి బిడ్డో.. ఎంత దూరం అలా ఒంటరిగా ప్రయాణించిందో.. చివరికి తిరుపతిలో అనామికగా ప్రత్యక్షమైంది. తల్లి ఎవరో కానీ ఆడబిడ్డ పుట్టిందని భారంగా భావించిందో తెలియదు. చూడచక్కటి ముఖవర్చస్సుతో ముద్దులొలుకుతున్న బిడ్డను రైలు బోగీలో వదిలేసి వెళ్లింది. షిరిడీ నుంచి తిరుపతికి వచ్చే ట్రైన్‌ (నంబరు 17418) వేకువజామున 12.30 గంటలకు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. రైలులోని ఓ కంపార్టుమెంట్‌లో 20 రోజుల వయసున్న ఓ చిన్నారి …

Read More »

జీజీహెచ్‌లో శిశువును వదిలెళ్లిన తల్లి….

గుంటూరు : సోమవారం తెనాలి జీజీహెచ్‌లో 18 రోజుల వయసున్న ఆడ శిశువును ఓ తల్లి వదిలివెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ 18 రోజుల క్రితం ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరి, ప్రసవానంతరం ఈ రోజు బిడ్డను వదిలి వెళ్ళిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Read More »

ఆడపిల్లగా పుట్టినందుకే ఈ దారుణం…

హైదరాబాద్: హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి ఆవరణలోని చెత్తకుప్పలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంటిబిడ్డను ప్లాస్టిక్ కవర్ లో చుట్టి వదిలివెళ్లారు. చంటిబిడ్డ ఏడుపు విని స్థానికులు గుర్తించారు. ఆడపిల్ల పుట్టిందని వదిలేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో దొరికిన చంటిబిడ్డకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేస్తున్నారు. బిడ్డను ఎవరు వదిలివెళ్లారనే విషయం కనుగొనేందుకు సిబ్బంది సీసీటీవీలో పరిశీలిస్తున్నారు.

Read More »