Breaking News
Home / Tag Archives: Bihar state

Tag Archives: Bihar state

బీహార్ మంత్రి కుమారునిపై దాడి…

పట్నా : మాధేపురా జిల్లాలో ఆదివారం ఉదయం బిహార్‌ మంత్రి బీమా భారతి కొడుకు రాజ్‌కుమార్‌ శ్రీపూర్‌ గ్రామంలో తన స్నేహితుడిని డ్రాప్‌ చేసి ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో కారులో రాజ్‌కుమార్‌తో పాటు అతని కజిన్‌ సంజయ్‌కుమార్‌ కూడా ఉన్నాడు. అయితే భట్గామ గ్రామ సమీపంలో ముగ్గురు వ్యక్తులు వీరి కారును ఆపి అనంతరం వీరిపై రివాల్వర్‌ బట్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ రాజ్‌కుమార్‌, సంజయ్‌లను …

Read More »

బీహార్‌లో చోటుచేసుకున్న భారీ చోరీ…

బీహార్‌: బీహార్‌లోని పాట్నాలో మెహిదీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గోడౌన్ వద్ద సెక్యూర్టీ గార్డు, డ్రైవర్‌ను బంధించిన దుండగులు సుమారు 50 లక్షల ఖరీదైన ఎల్ఈడీ టీవీలను ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దంతేరాస్‌, దీపావళి పండుగల నేపథ్యంలో స్థానిక వ్యాపారి భారీ ఎత్తున టీవీలను గోడౌన్‌కు తెప్పించారు. ఆదివారం రాత్రి 11.30 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకున్నది. 250 ఎల్ఈడీ టీవీలతో …

Read More »

బీహార్‌లో 1,923 మందికి డెంగ్యూ జ్వరాలు…

పాట్నా: భారీవర్షాలు, వరదలతో అల్లాడిన బీహార్ రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలు ప్రబలడంతో జనం అల్లాడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో 1923 మందికి డెంగ్యూ జ్వరాలు, మరో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు ప్రబలాయని వైద్యులు జరిపిన రక్త పరీక్షల్లో తేలింది. బీహార్ రాజధాని నగరమైన పాట్నాలోనే 1410 మందికి డెంగ్యూ జ్వరాలు రాగా పరిసర ప్రాంతాల్లో 150 మందికి చికున్ గున్యా జ్వరాలు వచ్చాయి. లోతట్టు …

Read More »

భారీ వరదలు…900 మందికి డెంగ్యూ…

బీహార్‌: ఇటీవల బీహార్‌లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పాట్నాలో డెంగ్యూ ప్రబలినట్లు వచ్చిన ఆందోళనపై ఆయన చర్చించారు. ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం పాట్నాలోనే 900 మందికి డెంగ్యూ సోకినట్లు తేలింది. సెప్టెంబర్‌లో వచ్చిన వరదల తర్వాత ఈ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 12 మంది అధికారులను …

Read More »

గ్రామంలో మొసళ్ళు…భయాందోళనలో ప్రజలు…

బీహార్‌: బీహార్‌లోని రియాషి ప్రాంతంలో మొసళ్లు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పిప్రాసిలోని పార్సౌని గ్రామంలో మొసలి ఓ ఇంట్లోకి చొరబడింది. గమనించిన కుటుంబీకులు మొసలిని చూసి భయంతో బయటకు పరుగులు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అందరూ కలిసి ఆ ముసలిని చాకచక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పార్సౌని గ్రామంలోని చెరువులో డజన్ల కొద్దీ మొసళ్లు ఉన్నాయని, వాటిని అక్కడి నుంచి తరలించాలని స్థానికులు అధికారులను …

Read More »

వరదలపై లాలూ గళమెత్తిన యువకుడు….

పాట్నా: ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బీహార్‌లో వరదలు పోటెత్తడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల గోడు కళ్లకు కట్టేందుకు పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణ యాదవ్ అనే యువకుడు సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గొంతును అనుకరిస్తూ సీఎం నితీశ్ కుమార్‌ను నిలదీశాడు. అచ్చం …

Read More »

49 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు….

బీహార్‌ : మూక దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన 49 మంది సెలబ్రిటీలపై బీహార్‌లోని ముజఫర్ పూర్‌లో కేసు నమోదైంది. వీరిపై దేశద్రోహ ఆరోపణలతో కేసును నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సినీ దర్శకుడు మణిరత్నం, రామచంద్ర గుహ, అపర్ణా సేన్‌, శ్యామ్‌ బెనగళ్‌, అనురాగ్‌ కశ్యప్‌, సౌమిత్ర ఛటర్జీ తదితరులు ఉన్నారు. ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై మూక హత్యలను …

Read More »

వర్షాల కారణంగా రద్దయిన కార్యక్రమాలు…

పాట్నా: బీహార్‌ ప్రభుత్వం రేపు గాంధీ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్‌ జీవన్‌ హర్యాలీ అభియాన్‌ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసింది. అయితే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, 12 జిల్లాల్లో వరద ముంచెత్తడం, పాట్నా రోడ్లపై నీరు నిలిచి సముద్రాన్ని తలపిస్తుండటంతో రేపటి కార్యక్రమాలను బీహార్‌ ప్రభుత్వం రద్దు చేసింది. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో సహా చేపట్టిన …

Read More »

ప్రజల ఆవేదనకు ఓ యువతీ నిర్వాకం…

పట్నా: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీహార్‌ అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి నీరు అక్కడే..ఎక్కడ జనాలు అక్కడే. వారం రోజులుగా వారి వేదన వర్ణనాతీతం. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో నరకం అనుభవిస్తున్నారు. ఓవైపు జనాలు అల్లాడిపోతుంటే, అదే వర్షపు నీటిలో ఓ యువతి ఫొటోషూట్‌ చేయించుకుంది. ఫలితంగా నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంటోంది. పాట్నాకు చెందిన అదితి సింగ్‌ అనే ఫ్యాషన్‌ టెక్నాలజీ …

Read More »

40 మంది మృతి…9 మందికి గాయాలు…

పాట్నా: బీహార్ లోని చాలా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. పాట్నాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరదల కారణంగా ఇప్పటి వరకు 40 మంది మృతి చెందగా 9 మందికి గాయాలైనట్లు బీహార్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. కుండపోత వర్షాలతో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More »