Breaking News
Home / Tag Archives: bjp leader

Tag Archives: bjp leader

BJP అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం

తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కుక్కల్ని కాల్చినట్లు కాల్చామంటూ పశ్చిమబెంగాల్ BJP అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో మాత్రం మమత ఓట్ల కోసం నిరసనకారులపై ఎలాంటి చర్యలకు సిద్ధపడటం లేదని వ్యాఖ్యానించారు. కాగా దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నిరసనకారులు కుక్కల్లాగా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Read More »

దళిత మహిళపై బీజేపీ నాయకుడి అత్యాచారం…అరెస్ట్

భోపాల్ (మధ్యప్రదేశ్): ఓ దళిత మహిళపై బీజేపీ నాయకుడు అత్యాచారం చేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో వెలుగుచూసింది. అశోక్ నగర్ జిల్లాకు చెందిన దేవేంద్ర తమ్రాకర్ బీజేపీ మీడియా ఇన్‌చార్జీగా పనిచేస్తున్నాడు. దేవేంద్రకు సింగ్రౌలీ జిల్లాలో వ్యవసాయ క్షేత్రముంది. ఇతని వద్ద ఓ దళిత మహిళ భర్త కూలీగా పనిచేసేవాడు. తనకు ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించిన బీజేపీ నాయకుడు దేవేంద్ర కారులో తన భర్తతో సహా …

Read More »

ధర్నా చేస్తే చీమ కుట్టినట్లు కూడా లేదు….

విజయవాడ: సోమవారం మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. బంగారం, డబ్బు దాచుకున్నట్లు ఇసుక దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ తప్పులు బయటకి రాకుండా జీవో తెచ్చి మీడియా నోరు నొక్కారని అన్నారు. ఇసుక లేదంటూనే బెంగళూరు, హైదరాబాద్‌కు …

Read More »

జమ్మూకాశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు…

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా బోనిగాం గ్రామంలో ఉగ్రవాదులు బీజేపీ నాయకుడికి చెందిన రెండు కార్లకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన బీజేపీ నాయకుడు అదిల్‌ అహ్మద్‌ నివాసం బయట జరిగింది. ఆదిల్ నివాసం బయట పార్క్ చేసిన వాహనాలకు ఉగ్రవాదులు నిప్పు పెట్టిన సమయంలో ఆయన ఇంట్లో లేరని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read More »

అనాలోచిత నిర్ణయం వల్ల ఇసుక కొరత….

అనంతపురం: బీజేపీ నేత మాణిక్యాలరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇసుక కొరత ఏర్పడిందని విమర్శిస్తూ వారం రోజుల్లో ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇసుక సత్యాగ్రహం చేపడతామన్నారు. భవన నిర్మాణం కార్మికులకు నెలకు రూ. 10వేలు చొప్పున సాయం అందించాలని కోరారు. నచ్చని ఛానల్‌ను నిలుపుదల చేస్తున్నారని, ప్రజల హక్కులను విస్మరించడం సరికాదన్నారు.

Read More »

టీడీపీ పార్టీపై బీజేపీ నేత వ్యాఖ్యలు….

విజయవాడ: నేడు బీజేపీ నేత రాం మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని, టీడీపీ మునిగిపోతున్న నావ అని, అందరూ పార్టీని వీడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు తీరుందని విమర్శించారు. ఏపీలో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, అన్ని ఎన్నికలలో సొంతంగా …

Read More »

పోలవరంపై బీజేపీ నేత వ్యాఖ్యలు….

అమరావతి : పోలవరం విషయంలో టీడీపీ మాదిరిగానే వైసీపీ తప్పులు చేస్తోందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే బాటలో వెళ్తోందన్నారు. చేతకాదని చెబితే కేంద్రమే పోలవరం నిర్మాణం చేపడుతుందన్నారు. రాజధాని విషయంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరారు. వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.

Read More »

వారిద్దరూ సీమలో పుట్టడం దౌర్భాగ్యం: బీజేపీ

కర్నూలు: నేడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పాలన సరిగ్గా లేదని, చంద్రబాబు, జగన్ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్, చంద్రబాబు సీమలో పుట్టడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని, ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు రాకపోయిన ఇక్కడి హక్కుల సాధనపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. రాయలసీమ హక్కుల …

Read More »

పాలన ఎలా ఉందో ఓ సారి ఆలోచన చేయాలి….

గుంటూరు: పొన్నూరులో బీజేపీ గాంధీ సంకల్ప యాత్రలో ఆ పార్టీ నేతలు టుబాకో బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు, జయప్రకాశ్, టి.వి.రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ బాబు మాట్లాడుతూ అమరావతి తరలింపు అనేది పిచ్చి తుగ్లక్ ఆలోచన అని దుయ్యబట్టారు. హైకోర్టు కర్నూలుకు తరలింపునకు బీజేపీ మద్దతు తెలుపుతుందని, రాజధాని వికేంద్రీకరణ చేసుకోవచ్చన్నారు. పాలన ఎలా ఉందో వైసీపీ ఓ సారి ఆలోచన చేసుకోవాలని హితవు పలికారు.

Read More »

వారిని కలిసిన బీజేపీ నేత సత్యకుమార్‌…

గుంటూరు: దాదాపు పదమూడేళ్ల క్రితం జరిగిన ఆయేషా మీరా హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. 2007లో హాస్టల్‌లో జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆయేషా మీరా తల్లిదండ్రులను కలవడం చర్చనీయాంశమైంది. బుధవారం తెనాలిలోని ఆయేషా తల్లిదండ్రులను ఆయన కలిసిన సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఆయేషా తల్లిదండ్రులు వివరించారు. ఈ కేసును కేంద్ర హోంశాఖ మంత్రి …

Read More »