Breaking News
Home / Tag Archives: BJP

Tag Archives: BJP

బీజేపీ ఎమ్మెల్యేకు కోవిడ్ -19 పాజిటివ్

భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు చేయగా..కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన కొన్ని గంటల తర్వాత బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. తన భార్యకు కూడా …

Read More »

రేపు ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు

హైదరాబాద్: ప్రజా సమస్యలపై రేపు ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ అపోయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో రేపు ప్రగతి భవన్ ముట్టడి చేయాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు లక్ష్మణ్ , ఎమ్మెల్యే రాజసింగ్, రాంచంద్రరావుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి జరుగనుంది.

Read More »

కర్ణాటక బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే..

న్యూఢిల్లీ: కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ సోమవారంనాడు ప్రకటించింది. ఎర్రన్న కడాడి, అశోక్ గస్తి పేర్లను పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఇద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్‌తో అనుబంధం ఉన్న నేతలే కావడం విశేషం. కాగా, కర్ణాటక రాష్ట్ర బీజేపీ విభాగం ప్రభాకర్ కోరె, రమేష్ కట్టి, ప్రకాష్ షెట్టి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే, కేంద్రం మాత్రం ఊహించని విధంగా …

Read More »

ప్రపంచానికి మోదీ ఆదర్శం

ప్రధాని నరేంద్రమోదీ తన పాలనా సామర్థ్యంతో ప్రపంచానికే ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి కన్నా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో మోదీ పారదర్శకమైన పాలనతో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశారని, దీర్ఘకాలిక…

Read More »

గుంటూరు: బీజేపీ ఆధ్వర్యంలో అన్నదానం

గుంటూరు: జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ రోజు 500 మందికి పౌష్టిక ఆహారాన్ని బీజేపీ పంపిణీ చేయనున్నారు. లాక్‌డౌన్ ముగిసే వరకు ఆహారాన్ని పంపిణీ చేస్తామని బీజేపీ అర్బన్ అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తెలిపారు.

Read More »

బలపరీక్ష జరగాల్సిందే…

మధ్యప్రదేశ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26కి వాయిదా వేయడంతో కమల్‌నాథ్ సర్కారుకు కాస్త ఊరట లభించింది. అయితే బలపరీక్ష జరిగేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కారు మైనార్టీలో పడిందని.. వెంటనే విశ్వాస పరీక్ష జరిగేలా చూడాలని పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

Read More »

నేటి ముఖ్యాంశాలు..

తెలంగాణ ♦ నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ♦ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో తీర్మానం ♦ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం జాతీయం ♦ నేటి నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ♦ తొలిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న గవర్నర్ ♦ విశ్వాస పరీక్షపై నిర్ణయం సభలో ప్రకటిస్తానన్న స్పీకర్ ♦ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ

Read More »

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రాజ్యం ఏలుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యకర్తలు, యువకుల మీద ఒక్క లాఠీ దెబ్బ పడినా కేసీఆర్‌ గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు. నమ్మిన సిద్ధాంతం, …

Read More »

దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ

నోడాయి: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఆజాద్‌ సమాజ్‌ పార్టీ’గా నామకరణం చేసి అధికారికంగా ప్రకటన చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ పార్టీ పేరును వెల్లడించారు. ‘కాన్షీరాం చేపట్టిన మిషన్‌ అసంపూర్తిగా ఉంది. దాన్ని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ పూర్తి చేస్తుంది’ అంటూ …

Read More »

రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఝలక్‌

గుజరాత్‌: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. గుజరాత్‌లో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తమ రాజీనామా లేఖలను ఆదివారం అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్రత్రివేదికి సమర్పించారు. గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు మార్చి 26న ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేల పేర్లను సోమవారం ప్రకటిస్తామని స్పీకర్‌ రాజేంద్రత్రివేది …

Read More »