Breaking News
Home / Tag Archives: bus accident (page 2)

Tag Archives: bus accident

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…

ముంబై: పూణె – ముంబై జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

Read More »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం….

కర్నూలు: నంద్యాల విజయ డైరి సమీపంలో బైక్‌ను తప్పించబోయి నిలిచి ఉన్న మిని లారీని మార్నింగ్ స్టార్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గిద్దలూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read More »

మదీనా ప్రమాదంపై ప్రధాని విచారం….

న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. Anguished by the news of a bus crash near Mecca in …

Read More »

మదీనాలో ఘోర రోడ్డు ప్రమాదం…

సౌదీ అరేబియా : యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి …

Read More »

నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

నేపాల్: నేపాల్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 14మంది ప్రయాణికులు మరణించగా, మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ దేశంలోని సింధూపాల్ చౌక్ ప్రాంతంలో 120 మంది ప్రయాణికులతో వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చర్ అయి ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు టైరు పంక్చరు అవడంతో లోయలో పడింది. ఈ బస్సు ప్రమాదంలో 14మంది మరణించగా, 98 మంది గాయపడ్డారని సింధూపాల్ చౌక్ డీఎస్పీ  చెప్పారు. …

Read More »

దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం…

పెరు : దక్షిణ అమెరికాలోని పెరులో 50 మందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 23 మంది మృతి చెందారు. మిగిలిన వారు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు పడిపోయిన లోయలోతు దాదాపు వంద మీటర్లుటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, పర్వత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం మెలికలు తిరిగి ఉండడమే ప్రమాదానికి …

Read More »

ప్రమాదవశాత్తూ నదిలో పడిన బస్సు…

మధ్యప్రదేశ్: వేగంగా వస్తున్న బస్సు నదిలో పడి ఆరుగురు మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైజెన్ జిల్లాలో జరిగింది. ఛతారాపూర్ నుంచి ఇండోర్ వస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ నదిలో పడింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భోపాల్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు నదిలో పడినపుడు అందులో 45మంది ప్రయాణికులున్నారని కలెక్టర్ చెప్పారు. పోలీసులు …

Read More »

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం…

అహ్మదాబాద్: గుజరాత్‌లోని బనస్కాంతా జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు లగ్జరీ బస్సు బోల్తా పడిన ఘటనలో దాదాపు 21 మంది దుర్మరణం పాలయ్యారు.  అంబాజీ పట్టణ సమీపంలో త్రిశూల్‌ ఘాట్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈఘటనలో దాదాపు 21 మంది మరణించగా, 50 మంది గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. …

Read More »