Breaking News
Home / Tag Archives: car accident

Tag Archives: car accident

రూ. 2 కోట్ల కారు..కొన్న కాసేపటికే

ఎంతో మోజు పడి..ముచ్చట పడి..కారు కొన్నాడు. తాను ఎంతో కలలు కని..కొన్న కారును అందరికీ చూపిద్దామని..గర్వంగా ఫీయిలయ్యాడు. దాదాపు రూ. 2 కోట్లు పెట్టి కొన్న కారు కాసేపటికే ధ్వంసం కావడంతో అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. తాను ఎంతో ముచ్చటపడి కొన్న కారు తన కళ్లెదుటే నుజ్జునుజ్జు కావడం..అతని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. బ్రిటన్ లోని వేక్ ఫీల్డ్ …

Read More »

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారుకి ప్రమాదం…

హైదరాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ టికెట్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ వెళుతుండగా.. ఆమె కాన్వాయిలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు పార్టు దెబ్బతిన్నది. కారులోని వారికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని.. తాను సేఫ్ గానే ఉన్నానని …

Read More »

వీరవల్లిలో రోడ్డు ప్రమాదం…

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో మంగళవారం కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గుంతలు తవ్వారు. ఆ రహదారిలో ప్రయాణిస్తున్న విజయవాడ అయోధ్యనగర్​కు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి కారు అదుపుతప్పి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More »

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురంలో ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మత్యపురి, కాజా గ్రామాలకు చెందిన సురేష్‌(22), చిట్టియ్య(45), కాశీ(22)గా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారును వెలికితీసింది. రొయ్యల సీడ్‌ కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read More »

కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు..

నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు వదిలారు. మృతులు వడ్డెరిగూడెంకు చెందిన దంపతులు ఓర్సు రఘు, అలివేలు, కూతురు కీర్తిగా గుర్తించారు. కుమారుడు కార్తీక్‌ను స్థానికులు కాపాడారు. కారు టైరు పేలి కాలువలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు.

Read More »

హైదరాబాద్‌లో కారు బీభత్సం..!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్ నెం.3లో కారు బీభత్సం సృష్టించింది. అదపుతప్పి ఓ కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. వెంటనే మంటలు చెలరేగడంతో కారు పాక్షికంగా దగ్ధమైంది. ఆ సమయంలో టిఫెన్ సెంటర్‌లో కొంతమందే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో కారు నడపడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ బ్యాగ్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోగా.. ఘటన అనంతరం కారు …

Read More »

చెరువులోకి దూసుకెళ్లిన కారు..

యాదాద్రి: రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురు కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది. కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గర …

Read More »

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

కడప: కడప జిల్లా చాపాడు మండలం కేతవరం వద్ద బ్రిడ్జి ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మృతుడు ఖాజీపేట తవ్వారు పల్లెకు చెందిన రామ శేఖర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ఖాజీపేటలోని శ్రీ సాయితేజ హైస్కూల్ కరస్పాడెంట్ పనిచేస్తున్నారు.

Read More »

మియాపూర్‌లో కారు బీభత్సం…

హైదరాబాద్ : మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో రోడ్డుపై ఉన్న జనాలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అఫ్సర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ను  అదుపులోకి తీసుకున్నారు.

Read More »

భరత్‌నగర్‌ బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు

హైదరాబాద్‌: నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. భరత్‌నగర్‌ బ్రిడ్జిపై నుంచి కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »