Breaking News
Home / Tag Archives: central minister

Tag Archives: central minister

పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారు…?

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ వేదికగా మరోసారి తేల్చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పోలవరం ప్రాజెక్ట్‌ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు..? అని కేంద్రాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఇందుకు కేంద్రమంత్రి షెకావత్ స్పందిస్తూ సమాధానమిచ్చారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సమాధానం ఇచ్చారు. లెక్కలు తేల్చిన కేంద్రం! ‘ఫిబ్రవరి నాటికి పోలవరం నిర్మాణం 69.54శాతం …

Read More »

టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్

టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన వారికి ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. టూరిస్టులను మరింత ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రోత్సాహకాన్ని నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక రూపంలో ఇస్తామని కేంద్రమంత్రి తెలిపారు.

Read More »

కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి సమావేశం

హైదరాబాద్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో ఎంపీ కోమటిరెడ్డి సమావేశమయ్యారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ కోసం నిధులు మంజూరు చేయాలని, ఐటీఐఆర్‌పై వచ్చే బడ్జెట్‌లో ప్రకటన చేయాలని ఆయన కోరారు. మూసీ శుద్ధికి నమామి గంగ ప్రాజెక్ట్‌ నుంచి నిధులు ఇవ్వాలని, తెలంగాణలో హైవేలకు నిధులు విడుదల చేయాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చెశారు.

Read More »

కేంద్ర మంత్రులది అంకెల గారడీ…

విజయవాడ: కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు మంగళం పాడిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై చర్చించేందుకుగాను ఈనెల 24వ తేదీన విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందన్నారు. ఏపీకి నిధులు విడుదల విషయంలో నిజాలను దాచిపెట్టి.. కేంద్ర మంత్రులు అంకెల గారడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర …

Read More »

మాటల్లో చెప్పడం కాదు…

న్యూఢిల్లీ: భారత్‌తో పాకిస్థాన్ స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటే.. దావూద్ ఇబ్రహీమ్‌లాంటి ఉగ్రవాదులను అప్పగించాలని కేంద్రమంత్రి జైశంకర్ సూచించారు. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు క్షీణదశకు చేరుకున్నాయంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ స్పందించారు. ‘భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో బలహీనంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థే ఉంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లో దాడులు …

Read More »

చైనా సరిహద్దుల్లో కేంద్రమంత్రి పర్యటన…

అరుణాచల్ ప్రదేశ్ : చైనా దేశ సరిహద్దుల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ శుక్రవారం ఉదయం పర్యటించారు. ఇండో-చైనా సరిహద్దు ప్రాంతమైన బుమ్లా పాస్ వద్ద రాజ్‌నాథ్‌సింగ్ భారతసైనికులను కలిసి మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న భారత సైనికులను కేంద్రమంత్రి అభినందించారు. దేశ సరిహద్దుల్లో సైనికులను కలిసే అవకాశం తనకు లభించిందని రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. సరిహద్దుల్లో పరిస్థితిని పరిశీలించిన కేంద్రమంత్రి సైనికులతో ముచ్చటించారు. అనంతరం …

Read More »

కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా….

ముంబై : కేంద్రమంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో.. అరవింద్ సావంత్ మోదీ కేబినెట్ నుంచి వైదొలిగారు. అయితే కేంద్ర కేబినెట్‌లో శివసేన నుంచి మంత్రిగా ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ మద్దతు కావాలంటే ఎన్డీయే నుంచి వైదొలగాని ఎన్సీపీ కండీషన్ పెట్టిన నేపథ్యంలో సావంత్ తన …

Read More »

ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రసవత్తర రాజకీయం….

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర రాజకీయం ఢిల్లీకి చేరింది. హోం మంత్రి అమిత్‌షాతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం భేటీ అయ్యారు. రైతుల సమస్యలపై అమిత్‌షాకు వినతి పత్రం సమర్పించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు సాయం కోరే ఉద్దేశంతో అమిత్‌షాను ఫడ్నవీస్ కలిశారని చెప్పినప్పటికీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. శివసేన డిమాండ్లు, …

Read More »

స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్…..

ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సు నేడు జరుగుతుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన సదస్సు నిర్వహణ జరిగింది.

Read More »

గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న రూపాల….

ప్రకాశం: బుధవారం ఒంగోలులో బీజేపీ నిర్వహించిన గాంధీజీ సంకల్పయాత్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగ రైతులకు గిట్టుబాటు ధరలు, పంట భీమా అమలు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి రైతులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాల సందర్భంగా ఆయన ఆశయాలను సాధించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహాత్మాగాంధీ సత్య, అహింసా విధానాలను అనుసరిస్తూ …

Read More »