Breaking News
Home / Tag Archives: chandra babu naidu

Tag Archives: chandra babu naidu

తెలంగాణలో నోరు మెదపరు.. ఏపీలో…?: చంద్రబాబు

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు పూర్తవ్వగానే… స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. నేడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం సమీక్షలు నిర్వహిస్తే ఎవరూ నోరు మెదపరని, ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడుతుంటే నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం పరిధిలో… ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు మాత్రమే పని చేయాలన్నారు. …

Read More »

మోదీకి వ్యతిరకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ పేరుతో దాడులు: చంద్రబాబు

ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశంలో స్వతంత్ర సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. మంగళవారం ముంబైలో బీజేపీయేతర పక్షాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ మోదీకి వ్యతిరకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ పేరుతో దాడులు చేయిస్తారని ఆరోపించారు. ఈవీఎంలలో లోపాలు సవరించడంలో ఈసీ పూర్తిగా విఫలమయిందన్నారు. చాలా దేశాల్లో బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు …

Read More »

కాసేపట్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

అమరావతి: కాసేపట్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ ముఖ్యనేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్‌ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహర శైలిపై ముఖ్యంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో వైసీపీ నేతల దాడులపై చర్చ జరగనుంది. కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు చంద్రబాబు …

Read More »

చంద్రబాబుపై ఈసీకి విజయసాయిరెడ్డి ఫిర్యాదు

అమరావతి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారంటూ లేఖ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలతో ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఖలో …

Read More »

శ్రీలంక మారణహోమంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కొలంబోలో ఆరు చోట్ల మారణహోమం జరగడం బాధాకరమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర ఈస్టర్ నాడే ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా శ్రీలంక పర్యటనలో ఉన్న అనంతపురం వాసుల క్షేమంపై బాబు ఆరాతీశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని బాబు వ్యాఖ్యానించారు. ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదన్నారు. మృతుల …

Read More »

చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: సీఎం చంద్రబాబుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు శుభాకంక్షలు చెప్పారు. ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.

Read More »

చంద్రబాబుకు గవర్నర్ బర్త్‌డే విషెస్

హైదరాబాద్: సీఎం చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ బర్త్‌డే విషెస్ చెప్పారు. చంద్రబాబుకు గవర్నర్ ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకులు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు.

Read More »

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ట్విట్టర్ వేధికగా చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం ఏపీ సీఎంకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు 69వ పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ నేతలు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు.

Read More »

69వ పుట్టినరోజును జరుపుకుంటున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 69వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో నేతలు, అభిమానులతో చంద్రబాబు గడపనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరుపతికి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన బ్లండ్ బ్యాంకును ప్రారంభిస్తారు. ట్రస్ట్ నిధులతోనే ఈ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. రాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు.

Read More »

నేడు సీఎం చంద్రబాబు జన్మదినం

ఉదయం కార్యకర్తలతో గడపనున్న సీఎం సాయంత్రం తిరుపతిలో బ్లడ్‌బ్యాంక్‌ ప్రారంభం అమరావతి: జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో నేతలు, అభిమానులతో గడుపుతారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్తారు. అక్కడ ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని అటునుంచి అటే తిరుపతి వెళ్తారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన …

Read More »