Breaking News
Home / Tag Archives: chandrababu naidu

Tag Archives: chandrababu naidu

మోదీని ప్రశంసిస్తూ చంద్రబాబు లేఖ…

అమరావతి: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలన్నారు. ప్రజానీకం ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని.. రైతులకు ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు.

Read More »

కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ పాటించండి…

అమరావతి : కరోనా రాకుండా ప్రజలు సామాజిక దూరం పాటించాలని చంద్రబాబు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేయాల్సిందని కానీ ప్రభుత్వం ఆలస్యంగా నిద్రలేచిందని తెలిపారు. కరోనా వైరస్‌పై అవగాహనకు సోషల్ మీడియాను వాడుకోవాలన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించగలిగితే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో నిరుపేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు.

Read More »

ప్రధాని సూచనలు పాటించండి: చంద్రబాబు

అమరావతి : భారత్‌లో కరోనా వైరస్‌ బాధితులు క్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సూచనలను పాటించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పిలుపునిచ్చారు. ‘భారత్‌లో కరోనా పెరిగిపోతోన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులను ప్రధాని మోదీ చాలా స్పష్టంగా తెలిపారు. కరోనా వ్యాప్తి …

Read More »

ప్రభుత్వ నిర్ణయానికి చంద్రబాబు మద్దతు

అమరావతి: స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అభ్యర్థులపై ఎదురుదాడి చేస్తారా..? అని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడం సరైన నిర్ణయం అన్నారు.

Read More »

పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి

అమరావతి : చంద్రబాబు నాయుడుతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు మారుతుంటాయని కానీ అధికారులు మాత్రం నిష్పక్షపాతంగా ఉండాలని హితవు పలికింది. తీవ్ర నేరాలకిచ్చే సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద నోటీసును చంద్రబాబుకు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో విశాఖ సీపీ, ఏసీపీలపై చర్యలకు హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణకు డీజీపీ వ్యక్తిగతంగా హాజరయ్యారు.

Read More »

టీడీపీ అభ్యర్థులను భయపెడుతున్నారు…

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే సమయంలో పోలీసులు అక్రమ బైండోవర్ కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వీళ్లకు భయపడి 180 మంది అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేదన్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడుతూ… చాలా స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read More »

గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు…

అమరావతి : ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కలవనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ శ్రేణులు చేసిన దౌర్జన్యాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. నామినేషన్లకు చివరి రోజైన నిన్న టీడీపీ అభ్యర్థులపై పలుచోట్ల దాడి జరిగింది. నామినేషన్ పత్రాలను చించేశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించిన …

Read More »

టీడీపీకి గట్టి షాక్.. బలరాం రాజీనామా

అమరావతి : టీడీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బలరాంతో పాటు ఆయన కుమారుడు కరణం వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీలో చేరనున్నారు. అటు బలరాం రాజీనామాతో ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు చీరాల నియోజకవర్గ ఇంఛార్జ్‌గా యడం …

Read More »

పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం వెళ్లింది…

అమరావతి : మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాల కార్లపై వైసీపీ వర్గీయులు చేసిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్‌లో బోండా ఉమాతో ఫోన్‌లో బాబు మాట్లాడారు. తాము వస్తున్నామని ముందే తెలియడంతో పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారని బోండా ఉమా అన్నారు. తాము వస్తున్నట్లు పోలీస్ స్టేషన్ నుంచి వైసీపీకి సమాచారం వెళ్లిందని, తమతో వచ్చిన …

Read More »

టీడీపీకి డొక్కా రాజీనామా

అమరావతి : టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. టీడీపీ అధిష్టానం వైఖరి తీవ్ర ఆవేదన గురిచేసిందని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా డొక్కా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు …

Read More »