Breaking News
Home / Tag Archives: chandrababu

Tag Archives: chandrababu

సీఎం చంద్రబాబుతో జేసీ బ్రదర్స్ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఎంపీ జేసి దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఉండవల్లిలోని సీఎం నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. తమ కుమారులకు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి సీఎంతో జేసీ బ్రదర్స్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

హెరిటేజ్ అభివృద్ధికి భువనేశ్వరి నిర్విరామంగా పనిచేస్తోంది: బాబు

చిత్తూరు: హెరిటేజ్ ప్లాంట్‌లో పాడి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. 26 ఏళ్లుగా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. హెరిటేజ్‌ సంస్థను చంద్రబాబు అభినందించారు. హెరిటేజ్ అభివృద్ధికి భువనేశ్వరి నిర్విరామంగా పనిచేస్తోందని, రాజకీయాలతో వ్యాపారం ముడిపడికుండా కుటుంబానికి హెరిటేజ్ బాధ్యతలు అప్పగించానని బాబు తెలిపారు. రైతుల సహకారంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు తెలిపారు.

Read More »

మేం చేసినంత సంక్షేమం కేసీఆర్ చేశారా: చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. తమ ప్రభుత్వం చేసినన్నీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని అన్నారు. ‘‘ఒకే రోజు రెండు పెద్ద సంస్థలు.. రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ధనిక రాష్ట్రాలు కూడా చేయనన్ని.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో చేశాం’’ అని చంద్రబాబు అన్నారు. ఇక అమరావతి …

Read More »

జన్మభూమి- మాఊరు గ్రాండ్‌ సక్సెస్‌: చంద్రబాబు

అమరావతి: జన్మభూమి- మాఊరు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ పని చేసినా ప్రభుత్వ భాగస్వామ్యంతో మంచి ఫలితాలొస్తాయన్నారు. రాష్ట్రంలో ఆరు సార్లు జన్మభూమి నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు పాల్గొన్నప్పుడే ఏ కార్యక్రమానికైనా సార్ధకత వస్తుందని పేర్కొన్నారు. 2 వేల మంది ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సంతృప్తి వచ్చిందని, పారదర్శకంగా పనిచేయడం వల్లే జన్మభూమి …

Read More »

సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు పెద్ద కానుక

అమరావతి: సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు …

Read More »

నేడు నెల్లూరుకు సీఎం చంద్రబాబు

నెల్లూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా దగదర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే బోగోలులో 60వేల మందికి భూపట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.

Read More »

లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ: చంద్రబాబు

అమరావతి: లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతామని, వర్జీనియాకు ధీటుగా విశాఖ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గురువారం తొమ్మిదవ రోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న ఒక్కరోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేశామని, రాష్ట్రానికి లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో సంపద సృష్టిస్తున్నామని.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. …

Read More »

అమరావతిలో రేపు మరో భవనానికి చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి: అమరావతిలో గురువారం మరో భవనానికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి ఎగ్జిబిషన్‌ గ్యాలరీ భవనానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్‌ ఆధ్వర్యంలో గ్యాలరీ నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ హాజరవుతున్నారు. అమరావతికి సంబంధించి ఫొటో గ్యాలరీ, నగర సమాచారం, బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మిస్తారు.

Read More »

జన్మభూమిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

అమరావతి: ఎనిమిదవ రోజు జన్మభూమిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన కష్టంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం’ అని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More »

‘బాబు, లోకేష్‌పై మోదీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు’

అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై ప్రధాని మోదీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేత జగన్‌పై ఉన్న కేసులన్నీ విచారించాలని డిమాండ్ చేశారు. రూ.వేలకోట్లు దోచుకున్న జగన్‌ను జైలులో పెట్టాల్సిందేనన్నారు. వైసీపీ సీనియర్‌ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రాణహాని ఉందని గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమని బుద్దా వెంకన్న అన్నారు.

Read More »