Breaking News
Home / Tag Archives: chennai

Tag Archives: chennai

లోన్ ఇవ్వలేదని బ్యాంక్ అధికారులపై దాడి….

చెన్నై: లోన్‌ మంజూరు చేయలేదనే కారణంతో ఓ వ్యక్తి బ్యాంక్‌ అధికారులపై దాడి చేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది.  కోయంబత్తూర్‌ కెనరా బ్యాంక్‌ శాఖలో వెట్రివేల్ అనే వ్యక్తి తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకు వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు. కానీ బ్యాంక్‌ అధికారులు ఆయన లోన్ …

Read More »

తమిళనాడులో భారీ వర్షాలు…

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కోయంబత్తూరు మెట్టుపాళ్యం సమీపంలో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Read More »

తమిళనాడులో ఎడతెరిపిలేని వర్షాలు… 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్…

చెన్నై : తమిళనాడులో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాలతో చెన్నై నగరంతోపాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తిరువళ్ళూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునల్వేలి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. రాబోయే 24 గంటల్లో దాదాపు 20 సెంటీమీటర్ల …

Read More »

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు…

చెన్నై: తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ పెద్ద ఎత్తున సోదాలు జరుపుతోంది. తంజావూరు, తిరుచిరాపల్లిలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. ఐసిస్‌ ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారం నేపథ్యంలో సోదాలు జరుపుతున్నట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

తమిళనాడులో భారీగా పెరిగిన ఉల్లి ధర…

చెన్నై: తమిళనాడు మార్కెట్‌‌లలో ఉల్లి దిగుమతి బాగా తగ్గడంతో ధర రూ.130కి చేరింది. దీంతో మహిళలు ఉల్లి వాడేందుకే భయపడుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ఉల్లి సాగు తగ్గడంతో దిగుమతి కూడా తగ్గింది. రోజు 60 నుంచి 50 లోడ్లు లారీల్లో దిగుమతి అయ్యే ఉల్లి ప్రస్తుతం 30 లోడ్లకు తగ్గింది. దీంతో చిల్లర దుకాణాల్లో ఉల్లి రూ.100 నుంచి రూ.120 విక్రయమవుతోంది. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో …

Read More »

ఆసుపత్రిలో చేరనున్న స్టార్ హీరో…

చెన్నై: నటుడు కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరనున్నారు. ఆయన కాలులో వున్న ఇంప్లాంట్‌ను తొలగించేందుకు వైద్యులు శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ మేరకు ఎంఎన్ఎం పార్టీ ఒక​ ప్రకటన విడుదల చేసింది. 2016 లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగినపుడు వైద్యులు ఇంప్లాంట్‌ను అమర్చారని, దీన్ని తొలగించాల్సి అవసరం ఉందని, అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారని ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు …

Read More »

స్పా సీలింగ్‌లో 20 కిలోల కొండచిలువ

సాధారణంగా ఆఫీసుల్లో, షాపింగ్‌ మాల్స్‌లో, సెలూన్స్‌ వంటి వాటిలో ఎలుకలు ఉండటం, గోడలపై బల్లులు తిరగటం సహజమైన విషయమే. అయితే చైనాలోని ఓ స్పా యాజమానికి, అక్కడి ఉద్యోగులకు భయానక ఘటన ఎదురైంది. 20 కిలోల కొండచిలువ పార్లర్‌ సీలింగ్‌ నుంచి కింద పడటంతో ఉద్యోగులంతా బెంబేలెత్తిపోయారు. వివరాలు.. దక్షిణా చైనాలోని ఓ స్పా ఉద్యోగికి పార్లర్‌లో పెద్ద శబ్ధం వినబడంతో అక్కడికి వెళ్లి చుశాడు. 10 అడుగుల భారీ …

Read More »

అమెరికా-చైనా మధ్య త్వరలో పాక్షికంగా వాణిజ్య ఒప్పందం

వాషింగ్టన్‌: అమెరికా-చైనా మధ్య త్వరలో పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే, ఇది అధ్యక్షుల స్థాయిలో ఉండదని.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని వెల్లడించారు. అయితే, ఎప్పుడు అన్నదానిపై మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతనెల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విధంగా చైనాతో తొలిదశ ఒప్పందానికి జరుగుతున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని ‘నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌’ …

Read More »

సముద్రంలో మునిగిన పడవ..

చెన్నై : నడిసముద్రంలో పడవ మునిగిన ఘటనలో అదృష్టవశాత్తు జాలర్లు తప్పించుకున్నారు. పుదుచ్చేరి వీరాంపట్టణం గ్రామానికి చెందిన 8 మంది జాలర్లు  ఫైబర్‌ పడవలో చేపల వేటకు వెళ్లారు. వీరు అర్ధరాత్రి నడి సముద్రంలో లంగరు వేసి పడవను నిలిపి, వేకువజామున 4 గంటలకు వలలు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో సముద్రంలో లంగరు వేసి జాలర్లు పడవలో నిద్రపోయారు. పడవలో ఏర్పడిన రంధ్రం గుండా నీరు లోపలికి రాసాగింది. దీనిని …

Read More »

తమిళనాడులో నాయకత్వలోటు కనిపిస్తుంది…

చెన్నై : తమిళనాడులో రాజకీయ వెలితి ఏర్పడిందని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ  నేపథ్యంలో, ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగే నాయకుడు ఒక్క రజనీకాంత్ మాత్రమే అని డీఎంకే మాజీ అధ్యక్షుడు అళగిరి అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమిళనాడులో నాయకత్వ లోటు కనిపిస్తోందన్న విషయం నిజమేనని అన్నారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తారని తెలిపారు. ఇక …

Read More »