Breaking News
Home / Tag Archives: Citizenship Amendment Act

Tag Archives: Citizenship Amendment Act

ఢిల్లీలో హోండెలివరీస్ రద్దు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోండెలివరీస్ రద్దు చేస్తూ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మార్చి 31వరకు ఢిల్లీలో రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రోడ్లపై 20 మంది కంటే ఎక్కువ మంది సమూహంగా ఏర్పడొద్దని సూచించారు. మరోవైపు సీఏఏ, ఎన్నార్సీకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న షాహిన్‌బాగ్ ప్రాంతం తన అదుపులో లేదని స్పష్టం చేశారు.

Read More »

ఇండోనేషియా నుంచి ఎందుకొచ్చారు?

తెలంగాణ : ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఏడుగురు మత ప్రచారకులకు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం రేగుతోంది. సర్కారు అప్రమత్తమై 100 ప్రత్యేక బృందాలతో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేస్తోంది. అయితే వాళ్లు ఇక్కడికెందుకు వచ్చారు? ఎవరితో సంబంధాలున్నాయనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలను ఈ ఇండోనేషియా బృందాలే ఆర్గనైజ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read More »

గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

హైదరాబాద్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్‌ తమిళిసైకి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్.. పాకిస్థాన్ ముస్లింలకు వత్తాసు పలుకుతున్నారా? అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఎంఐఎం మెప్పు కోసమే సీఏఏ వ్యతిరేక తీర్మానం చేశారన్నారు. ఎన్‌ఆర్సీపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు అయినా.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ప్రజలెవరూ ఎలాంటి పత్రాలు చూపించాల్సిన …

Read More »

అప్పుడు ఒవైసీ.. ఇప్పుడు రాజాసింగ్

హైదరాబాద్ : సీఏఏ వల్ల ఏ ఒక్క ముస్లింకు నష్టం కలిగినా పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తీర్మాన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడిన అసత్యాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో పోడియం దగ్గరకు వెళ్లి తీర్మాన పత్రాలను చించివేశారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం సమయంలో అసదుద్దీన్ ఒవైసీ కూడా …

Read More »

సీఏఏ వ్యతిరేక తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సీఏఏను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అసెంబ్లీలో చర్చించిన అనంతరం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. కాగా నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

Read More »

నేటి ముఖ్యాంశాలు..

తెలంగాణ ♦ నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ♦ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉభయసభల్లో తీర్మానం ♦ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం జాతీయం ♦ నేటి నుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ♦ తొలిరోజే విశ్వాస పరీక్ష జరగాలన్న గవర్నర్ ♦ విశ్వాస పరీక్షపై నిర్ణయం సభలో ప్రకటిస్తానన్న స్పీకర్ ♦ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్, బీజేపీ

Read More »

అసదుద్దీన్, వారిస్ పఠాన్‌లపై కేసు నమోదు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్, MIM నేత వారిస్ పఠాన్‌లపై కేసు నమోదైంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన NRC, CAA ర్యాలీలో ఓవైసీ, వారిస్ పఠాన్‌లు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని.. మొగల్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. IPC సెక్షన్ 153, 153(a), 117, 295-a, 120b కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు …

Read More »

సీఏఏపై అనేక అనుమానాలు ఉన్నాయి…

హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమంలో ప్రతిపక్ష సభ్యులు సీఏఏ అంశం లేవనెత్తడంతో సీఏం కేసీఆర్ స్పందించారు. సీఏఏను ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయన్నారు. తాము కూడా సీఏఏను పార్లమెంట్‌లో వ్యతిరేకించామని అన్నారు. ఆ చట్టంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. వాటిపై క్లారిటీ వచ్చిన తర్వాతే పూర్తిస్థాయిలో స్పందిస్తామన్నారు. సీఏఏపై ప్రత్యేకంగా చర్చిద్దామని సభలో ప్రకటించారు.

Read More »

బృందాకారత్‌ పిటిషన్‌పై స్పందించండి

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసపై వివిధ వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హింస, విద్వేషపూరిత ప్రసంగాలపై ఢిల్లీ హైకోర్టు మార్చి 12న విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. జస్టిస్‌ డీఎన్‌.పటేల్, జస్టిస్‌ హరిశంకర్‌ల ధర్మాసనం పౌరసత్వ సవరణ చట్ట అనుకూల, వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో చెలరేగిన హింసపై దాఖలైన అన్ని పిటిషన్‌లపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ …

Read More »

అక్కడ ఇప్పటికీ రాత్రిపూట కర్ఫ్యూ

మేఘాలయ: పౌరసత్వ సవరణ చట్టం నిరసన జ్వాలలు ఇప్పుడు మేఘాలయను చుట్టుముట్టాయి. శుక్రవారం నుంచి ముగ్గురు మృత్యువాత పడగా, అనేక మంది కత్తిపోట్లకు గురయ్యారు. అనేక దుకాణాలు తగులబడ్డాయి. ఖాసి, జైంటియా ప్రాంతాల్లోని ఆరు జిల్లాలో ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిచి పోయాయి. షిల్లాంగ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టం వల్ల అక్రమ వలసదారులకు పౌరసత్వం …

Read More »