Breaking News
Home / Tag Archives: CITU dharna

Tag Archives: CITU dharna

సమస్యను వెంటనే పరిష్కరించాలి….

పశ్చిమ గోదావరి : ఇసుక సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. యలమంచిలి మండలం జాతీయ రహదారిపై సిఐటియు నేతలు గురువారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కేజీ ఇసుకను రూ.500 లకు అమ్ముతూ.. సిఐటియు నేతలు నిరసన తెలిపారు.

Read More »

శ్రీకాకుళంలో సిఐటియు మోకాళ్ల పై ధర్నా

శ్రీకాకుళం : అరబిందో కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను పరిష్కరించాలని కోరుతూ… సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో బుధవారం వినూత్నరీతిలో ”మోకాళ్ళపై” ధర్నా నిర్వహించారు.

Read More »

కరువు భత్యం చెల్లించాలని నిరసన…

బంటుమిల్లి: బంటుమిల్లి మండలంలో రెండు నెలలుగా ఇసుక కొరతతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కరువు భత్యం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇసుక ధరలు తగ్గి కార్మికులకు పనులు కలిగేంత వరకు ప్రభుత్వం ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఉన్న సీఐటియూ నాయకులు డిమాండ్ చేశారు.

Read More »

ఇసుక సమస్యను పరిష్కరించాలి…

అద్దంకి (ప్రకాశం) : ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ.. సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని, ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Read More »

సమస్యలు పరిష్కరించాలి….

విజయనగరం: పార్వతీపురం మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఆఫీసు వద్ద కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం కమిషనర్‌కి వినతిపత్రాన్ని ఇచ్చి సమస్యల్ని వివరించారు.

Read More »

విజయనగరంలో సిఐటియు ధర్నా…

విజయనగరం : బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా.. పార్వతీపురం ఆంధ్రా బ్యాంకు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. బ్యాంకుల విలీనాన్ని ఆపాలని, బ్యాంకు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాలని, బ్యాంకుల్లో డబ్బును పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసే మోదీ తప్పుడు విధానాలను మానుకోవాలని ఉద్యోగులు నినాదించారు.

Read More »

ఇసుక సమస్యను పరిష్కరించాలి…

శ్రీకాకుళం: భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలంటూ.. సిఐటియు ఆధ్వర్యంలో నడుకూరులో భవన నిర్మాణ కార్మికులు బుధవారం నిరసన చేపట్టారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని, క్వారీలు స్టాక్‌ పాయింట్ల సంఖ్యను పెంచాలని, ఇసుకను రవాణా చేసే వాహనాల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రభుత్వ విధానం వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులందరికీ పది వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read More »

శ్రీకాకుళంలో సిఐటియు ధర్నా….

శ్రీకాకుళం : అరబిందో కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ.. సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలో అరబిందో కార్మికులు శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అరబిందో కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు పరిష్కరించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని కార్మికులు మౌనపోరాటం చేశారు.

Read More »