Breaking News
Home / Tag Archives: cm jagan mohan reddy

Tag Archives: cm jagan mohan reddy

ఆయన ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోంది….

గుంటూరు: రాష్ట్రంలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం చీకటి ఆలోచనలు చేస్తోందని విమర్శించారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, తాను టీడీపీని వీడనని, పార్టీ మారే ఆలోచన కూడా లేదన్నారు. ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్ళాలనిపిస్తే.. చెప్పే వెళ్తానని మాణిక్య వర ప్రసాద్ స్పష్టం …

Read More »

ఆ ముగ్గురే తెలంగాణను దోచుకుంటున్నారు…

జగిత్యాల: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, చొప్పదండీ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ… ఏపీ సీఎం జగన్‌కు ఉన్న సోయి సీఎం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల్లో అగ్గి రగులుతోందని, బుగ్గి అయిపోతారని అన్నారు. కేసీఆర్, కృష్ణారెడ్డి, రామేశ్వర్ రావులు తెలంగాణను …

Read More »

ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలి….

అమరావతి: ఏపీపీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ నియమాకాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 2020 జనవరి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ఏపీపీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని జగన్‌ ఆదేశించారు.

Read More »

నిజాయితీగా ఉంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి…

అమరావతి: పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన సీఎం జగన్‌ నియంతలా మారారని టీడీపీ నేత లోకేష్ ధ్వజమెత్తారు. ”మీది చేతగాని పాలన అని కేబినెట్‌ సాక్షిగా మీరే ఒప్పుకున్నారు. అదే విషయాన్ని రాసిన జర్నలిస్టులని చంపేస్తున్నారు. ఏపీలో పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు. మీ తుగ్లక్‌ పాలనపై మాట్లాడుతున్న ప్రజలపై కూడా కేసులు పెడతారా? కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో జైళ్లు సరిపోవు. నిజాయితీగా ఉంటే కేసులు పెట్టడం కాదు.. ఆత్మపరిశీలన చేసుకోవాలి” …

Read More »

సీఎం జగన్ కు రాఘవులు లేఖ…

అమరావతి: భూ కుంభకోణాలపై సీపీఎం రాఘవులు సీఎం జగన్ కి లేఖరాశారు. కడప జిల్లా రాజాం పేట డివిజన్ లోని 16 మండలాల్లో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని, దోషులను శిక్షించి, రైతులకు న్యాయం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Read More »

ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి…

అమరావతి: రైతు భరోసాపై టీడీపీ, జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ మిషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… అర్హులందరికీ రైతు భరోసా, దరఖాస్తుకు నెలరోజుల సమయం ఉందని, రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఏ పథకానికి బడ్జెట్‌ కేటాయించినా కేంద్రం నిధులు కలుపుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే భరోసా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని ఆయన అన్నారు. జగన్‌ పాదర్శక  పాలనను చూసి చంద్రబాబు …

Read More »

ఆయనను టార్గెట్ చేయడం మానాలి….

కృష్ణా: రాష్ట్ర సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తే.. వైసీపీకి పడిన ఓట్ల కంటే దరఖాస్తులే ఎక్కువ వస్తాయని ఎంపీ సుజనాచౌదరి ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిపాలనకు అతీతులమని జగన్ భావిస్తున్నాడని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమైందని సుజనాచౌదరి విమర్శించారు. జగన్‌ను టార్గెట్ చేయడం మానుకొని సమస్యలను టార్గెట్ చేయాలన్నారు. గాంధీజీ సంకల్ప యాత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి …

Read More »

పనులు ఆపేసి… సమాధులు కడతారా?…

అమరావతి: సీఎం జగన్‌ రాష్ట్రాన్ని రివర్స్‌లో తీసుకెళ్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నిరాహారదీక్ష చేస్తే అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. వైసీపీ దళారులు ఇసుకను దొడ్డిదారిలో అమ్ముతున్నారన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వం మెడలు వంచుతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజధానిలో పనులు ఆపేసి, సమాధులు కడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు బందర్‌పోర్టును ధారాదత్తం చేయడానికే.. పోర్టు పనులను ఆపేశారా? అని కొల్లు రవీంద్ర ఫైర్ …

Read More »

కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై మంత్రులు చర్చిస్తున్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ భరోసా కింద రైతులకు ఉచితంగా బోరు బావులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మిల్లెట్‌బోర్డు ఏర్పాటు, వైఎస్సార్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా …

Read More »

నిందితులను కఠినంగా శిక్షిస్తాము…

కృష్ణా: తూర్పు గోదావరి జిల్లాలో జర్నలిస్ట్‌ సత్యనారాయణ హత్య గురించి సీఎం జగన్‌కి వెంటనే తెలియజేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. వెంటనే జగన్‌ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. జర్నలిస్ట్‌ సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

Read More »