Breaking News
Home / Tag Archives: cm jagan mohan reddy (page 10)

Tag Archives: cm jagan mohan reddy

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం…

లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఒక్కొక్కరికి రూ.5000 గ్రాంటు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా ప్రభావంతో ఈనెల 14 వరకు దేవాలయాలలో భక్తులకు అనుమతి నిరాకరించగా, దాదాపు 2500 మంది చిన్న దేవాలయ అర్చకులకు ఆదాయ వనరులు లేకుండా పోయాయి. దీంతో వారికి రూ.5 వేల చొప్పున గ్రాంటు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.కోటి ఇరవై ఐదు లక్షల …

Read More »

హాట్‌స్పాట్లలో ర్యాండమ్‌ సర్వే చేపట్టండి…

అమరావతి: కరోనా వైరస్‌ నివారణ చర్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. హాట్‌స్పాట్లలో ర్యాండమ్‌ సర్వే చేపట్టి, క్వారంటైన్లు, క్యాంపుల్లో సదుపాయాలు, వసతుల పెంపుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

Read More »

కరోనాపై సీఎం జగన్ సమీక్ష…

అమరావతి: కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు దీనిపై దృష్టి సారిస్తున్నారు. నేటి ఉదయం 11.30 గంటలకు ఏపీ సీఎం జగన్ కరోనాపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకు ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

Read More »

కరోనాపై సీఎం జగన్ సమీక్ష…

అమరావతి: రాష్ట్రంలో కరోనా విస్తరణ, నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని తబ్లీగి జమాతే సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి వైద్య పరీక్షలపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలోని మొత్తం 266 పాజిటివ్ కేసుల్లో 243 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో కాంటాక్ట్ అయినవారేనని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

Read More »

పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదు….

అమరావతి: పంటలకు గిట్టుబాటు ధరలపై సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు ఈ విషయం పై సమీక్షించారు. కలెక్టర్లు, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్లతో మాట్లాడిన కన్నబాబు, మంగళవారం నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు. పంటల మద్దతు ధరలు పడిపోవడానికి వీల్లేదని మంత్రి అధికారులను …

Read More »

వారికి పూర్తి జీతాలు చెల్లించాలి..

అమరావతి: వైద్య ఆరోగ్యం, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నివారణ చర్యలపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నివారణకు ముందుండి పని చేస్తున్న వారికి పూర్తి జీతాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

Read More »

కరోనాపై జగన్ ఉన్నతస్థాయి సమావేశం…

అమరావతి: రాష్ట్రంలో ప్రబలుతున్న కోవిడ్ 19పై ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ లింక్స్, కరోన కేసులు అంతకంతకూ పెరుగుతుండడం.. వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి తేవడంపై చర్చించనున్నారు. కోవిడ్ 19ను ఎదుర్కోవడానికి అమలవుతున్న లాక్‌డౌన్ పైనా చర్చించనున్నారు. లాక్‌‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అదేశించే అవకాశం ఉంది. నిత్యావసరాల రవాణాకు ఆటంకం …

Read More »

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించింది

గుంటూరు: కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించిందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుకోని భారం పడిందని సీఎం జగన్‌ అన్నారు. జీతాలు వాయిదా వేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో రైతులు ఒంటిగంట దాకా పనులు చేసుకోవచ్చని, రైతులు, రైతు కూలీలు సామాజిక దూరం పాటిస్తే మేలు జరుగుతుందని జగన్ చెప్పారు. …

Read More »

ప్రజలు వాలంటీర్లకు సహకరించాలి…

గుంటూరు: వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారని, జ్వరం, ఏ ఇతర సమస్యలున్నా వాలంటీర్లకు చెప్పాలని సీఎం జగన్ తెలిపారు. 81 శాతం కరోనా కేసులు ఇంట్లో ఉంటేనే నయమవుతాయని, కరోనా వైరస్‌కు 14 శాతం మాత్రమే ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని జగన్ అన్నారు. 4, 5 శాతమే ఐసీయూలో చికిత్స చేయాల్సిన పరిస్థితి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని, వారు మీ బాగోగులు …

Read More »

ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి…

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం బాధ కలిగించే అంశం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. ‘‘చికిత్స అందించడంలో సమగ్ర విధానం అమలు చేస్తున్నాం. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల అనేక మందికి వైరస్‌ సోకింది. కరోనా వైరస్‌తో భయాందోళన వద్దు.. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదే.. రాష్ట్రంలో ఇప్పటికి 87 కేసులు నమోదు …

Read More »