Breaking News
Home / Tag Archives: cm KCR

Tag Archives: cm KCR

తెలంగాణాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నాం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణలో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ది చేస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద పరిరక్షణ, ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజం, మెడికల్‌ టూరిజం కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు అభివృద్ధికి ప్రణాళికలను అమలు చేస్తున్నామని అన్నారు. కేరళలో పర్యటిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ సందర్భంగా కేరళ పర్యాటకశాఖ …

Read More »

రైతు బీమాతో భరోసా ఇచ్చిన కేసీఆర్…

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రైతు అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూత కోసం అనేక పథకాలు, విధానాలను కేసీఆర్‌ ప్రవేశపెట్టారని అన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అగ్రిటెక్‌-2020లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 57లక్షల పైగా రైతులకు రైతుబంధు కింద ఏడాదికి 10వేల కోట్ల పెట్టుబడి సాయం అందుతోందన్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం గత …

Read More »

జయంతిలోపే విగ్రహం ఏర్పాటు చేయాలి…

హైదరాబాద్: అంబేద్కర్ జయంతిలోపే తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేత ఎల్‌.రమణ అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… అలా జరగకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఎల్‌.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More »

కేసీఆర్‌కు కూడా ఆయన గతే పడుతుంది…

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా హిట్లర్‌ గతే పడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూమ్‌లు పేరుకే తప్ప ఎక్కడా కనిపించట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓట్లకే తప్ప అభివృద్ధికి అర్హులు కాదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ …

Read More »

నేను చేసే పోరాటం తప్పయితే…

హైదరాబాద్: పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం పెడితే తీసుకెళ్లి చెత్తకుప్పలో వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. శనివారం విహెచ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్‌తో కలిసి రూ. ఐదు లక్షలు పెట్టి అంబేద్కర్ విగ్రహం చేయించానని, తీసుకొచ్చి విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం …

Read More »

ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్?…

హైదరాబాద్ : ఎమ్యెల్యేలకు సీఎం కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ మేరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రొగ్రెస్ రిపోర్టు రెడీ చేయనున్నట్లు సమాచారం. పనితీరు మెరుగుకు మరో ఆరు నెలలు సమయం ఇచ్చి.. ఆ తర్వాత వారికి ప్రొగ్రెస్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారని, ఇకపై వారి పనితీరుకు వారిదే బాధ్యత అని తేల్చిచెప్పనున్నట్లు ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి.

Read More »

25 న ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్…

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఆయనకు గౌరవార్థం ఈనెల 25న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఇవ్వనున్నారు. విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి కోవింద్‌ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ట్రంప్‌తో విందు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈమేరకు ఈనెల 25న సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ సీఎంతో …

Read More »

ఎంఐఎం వ్యాఖ్యాలను ఖండించాలి

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా …

Read More »

తిరుమల తరహాలో..యాదాద్రి

యాదగిరిగుట్ట(ఆలేరు): అంతర్జాతీయ దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం సకల వసతులు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమల తరహాలో క్యూలైన్లు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు, పెద్దగుట్టపై కాటేజీలు, వాహనాలు నిలిపేందుకు కొండ కింద విశాలమైన పార్కింగ్‌ తదితర చర్యలు చేపట్టారు. వీటితో పాటు అధునాతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మించేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో యాదాద్రి కొండపై ఉన్న …

Read More »

ఈనెల 24 నుంచి నిరక్షరాస్యుల సర్వే…

తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సీఎం కేసీఆర్‌ లక్ష్యం మేరకు హైదరాబాద్ లో నిరక్షరాస్యుల సర్వే నిర్వహించనున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిరక్షరాస్యులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సర్వే జరుగుతుందని, నగరంలో 97.97లక్షల మంది జనాభా ఉన్నట్లు రామ్మోహన్ వెల్లడించారు.

Read More »