అమరావతి: కొవిడ్ 19పై ముఖ్యంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సీఎస్, డీజీపీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యవసాయ ఉత్పత్తులు, లాక్డౌన్ అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Read More »నాడు-నేడు కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
అమరావతి: కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమాలపై సమీక్షించారు. ఆసుపత్రుల నాడు-నేడు కింద చేపట్టే పనులకు జూన్ మొదటివారంలో టెండర్లకు వెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు కింద వైద్య రంగంలో అభివృద్ధి పనులు, కొత్త నిర్మాణాల కోసం దాదాపు రూ.16వేల కోట్లు ఖర్చువుతుందని సీఎం తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం.. …
Read More »అసోం ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్
అమరావతి: అసోం సరిహద్దుల్లో లారీలు నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు సూచించారు. శనివారం అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయన్న విషయాన్ని గుర్తుచేసిన సీఎం వైఎస్ జగన్ ఏపీ నుంచి చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని …
Read More »కోవిడ్-19 నివారణపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ -19 విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More »కరోనా నివారణ చర్యలపై జగన్ సమీక్ష
అమరావతి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కచ్చితంగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలన్నారు. క్వారంటైన్ నుంచి వెళ్లే పేదలకు రూ.2 వేలు ఇవ్వాలని ఆదేశించారు. పౌష్టికాహారం తీసుకునేందుకు రూ.2 వేలు ఉపయోగపడతాయని, మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలన్నారు. హాట్‌స్పాట్ …
Read More »కందుకూరి వీరేశలింగంకు సీఎం జగన్ నివాళి
అమరావతి: తెలుగు జన జీవన గొదావరిలో లేచి నిలిచిన అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ‘తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం. సమాజంలోని అనేక దురాచారాల నిర్మూలనకు కృషి చేసి మహిళా వికాసానికి, అన్ని వర్గాలకూ విద్యను అందించేందుకు పాటుపడ్డ గొప్ప సంఘసంస్కర్త …
Read More »నేడు కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి: ఇవాళ ఉదయం 11:30 గంటలకు కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. అలాగే సాయంత్రం 3:30 గంటలకు స్కిల్ డెవలప్మెంట్పై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Read More »సీఎం సహాయనిధికి విరాళాలు
కరోనా వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు బుధవారం సీఎం సహాయనిధికి విరాళాలు అందించారు. ► ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) రూ.10 కోట్లు. ► రాష్ట్రంలో 110 పట్టణ ప్రాంతాల్లోని 2.33 లక్షల స్వయం సహాయ సంఘాలు రూ.కోటి విరాళం. ► తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, ప్రాధమిక సహకార సంఘాలు, ఉద్యోగుల ఒక రోజు వేతం రూ.60 లక్షలు ► …
Read More »క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లకు రూ.2వేలు
అమరావతి: కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై సీఎం ఆరా తీశారు. బాధితులకు డబుల్, సింగిల్ రూమ్ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లకు రూ.2వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. ఇంటికి వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. అరటి, పుచ్చ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారించాలని, రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని …
Read More »ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట
తాడేపల్లి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..ప్రజా సంక్షేమానికి సీఎం …
Read More »