Breaking News
Home / Tag Archives: comments on ycp government

Tag Archives: comments on ycp government

అందుకే జగన్‌ను పిలవలేదు…

అమరావతి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రపతి ఇచ్చే విందుకు సీఎం జగన్ ను ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షనేత చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. జగన్ ఆర్థిక నేరస్తుడు కాబట్టే ఈ కార్యక్రమానికి పిలవలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు తెలిపారు.

Read More »

పేదలకు పెట్టే అన్నాన్ని కొట్టేశారు…

అమరావతి: పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటిన్ అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. పేదవాడి నోటి దగ్గర ముద్ద దూరం చేసింది రాజన్న క్యాంటిన్ అని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌లో పేదలకు పెట్టే అన్నాన్ని కొట్టేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పేదవాళ్లపై కక్ష సాధిస్తున్నారన్నారు. పేదవాడిపై ఛార్జీల మోత మోగించాచారని పేర్కొన్నారు.

Read More »

24 గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు…

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసిందని టీడీపీ నేత శ్రవణ్ ఆరోపించారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్‌ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్‌ వేయడం …

Read More »

టీడీపీ అండగా ఉంటుంది …

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టై , విడుదలైన నందిగామ యువకులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అమరావతిలో కలిశారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్నారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్ కోసం పోరాటం జరుగుతుందని పేర్కొన్నారు.

Read More »

రద్దు తీర్మానం ఎందుకు చేయలేదు?…

తిరుపతి: రాష్ట్రంలో కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి లేదని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు ఆగిపోయాయని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు. శాసన మండలితో ఉపయోగం లేకుంటే తొలి సమావేశాల్లోనే రద్దు తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.

Read More »

2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం…

పశ్చిమగోదావరి: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ, జనసేన కలయిక ముఖ్యమని జనసేన నేత నాగబాబు అన్నారు. 2024లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏది రద్దు చేస్తుందో తెలియదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్ల మీద ప్రయాణం కంటే హెలికాఫ్టర్లు కొనుక్కుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

Read More »

ఈ ప్రశ్నకు జగన్ ఏం సమాధానమిస్తారు?…

అమరావతి: అమరావతిలో పేదల ప్రజల కోసం కట్టిన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తమ ప్రభుత్వం అన్ని వసతులతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు కట్టించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఓ మహిళ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వాటిని పంచకుండా ఇళ్ళ స్థలాలు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఆ వీడియోలో ఆమె విమర్శించారు. ఇప్పుడేమో రెండు సెంట్లు …

Read More »

పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు…

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎనిమిది నెలలకే భ్రష్టుపట్టిపోయిన ప్రభుత్వం వైసీపీ  ప్రభుత్వం అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, మీడియాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో వైసీపీ వాళ్లు బూతులు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో మైనార్టీ నాయకుడిపై అధికార …

Read More »

తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలి..

విజయవాడ: మీడియాపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏబీఎన్‌, టీవీ5 ఛానళ్లపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. మహిళా పోలీసులతో అక్రమ కేసు పెట్టించారని, తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Read More »

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆగ్రహం…

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. తుగ్లక్‌లా నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. సీఆర్డీఏ, అధికార వికేంద్రీకరణ బిల్లులపై లోకేశ్ మాట్లాడుతూ.. రాజధానిలో ఏం జరుగుతుందో సీఎం జగన్ అక్కడికి వెళ్లి చూడొచ్చని.. కనీసం ఎమ్మెల్యేలు కూడా చూడకుండా.. ఇష్టమొచ్చినట్టు ఆరోపిస్తున్నారని విమర్శించారు. ఎన్నో భవనాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు. జగన్ సర్కార్ తీసుకున్న …

Read More »