Breaking News
Home / Tag Archives: congress

Tag Archives: congress

కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. కీలక నేతలకు షాక్

హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 7న జరగబోయే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ తాజాగా 13మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సీటు ఆశించిన సనత్‌నగర్ స్థానానికి టీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో మర్రి వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూన వెంకటేష్ …

Read More »

కాంగ్రెస్‌కి దిమ్మదిరిగే సవాల్ విసిరిన మోదీ

అంబికాపూర్ (ఛత్తీస్‌గఢ్) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌కు గట్టి సవాల్ విసిరారు. గాంధీ కుటుంబానికి చెందనివారికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కనీసం ఐదేళ్ళపాటు కట్టబెట్టాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఈ విధంగా చేస్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించారని తాను విశ్వసిస్తానన్నారు. ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ …

Read More »

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. మోదీ, రాహుల్ పోటాపోటీ ప్రచారం.

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇవాళ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ప్రచారానికి వేదికగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం పలు బహిరంగ సభల్లో పాల్గొననుండడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని మోదీ షాదోల్ జిల్లానుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గ్వాలియర్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం ఇవాళ తికంగఢ్, సాగర్, దామో సహా రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్లు హైకోర్టులో కొట్టివేత

హైదరాబాద్‌: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డీలిమిటేషన్‌ లేకుండా ఏపీలో 7మండలాలు కలపడం, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపడం, బోగస్ ఓట్ల తొలగించకుండా ఎన్నికలకు వెళ్లడంపై మర్రి శశిధర్‌రెడ్డి పిటిషన్లు వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, అలాగే ఓటర్ జాబితాపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అలాగే ఏపీలో …

Read More »

రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కుంతియా, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. టీజేఎస్‌ ప్రకటించిన 12 స్థానాలతో పాటు పార్టీ విడుదల చేయాల్సిన అభ్యర్థుల మూడో జాబితాపైనా చర్చిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 65 మంది, రెండో జాబితాలో 10మంది కూడిన మొత్తం 75 మంది సభ్యులతో కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. …

Read More »

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇంటి వద్ద హైడ్రామా

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. కొత్తగూడెం టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఎడవల్లి కృష్ణ తనకు టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెబల్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం కృష్ణను కలిసేందుకు వనమా తనయులు ఆయన నివాసానికి వచ్చారు. కాగా వారిని కృష్ణ కుటుంబసభ్యులు …

Read More »

జనగామ నుంచే బరిలోకి: పొన్నాల

ఢిల్లీ: తాను జనగామ నుంచే పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. జనగామ నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ చేస్తారనేది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. మహాకూటమి భాగస్వామ్య పక్షాల సీట్ల కేటాయింపులపై పూర్తిస్తాయి నిర్ణయం జరగలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రకటించని స్థానాలన్ని మిత్రపక్షాలకు కేటాయిస్తారనుకోవడం పొరపాటేనని చెప్పారు. ఇంకా చాలా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని జనగామ నుంచి కాంగ్రెస్ …

Read More »

బీజేపీకి గట్టి దెబ్బ

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. దౌసా నియోజకవర్గం బీజేపీ పార్లమెంటు సభ్యుడు హరీష్ మీనా ఆ పార్టీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ సమక్షంలో బుధవారంనాడిక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాజస్థాన్‌లో టిక్కెట్ల పంపిణీపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో మరికొందరు నేతలు సైతం పార్టీ మారేందుకు …

Read More »

కాంగ్రెస్ సంచలన నిర్ణయం… ఎన్నికల బరిలో ఆ ఇద్దరు!

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని సర్వేలు తేల్చిన నేపథ్యంలో ఆ పార్టీ ఇవాళ మరో అడుగు ముందుకేసింది. వచ్చే నెల 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లను కూడా ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా గెహ్లాట్ ఈ విషయం ప్రకటించారు. రాజస్థాన్‌లో …

Read More »

టికెట్ ప్రకటించకపోవడంపై క్యామమల్లేశం ఆగ్రహం

హైదరాబాద్: కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో ఇబ్రహింపట్నం నియోజవర్గానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే క్యామ మల్లేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వనస్థలిపురంలోని తన నివాసంలో ఇంబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలతో క్యామమల్లేశం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే టిక్కెట్‌ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నారు. రాష్ట్ర నాయకత్వం టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో రాబందులు చేరి టిక్కెట్‌లు బేరం చేస్తున్నారని …

Read More »