బ్రెజిల్: బ్రెజిల్లో కరోనా వైరస్ అనియంత్రితంగా మారిపోతోంది. గత 24 గంటల్లో బ్రెజిల్లో కరోనా కారణంగా 1349 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 32 వేలు దాటింది. ఇప్పటివరకు బ్రెజిల్లో ఐదున్నర మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారినపడగా, ప్రతిరోజూ ఇరవై వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు యుఎస్‌లో సుమారు 18.5 మిలియన్ల మంది ప్రజలు …
Read More »ఒడిశాలో మరో 143 కరోనా కేసులు…
భువనేశ్వర్: ఒడిశాలో ఇవాళ కొత్తగా మరో 143 మందికి కొవిడ్-19 పాజిటివ్ సోకినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,388కి చేరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తాజాగా నమోదైన కేసుల్లో 132 మందిని వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో గుర్తించగా… మరో 11 మందిని కాంటాక్ట్ ట్రేసింగ్‌లో గుర్తించామని ఓ అధికారి వెల్లడించారు. ఒడిశాలో ప్రస్తుతం 1,054 మంది కొవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో …
Read More »మరో 47 పోలీసు సిబ్బందికి కరోనా…
ముంబై : మహారాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనా వైరస్ భారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో మరో 47 మంది పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నేడు వెల్లడైన ఫలితాల్లో వీరంతా కోవిడ్-19 భారిన పడ్డట్లుగా సమాచారం. ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీస్‌శాఖలో 2,556 మంది కరోనా వైరస్ భారిన పడ్డారు. 29 మంది పోలీస్ సిబ్బంది కోవిడ్-19 కారణంగా మరణించారు. …
Read More »ఏపీలో కొత్తగా 180 కరోనా కేసులు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 101 ఉండగా.. రాష్ట్రంలో 79 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,971 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా …
Read More »మంచిర్యాలలో 40కి చేరిన కరోనా కేసులు…
మంచిర్యాల: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరుకున్నాయి. కరోనా బారిన పడి 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే మరో 25 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితమే కరోనాతో మరో మహిళ మృతి చెందింది.
Read More »64 లక్షలు దాటిన కరోనా కేసులు…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కరోనా పంజా విసురుతూనే ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వైరస్‌తో విలవిల్లాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. …
Read More »దేశంలో 24 గంటల్లో 8,909 కరోనా కేసులు…
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 8,909 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 217 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 207,615 కి చేరగా, మృతుల సంఖ్య 5,815 …
Read More »యూఏఈలో 35788 కి చేరిన కరోనా కేసులు..
యూఏఈ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. అటు గల్ఫ్‌లో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్‌లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈలో రోజురోజుకీ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం కూడా ఏకంగా 596 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యూఏఈలో ‘కోవిడ్-19’ సోకిన వారి సంఖ్య 35,788కి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న 388 మంది …
Read More »సచివాలయానికి ‘కరోనా’ షాక్…
చెన్నై: సెయింట్ జార్జి కోట ప్రాంగణంలోని సచివాలయానికి ‘కరోనా’ షాక్ తగిలింది. పలు విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగుల రక్తనమూనాలను పరీక్షించగా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. 70 రోజుల అనంతరం లాక్డౌన్ సడలించిన కారణంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కార్యాలయాల్లో ప్రస్తుతం 50 శాతం మంది ఉద్యోగులు భౌతికదూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో 8 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కావడంతో ఉద్యోగుల హాజరు 33 శాతానికి …
Read More »కర్నూలులో 722కు చేరిన కరోనా కేసులు…
కర్నూలు: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 722కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 616 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 106 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా బారిన పడి 25 మంది మృతి చెందారు.
Read More »