Breaking News
Home / Tag Archives: Corona virus

Tag Archives: Corona virus

గుంటూరు మార్కెట్ పై కరోనా ఎఫెక్ట్…ఒకరి నుంచి 26 మందికి…

ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 3200 కి చేరింది. ఈ ఒక్కరోజే ఏపీలో 115 కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 కేసులు గుంటూరు నగరంలో నమోదుకావడం విశేషం. గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి లాక్ డౌన్ చేస్తున్నారు. ఇక గుంటూరులో కొల్లి శారదా కూరగాయల …

Read More »

ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మే మొదటి, రెండు వారాల్లో తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. ఆ తర్వాత డబుల్ అయ్యాయి. ఇవాళ కొత్తగా 115 కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో అనగా సోమవారం …

Read More »

కర్నూలులో 722కు చేరిన కరోనా కేసులు…

కర్నూలు: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 722కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 616 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 106 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా బారిన పడి 25 మంది మృతి చెందారు.

Read More »

భారత్‌కి కొత్త వైరస్‌ ముప్పు..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.

కరోనా మహమ్మారి విజృంభన తగ్గకుండానే మరో వైరస్ ప్రపంచంపై పడింది..కరోనాకు లక్షల మంది బలవుతుంటే తాజా మరో వైరస్‌ ఎబోలా తెరపైకి వచ్చింది…ఎబోలా వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది…ఎబోలా వ్యాధి సంక్రమణ గురించి చూస్తే… ఆ వ్యాధి బారినపడినవారికి వైద్యం చేసిన నర్సులు, డాక్టర్లు చనిపోయిన ఘటనలు గతంలో ఉన్నాయి…అలాగే వ్యాధిగ్రస్తులను చూచివద్దాం అని వెళ్లినవారికి కూడా ఆ వైరస్ పట్టుకుని ప్రాణాలు తీస్తోంది. మరోసారి ఆఫ్రికన్‌ దేశమైన …

Read More »

కరోనా విజృంభణ..ఢిల్లీ లో బెడ్ల కొరత….

దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ అన్ని జిల్లాల న్యాయాధికారులకు లేఖ రాసింది. కరోనా బాధితులు పెరుగుతున్నందున బెడ్ల సామర్థ్యాన్ని మరియు చనిపోయిన వారి దహన సంస్కారాలను చేయడానికి కొత్త ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని సూచించింది. అయితే ఎంపిక చేసే ప్రదేశాలు నివాస స్థలాలకు దూరంగా ఉండాని కూడా పేర్కొంది. కరోనా బాధితులకు చికిత్స అందించడానికి వీలైనంత …

Read More »

ప్రకాశం జిల్లాలో తిరిగి విజృంభిస్తున్న కరోనా

ప్రకాశం: జిల్లాలో కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. నిన్న మరో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఉలవపాడులో ఓ మహిళకు, కరేడులో మరో మహిళకు, వెలిగండ్ల మండలం జాళ్లపాలెంలో ఓ యువకుడికి, వేటపాలెం మండలం రోశయ్యనగర్‌కు చెందిన ఓ యువకుడికి, ఓ ఆర్మీ జవానుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా …

Read More »

షూటింగ్ చేయాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే..

త్వరలో పునఃప్రారంభమయ్యే సినిమా, టీవీ షూటింగ్స్​కు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది . షూటింగ్​ సమయాల్లో ఈ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్‌ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యూనిట్‌ సభ్యులు ప్రతి ఒక్కరూ మాస్క్‌, గ్లోవ్స్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి. సెట్‌లోకి …

Read More »

ఆరోగ్య రంగంపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు…

న్యూఢిల్లీ: కర్ణాటక బెంగళూరులోని రాజీవ్ గాంథీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆరోగ్యరంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంటికి కనిపించని వైరస్‌తో పోరాడుతున్న యోధులు… వైద్యులని, పోరాటంలో వైద్యులు తప్పక విజయం సాధిస్తారని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ సిబ్బందికి, శాస్త్రవేత్తలకు అభినందనలు చెబుతూనే ప్రపంచమంతా …

Read More »

నీతి ఆయోగ్‌ అధికారికి కరోనా…

ఢిల్లీలోని ఐసీఎంఆర్‌లో పనిచేసే ఓ శాస్త్రవేత్తకూ కరోనా వైరస్‌ సోకిన సంగతి మరవకముందే.. నీతిఆయోగ్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో నీతి ఆయోగ్ కార్యాలయంలోని మూడో అంతస్ధును సోమవారం మూసివేశారు. అనంతరం ఈ అంతస్థును పారిశుధ్య కార్మికులు శానిటైజ్ చేస్తున్నారు. మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో మిగిలిన ఉద్యోగులందరినీ 14 రోజుల …

Read More »

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మీడియా ముందు వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్‌ పథకానికి రోడ్ మ్యాప్‌ రూపొందించామని తెలిపారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర …

Read More »