Breaking News
Home / Tag Archives: cpi-cpm dharna

Tag Archives: cpi-cpm dharna

హైదరాబాద్ లో వామపక్షాలు నిరాహార దీక్ష….

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని వామపక్ష నేతలు ప్రకటించారు. ఐకాస బంద్‌కు మద్దతుగా ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్షకు దిగాయి. ప్రజా సంఘాల నాయకులు, ఇతర నేతలు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులకు నివాళులర్పించారు. సీపీఐ, సీపీఎంతోపాటు ప్రజా సంఘాల నేతలు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. లాభాలు వచ్చే మార్గాల్లోనే ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయని, నష్టాలు …

Read More »

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ….

రేపల్లె: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా.. సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్లో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం రేపల్లె డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌.మణిలాల్‌ మాట్లాడుతూ.. కార్మిక చట్టాల సవరణలు చేస్తున్నారని, గతంలో జీఎస్టీ, నోట్ల రద్దుల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. రైల్వే, బ్యాంకింగ్‌, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వ విధానాలు దెబ్బతిస్తున్నాయని విమర్శించారు.

Read More »

పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తోంది….

రాజోలు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో రాజోలు ఆర్టీసీ డిపో ఎదుట జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు పీతల రామచంద్రరావు మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో ఆర్ధిక మాంద్యం వచ్చిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ రెండు లక్షల కోట్లు రాయితీలిచ్చిందని ఇటివల కాలంలో రూ.1.25 లక్షల కోట్లు ఆర్‌బిఐ …

Read More »

గుంటూరు జిల్లాలో సీపీఐ, సీపీఎంల రాస్తారోకో….

గుంటూరు : బీజేపీ ఆర్థిక విధానాలకి వ్యతిరేకంగా.. సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో మంగళగిరి కొత్త బస్టాండ్‌ వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి.ప్రసాద్‌, సీపీఎం జిల్లా నాయకులు జీవి.రాఘవులు, సీపీఐ నియోజక వర్గకార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మండల కార్యదర్శి జాన్‌ బాబు, సీపీఎం మండల కార్యదర్శి గంగాధర్‌ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Read More »

ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ…

కృష్ణా : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ.. సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తిరువూరులో బోసుబొమ్మ ఆటోస్టాండ్‌ సెంటర్లో బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వనజ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బీజేపీకి వ్యతిరేకంగా రాస్తారోకో…

కడప : బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. సీపీఎం-సీపీఐల ఆధ్వర్యంలో కడప ఆర్‌టిసి వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. మోదీ ప్రజా వ్యతిరేక-కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామంటూ.. నినాదించారు. భారత తీవ్ర ఆర్థిక మాంద్యానికి కారణమైన బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Read More »