Breaking News
Home / Tag Archives: cpi Leader

Tag Archives: cpi Leader

వారి చర్యలను అడ్డుకుందాం: సీపీఐ నేత

విజయవాడ: మోదీ, అమిత్ షాకు పౌరసత్వానికి అర్థం తెలియదని సీపీఐ నేత డి.రాజా అన్నారు. మోదీ, షాలు ఇండియాని హిందు దేశంగా మార్చలేరన్నారు. అందరం కలిసికట్టుగా రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చర్యలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌కి వ్యతిరేకంగా సీపీఐ సభను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Read More »

ఆయన తిక్క కుదిర్చేది తెలంగాణ ప్రజలే…

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల తల్లుల కడుపుకోత సభ గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… ఐఏఎస్‌లను కోర్టు బోనులో నిలబెట్టే పరిస్థితి వచ్చినందుకు..టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. హైకోర్టు చెప్పినా సీఎం కేసీఆర్‌ వినడం లేదని, కేంద్రం, గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కేసీఆర్ తిక్క కుదిర్చేది తెలంగాణ ప్రజలేనని అన్నారు. తాము తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని …

Read More »

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ నేత లేఖ…

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. 1-8 తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని లేఖలో కోరారు. ఆంగ్లంతో పాటు సమాంతరంగా తెలుగును బోధనా భాషగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే మాటకు తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులున్నాయని, రాష్ట్రంలో 43,200 పాఠశాలలు ఉండగా, ఇప్పటికే 8,500 పాఠశాలల్లో ఇంగ్లీష్ …

Read More »

సీపీఐ నేత ఆమరణ దీక్ష ….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అమరణ దీక్ష చేస్తున్నారు. హైదరాబాద్ లోని మగ్దూం భవన్ లో ఆయన నిరవధిక ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షను సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు.

Read More »

ప్రత్యేక హోదాపై సీపీఎం నేత వ్యాఖ్యలు…

నెల్లూరు: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు అస్త్రంగా వాడుకొంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై. వెంకటేశ్వర రావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గళం వినిపించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచారని విమర్శించారు. ప్రత్యేక హోదా చట్టబద్ధంగా సాధించుకోవడం మన హక్కని అన్నారు. అఖిలపక్షాన్ని కలుపుకొని అధికార పార్టీ ఉద్యమ బాట పట్టాలని సూచించారు. …

Read More »

వారు ఇబ్బందుల్లో ఉంటే మా పార్టీ ఊరుకోదు…

హైదరాబాద్: సీపీఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతిస్తోందని తెలిపారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సర్కారుకు మద్దతు అనేది రాజకీయ నిర్ణయమని, దానిని ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. నేడు ఆర్టీసీ సంక్షోభంలో ఉందని కేసీఆర్ తాజా వ్యాఖ్యలను చూస్తే అర్థమౌతోందని, సీఎం మొండి వైఖరి వీడి, నిబద్ధతతో ఆలోచించాలని ఆయన …

Read More »

వారు కేసీఆర్ ఇంట్లో పనివాళ్లు కాదు: తమ్మినేని

హైదరాబాద్: సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్‌లో, కేరళలో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారా? అన్న కేసీఆర్ మాటలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, వారికి పెన్షన్ సదుపాయంతో పాటు ఉద్యోగ భద్రతను కూడా కల్పించామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు రెండు నెలల ముందు నోటీసిచ్చి సమ్మె ప్రారంభించారని, వారి …

Read More »