Breaking News
Home / Tag Archives: Crime News

Tag Archives: Crime News

భర్తకు ఇష్టం లేని కొడుకు.. తనకూ అవసరం లేదని.. నీళ్ల డ్రమ్‌లో పడేసి..

చేతులెలా వచ్చాయమ్మా ? కన్నతల్లే బిడ్డను కాటేసింది కేసును ఛేదించిన పోలీసులు తల్లి అరెస్టు, రిమాండుకు తరలింపు వెదురుకుప్పం: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు వారు. మొదట ఓ బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకో బిడ్డ పుట్టాడు. రెండో బిడ్డ పుట్టాక భర్త తనను, రెండో బిడ్డను సరిగా చూసుకోవడం లేదని ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెందింది. తన భర్తకు ఇష్టంలేని ఆ రెండో బిడ్డ …

Read More »

రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రవళికి మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌ మార్టం పూర్తి చేశారు. అనంతరం రవళి మృత దేహాన్ని వరంగల్‌ జిల్లా రామచంద్రపురానికి తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆస్పత్రి వద్ద రవళి కుటుంబాన్ని పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రవళి ఆరోగ్యం మొదటి నుంచి విషమంగానే ఉంది. …

Read More »

కట్నం వేధింపులకు వివాహిత బలి

పెళ్లైన 8 నెలలకే అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య వనస్థలిపురం: భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.. భార్య ఉపాధ్యాయురాలు.. ఇద్దరూ విద్యావంతులే. చెప్పుకోదగ్గ ఉద్యోగాలే. కానీ పెళ్లయిన ఎనిమిది నెలలకే అదనపు కట్నం రక్కసి వారి కాపురంలో చిచ్చుపెట్టింది. భర్త, అత్త మామల వేధింపులు ఆమెను బలి తీసుకున్నాయి. వివాహిత మృతితో వనస్థలిపురం, సుష్మాసాయినగర్‌ కాలనీ శుభోదయ అపార్టుమెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు సుఖంగా ఉంటుందని తల్లిదండ్రులు …

Read More »

దారుణం.. బాలుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టిన దుండగులు

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టి ముళ్లపొదల్లో పడేశారు. యాకత్‌పురాలో ఓ బాలుడు నిన్న అదృశ్యమయ్యాడు. అయితే… ఈ బాలుడ్ని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడం సీసీ ఫుటేజీలో కనిపించాయి. కాగా… ఇదే బాలుడు మంగళవారం ఉదయం యాకత్‌పురా సమీపంలోగల రైల్వేట్రాక్ సమీపంలోని ముళ్ళపొదల్లో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. కాళ్లు, చేతులు విరిగిపోయి ఉన్నాయి. కిడ్నాప్‌కు పాల్పడ్డ వ్యక్తులు బాలుడిపై దాడికి పాల్పడ్డట్లు …

Read More »

ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని గమనించిన భర్త చివరికి..

భార్య వివాహేతర సంబంధం జీర్ణించుకోలేక.. బెంగళూరు, రొళ్ల: భార్య వివాహేతర సంబంధం జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య చే సుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలివి. అనంతపురం జిల్లా రొళ్ల వడ్రహట్టి గ్రామా నికి చెందిన హనుమం తరాయప్ప కుమారుడు పీజీ నాగరాజు (28)కు అదే గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వి వాహమైంది ఏడాది వరకు దాంపత్య జీవనం సాఫీగా సాగింది. అనంతరం అదే …

Read More »

తెనాలిలో దారుణం.. యువతి హత్య

గుంటూరు: తెనాలి ఇస్లాంపేటలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతిని సత్యనారాయణ అనే వ్యక్తి గొంతుకోసి చంపాడు. నిందితుడు సత్యనారాయణ జ్యోతి తండ్రికి స్నేహితుడు. అదే పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని సత్యనారాయణ .. జ్యోతితో సహజీవనం చేస్తున్నాడు. జ్యోతికి 20 సంవత్సరాలు కాగా… సత్యనారాయణకి 40 సంవత్సరాలు. ఇటీవల జ్యోతి వేరొకరితో సెల్ ఫోన్‌ చాటింగ్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదిలా ఉంటే జ్యోతికి పెళ్లి సంబంధాలు …

Read More »

ప్రియుడి కోసం కూతురినే చంపేసింది…….

వేలూరు: వివాహేతర సంబంధం కారణంగా తన ఏడాదిన్నర చిన్నారిని హతమార్చి న కసాయి తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని వాణియంబాడి నేతాజీనగర్‌కు చెందిన నళిని (26)కి బెంగుళూరుకు చెందిన శివకుమార్‌ (30)తో ఏడేళ్ల క్రితం వివాహం కాగా, వీరికి జీవిత్‌కుమార్‌ (6), జస్వంత్‌కుమార్‌ (5) అనే కుమారులు, ఏడాదిన్నర రిత్విక అనే కుమార్తె ఉంది. దంపతుల మధ్య విభేధాల కారణంగా నళని భర్తను విడిచి రిత్వికను తీసుకొని వాణియంబాడిలోని …

Read More »

పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి: జిల్లాలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి బస్టాండ్ సమీపంలో సల్మా హోటల్ ముందు నిలబడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలకు తాళలేక హాటల్‌లో నీటి కోసం పరుగెత్తాడు. హోటల్ సిబ్బంది మొదట భయభ్రంతులకు గురైనా తేరుకుని మంటలను అర్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి నిలకడగా ఉంది. ఎలిగేడు మండల …

Read More »

మధులిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

విషమంగానే మధులిక ఆరోగ్య పరిస్థితి..! శరీరంపై ఏకంగా 15 చోట్ల కత్తి పోట్లు మెదడుకు చేరిన తుప్పు, కొబ్బరి నూనె, గాలి ప్రత్యేక సర్జరీతో తొలగిస్తాం.. యశోదా వైద్యులు హైదరాబాద్‌సిటీ/చాదర్‌ఘాట్‌: ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మధులిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఆమె తల, తల వెనుక భాగం, మెడ, భుజాలు, చేతులపై దాదాపు 15 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. మరో 24 …

Read More »

12 వ తరగతి విద్యార్థిని హత్య చేసిన టెన్త్ స్టూడెంట్

ఫతేబాద్: హర్యానాలోని ఫతేబాద్ పరిధిలోని జాండలీకలా గ్రామంలోని రాజకీయ వరిష్ట మాధ్యమిక విద్యాలయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టెన్త్ విద్యార్థి ఆగ్రహానికి గురై 12 వ తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి హత్య చేశాడు. దాడికి పాల్పడిన విద్యార్థి… సదరు 12వ తరగతి విద్యార్థి ఛాతీపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని …

Read More »