Breaking News
Home / Tag Archives: delhi

Tag Archives: delhi

హత్యకు గురైన ఫ్యాషన్‌ డిజైనర్‌..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. సంపన్నులు నివసించే వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో ఫ్యాషన్‌ డిజైనర్‌ మలా లఖాని ఆమె ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. లఖాని, ఆమె సెక్యూరిటీ గార్డు బహుదూర్‌ సింగ్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 53 సంవత్సరాల లఖానీ తమ ఇంటి సమీపంలోని గ్రీన్‌పార్క్‌ ప్రాంతంలో బొటిక్‌ నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దుండగులు …

Read More »

ప్రతిష్టాత్మక బ్రిడ్జిమీద హిజ్రాల కలకలం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సిగ్నేచర్ బ్రిడ్జి మీద కొందరు హిజ్రాలు తమ దుస్తులను తొలగించుకొని నానా హంగామా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్న వివరాల ప్రకారం ముగ్గురు, నలుగురు హిజ్రాలు దుస్తులు విప్పేసుకుని ఒకరిని ఒకరు కావలించుకుంటూ అశ్లీలంగా ప్రవర్తించారు. దీంతో అటువైపుగా వచ్చేవారంతా తలలు దించుకోవాల్సి వచ్చింది. దీనికితోడు బ్రిడ్జిపై హిజ్రాల చర్యల కారణంగా చాలాసేపు …

Read More »

వర్షం కురిసిన రాత్రి…

న్యూఢిల్లీ: దీపావళి తరువాత ఢిల్లీవాసులు వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోయారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి నవంబర్‌లోని మొదటి 14 రోజుల్లో కాలుష్య ప్రభావం కాస్త తక్కువగానే నమోదైంది. దీనికి కారణం రాత్రి వేళల్లో వర్షం కురవడమేనని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది అక్టోబరు 19 దీపావళి వచ్చింది. అక్టోబరు 20న ఎయిర్ ఇండెక్స్ 236గా నమోదైంది. వారం రోజులు గడిచిన తరువాత కూడా ఇది 347గా కొనసాగింది. …

Read More »

రాత్రంతా ఆడపాదడపా వర్షం… కాలుష్యం నుంచి ఉపశమనం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్సీఆర్‌లో రాత్రంతా ఆగిఆగి వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు కాస్త నెమ్మదించాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్లయ్యింది. ఈ సందర్భంగా వాతావరణశాఖ అధికారులు… ఢిల్లీలో ప్రస్తుతం ఊపిరితీసుకోలేనంతగా ఉన్న కాలుష్యం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా మరోవైపు కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక జారీచేశారు.

Read More »

ఊపిరందక పక్షులు విలవిల… కంటికి కూడా ఇన్ఫెక్షన్!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్న విషయం విదితమే. అంతేకాదు జంతువులు, పక్షులు కూడా కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. ముఖ్యంగా పక్షులు కాలుష్యం బారినపడి శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే వాటి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకుతున్నదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పక్షులను కాపాడాలంటే వాటికి పశువైద్యశాలలో ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీపావళి తరువాత ఢిల్లీ-ఎన్సీఆర్‌లో కాలుష్యం మరింత తీవ్రమైంది. ఢిల్లీలోని చాందినీ …

Read More »

అనంత్‌కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంత్‌కుమార్ మృతికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్ ఈరోజు తెల్లవారుజామున బెంగళూరులోని ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Read More »

రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

న్యూఢిల్లీ : భారీ మొత్తంలో హెరాయిన్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మండీలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఆపిల్‌లను సరఫరా చేసే డబ్బాల్లో ఈ హెరాయిన్‌ను దాచి తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా నుంచి ఈ హెరాయిన్‌ తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.

Read More »

మళ్లీ ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘం

న్యూఢిల్లీ : ఢిల్లీ నగరాన్ని సోమవారం నాడు కాలుష్యం మేఘం మళ్లీ కమ్మేసింది. వాహనాల రాకపోకల రద్దీ, ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును తగుల బెడుతుండడంతో నగర పరిసరాల్లో వాయు కాలుష్యం గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరిగింది. కాలుష్యం నియంత్రణ కోసం నవంబర్‌ ఒటక తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోగా, ఆదివారం నాటికి కాస్త తగ్గి సోమవారం నాడు మళ్లీ పెరిగింది. …

Read More »

ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ వాయిదా

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఈ ఫిటిషన్‌పై ఫిబ్రవరిలో వాదనలు వింటామని జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ ధర్మాసనం తెలిపింది. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా పడింది.

Read More »

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై జీవీఎల్ విసుర్లు

అమరావతి: తనను తాను రక్షించుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్.నరసింహారావు ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవముందని, మోదీ కన్నా తానే సీనియర్ అంటున్న బాబు.. అఖిలేష్ లాంటి బచ్చాలతో కలిసి బీజేపీని ఏం చేయలేరని ధ్వజమెత్తారు. శరద్‌యాదవ్ ఏ పార్టీలో ఉన్నారని బాబు కలుస్తున్నారని ప్రశ్నించారు. మాయావతి.. చంద్రబాబును కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టి మాట్లాడారని వివరించారు. మరోసారి వెళ్తే కింద కూర్చోబెట్టి మాట్లాడతారేమోనని వ్యాఖ్యానించారు. …

Read More »