Breaking News
Home / Tag Archives: devineni uma maheshwar rao

Tag Archives: devineni uma maheshwar rao

తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీ రద్దు…

అమరావతి: పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి తన కేసుల్లో తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీని కూడా రద్దు చేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి దావోస్ వెళ్లి 100 కోట్ల పెట్టుబడులు తెస్తే.. ఇక్కడి మంత్రులు పోడియం ఎక్కి చైర్మన్ దగ్గర కాగితాలు ఎత్తుకెళ్తున్నారని మండిపడ్డారు. ఐదు …

Read More »

అందుకే ఇవాళ ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారు…

అమరావతి: సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తామన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని అన్నారు. సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని దేవినేని ఉమా …

Read More »

సీఎం జగన్ పై టీడీపీ నేత ఉమా వ్యాఖ్యలు…

విజయవాడ: సీఆర్డీయే యాక్ట్‌ను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. అసెంబ్లీలో అందరి ఆమోదంతో సీఆర్డీయే చట్టం రూపొందించినట్లు తెలిపారు. జగన్‌ చేస్తున్న తప్పుడు పనులను ఆమోదించుకునేందుకు… అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారన్నారు. తెలుగుజాతి గుండెలపై ఉన్మాది జగన్‌ తన్నుతున్నారని మండిపడ్డారు. జగన్‌ రాజకీయ ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులకు వెన్నెముక లేదన్నారు.

Read More »

రాజధానిలో జగన్ పాదయాత్ర చేయగలరా?…

విజయవాడ: చంద్రబాబును దుర్భాషలాడడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్‌ భావాలనే కొడాలి నాని బయటికి చెబుతున్నారని చెప్పారు. కొడాలి నాని టికెట్ కోసం.. చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడిన విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. దమ్ముంటే రాజధాని గ్రామాల్లో జగన్‌ను పాదయాత్ర చేయాలని చెప్పాలన్నారు. అప్పుడు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పతనానికి నిన్ననే నాంది …

Read More »

టీడీపీ నేత నివాసం వద్ద ఉద్రిక్తత…

విజయవాడ: టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమా గృహనిర్బంధాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో ఉమా బలవంతంగా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఉమా, కార్యకర్తలు.. పోలీసులను నెట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. జై అమరావతి అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.  

Read More »

వారు రాజధానిలో పాదయాత్ర చేయగలరా?…

అమరావతి: వైసీపీ నేతలు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్‌, కుటుంబ సభ్యులు రాజధానిలో పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు. విశాఖలో వేలాది ఎకరాలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భూదందాలకు పాల్పడుతున్నారని, సీఎం జగన్‌కి ధైర్యం ఉంటే విశాఖ భూదందాలపై సీబీఐ విచారణ జరపాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రికి సహకరించిన అధికారులు జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. …

Read More »

రాజధానిని మార్చాలని ఎవరు అడిగారు?…

అమరావతి: రాజధానిని మార్చాలని జగన్‌ను ఎవరు అడిగారని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జ్యోతుల సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతాల మధ్య చిచ్చే పెట్టేందుకే మూడు రాజధానుల ప్రకటన చేశారని ఆరోపించారు. అమరావతి అనే పేరు వల్ల చంద్రబాబు బ్రాండ్ అయితే…వైఎస్సార్ లేదా గాంధీ పేరు పెట్టుకోవాలని సూచించారు. అలాకాకుండా విశాఖకు …

Read More »

దేవినేని ఉమ దీక్షకు జ్యోతుల నెహ్రూ సంఘీభావం…

అమరావతి: రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మాజీ ఎమ్యెల్యే జోతుల నెహ్రు, నాగుల్ మీరా, ఎమ్మెల్సీ రామకృష్ణ సంఘీభావం తెలిపారు. ఉమ దీక్షకు మద్దతు తెలిపేందుకు వచ్చిన రైతులు.. మామిడికాయలు, వేరుశనగ పంటను తీసుకొచ్చారు.

Read More »

మంత్రి పెద్దిరెడ్డికి దేవినేని ఉమ సూచన…

విజయవాడ: రాజధానిలో రైతుల భూముల చదును చేసిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని అంశాలను మంత్రులు ఒకసారి చదువుకోవాలని ఆయన సూచించారు. రైతుల చేతుల్లో నుంచి సీఆర్డీఏ చేతుల్లోకి భూములు వెళ్లిపోయాయని ఉమ తెలిపారు. సీఆర్డీఏ చట్టప్రకారం అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రైతులకు ఫ్లాట్లను అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. …

Read More »

రైతులకు మద్దతుగా దేవినేని ఉమా దీక్ష…

విజయవాడ: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. దీక్షకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ… ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజధానిలో ఉద్యమం అణిచివేతకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. …

Read More »