Breaking News
Home / Tag Archives: dharna

Tag Archives: dharna

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అయ్యప్పస్వాముల ధర్నా..

హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గో సర్వీస్‌ సంస్థ ప్రతినిధుల నిర్లక్ష్య సమాధానంతో 180 మంది అయ్యప్పస్వాములు ధర్నాకు దిగారు. శబరిమల వెళ్లేందుకు స్వాములు టికెట్లు బుక్‌ చేసుకుని ఎయిర్‌పోర్టుకు వచ్చారు. బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే కొచ్చిన్‌ విమానం క్యాన్సిల్‌ అయిందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ధర్నాకు దిగారు. మరో విమానం ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. వారిని శాంతింపజేసేందుకు ఎయిర్‌పోర్టు పోలీసులు ప్రయత్నించారు.

Read More »

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ…

గుంటూరు : పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ… వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురజాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ, సిపిఎంల తో పాటు ముస్లిం యూత్‌, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పాల్గొన్నాయి. పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోవాలి, మోదీ డౌన్‌, డౌన్‌, మతసామరస్యం కాపాడండి, లౌకికవాదం కాపాడండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి.. అనే నినాదాలతో మసీదు సెంటర్‌ నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

పాలకొల్లులో ట్రాక్టర్‌ ఓనర్స్‌ డ్రైవర్ల యూనియన్‌ ధర్నా

రాష్ట్ర ప్రభుత్వం నల్లమట్టి ఇసుకపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలి : ట్రాక్టర్‌ ఓనర్స్‌ డ్రైవర్ల యూనియన్‌  స్పందించిన వైసిపి ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌.. ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ పశ్చిమ గోదావరి : నల్లమట్టిపై మైనింగ్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ… రాష్ట్ర ప్రభుత్వం నల్లమట్టి ఇసుకపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని పాలకొల్లు నియోజవర్గ ట్రాక్టర్‌ ఓనర్స్‌ డ్రైవర్ల యూనియన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు …

Read More »

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నేడు ధర్నా….

హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలకు పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఆర్టీసీ సమస్యను పరిష్కరిస్తున్నామంటూనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని, ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తోందని  గండిపేట మండల మాజీ అధ్యక్షుడు ముంగి జైపాల్‌రెడ్డి వాపోయారు. ఈ టికెట్‌ ధరల పెంపునకు నిరసనగా చేపట్టే ధర్నాలో పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు …

Read More »

తహసీల్దార్ హత్యకు నిరసనగా…

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయరెడ్డిపై పెట్రోలు పోసి దారణంగా హత్య చేసిన సంఘటనకు నిరసనగా.. మంగళవారం ఉదయం తిరువూరులో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

Read More »

రిక్షా కార్మికులకు భరోసా కల్పించాలంటూ ధర్నా….

విజయనగరం: సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిక్షా కార్మికులు తమకు భరోసా కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తుందని, అత్యవసరమైన కార్మికులకు మాత్రం భరోసా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా కార్మికులకు తక్షణమే ఏడాదికి పదివేల రూపాయలు …

Read More »

భూములకు పట్టాలివ్వాలని ధర్నా….

విజయనగరం : పాచిపెంట మండలం జీలుగువలస గ్రామాల్లో గిరిజనులపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకొని గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల ఇల్లు కూలగొట్టి దౌర్జన్యం చేసిన సురేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు …

Read More »

ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించాలి….

మలికిపురం: పర్యావరణానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతున్న ప్లాస్టిక్‌ వస్తువులను నిర్మూలించాలంటూ.. మలికిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో గ్రామ వాలంటీర్లు గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. పాలిథీన్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగాలు పర్యావరణం పాలిట శాపంగా మారాయని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని అలాంటి ప్లాస్టిక్‌ ను ఉపయోగించకూడదంటూ.. నినాదాలు చేశారు.

Read More »

కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలంటూ…..

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ధరలు తగ్గించాలని, ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లను పెంచాలని, గత నాలుగు నెలలుగా పని లేక నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయల కరువు భత్యాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read More »

అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి…

ప్రకాశం : జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ.. వేటపాలెంలోని ఓరుగంటి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో, వేటపాలెం తహశీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జర్నలిస్ట్‌ నాగార్జున రెడ్డి పై హత్యాయత్నం చేసిన అసలు దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read More »