Breaking News
Home / Tag Archives: Diwali

Tag Archives: Diwali

రాజన్న క్షేత్రంలో ఘనంగా దీపావళి వేడుకలు

వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 27వ తేదీ ఆదివారం నరక చతుర్దశి, దీపావళి పర్వదినం వేడుకలను నిర్వహించారు. నరక చతుర్దశి సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు మంగళవాయిద్యములు, 3.40 గంటల నుంచి సుప్రభాత సేవ, 4.10 గంటల నుంచి సుప్రభాత హారతి, 4.15 గంటల నుంచి మంగళహారతులు, 4.50 గంటల నుంచి ప్రాతఃకాల పూజ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు నరకాసుర వధ …

Read More »

ధైర్యవంతులతో మాట్లాడటం సంతోషకరం : మోదీ

జమ్మూ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి సంబరాలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి సైనిక దళాలతో ఆయన సంతోషంగా గడిపారు. సైనికులకు మిఠాయిలు తినిపించారు. ఆదివారం ఇన్‌ఫాంట్రీ (పదాతి దళం) దినోత్సవాలను కూడా నిర్వహించారు. పాకిస్థాన్ మద్దతుతో జమ్మూ-కశ్మీరులోకి చొరబడినవారిని తరిమి కొట్టేందుకు 1947లో భారతీయ దళాలు ఆ రాష్ట్రంలో అడుగు పెట్టిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. …

Read More »

అభిమానులకు దీపావళి విషెస్ చెప్పిన విదేశీ క్రికెటర్లు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడే స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా ఫ్యాన్స్‌కి విషెస్ తెలిపారు. ‘‘ఇండియాలోని నా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే వార్నర్ నేడు.. తన 33వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. …

Read More »

రాజ్‌భవన్‌లో దీపావళి సంబరాలు

విజయవాడ: రాజ్‌భవన్‌లో దీపావళి సంబరాలు జరిగాయి. గవర్నర్‌ హరిచందన్‌ దంపతులు పాల్గొన్నారు. పర్యావరణహిత పద్ధతిలో దీపావళి పండుగ జరుపుకున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Read More »

కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లను కాల్చుకోవడానికి మాత్రమే అనుమతి….?

దీపావళి అనగానే మనసుకి ఆహ్లాదాలనిచ్చే దీపాలూ, వాతావరణాన్ని కలుషితం చేసే టపాకాయలే గుర్తొస్తాయి. అందుకే దీపావళి పండుగని ప్రమాదకరంగా పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏటా వేలాది మందిని మృత్యువు దరికి చేరుస్తోన్న టపాకాయలు కాల్చొద్దంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ఎకోఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేస్తున్నారు. ఇవి తక్కువ శబ్దంతో, తక్కువ పొగని విడుదల చేస్తాయి. ఎలక్ట్రిక్‌ బల్బులకు బదులుగా బయోడీగ్రేడబుల్‌ దీపాలను వెలిగించడం వల్ల …

Read More »

దీపావళి సెలవుపై సందిగ్ధత

దీపావళి సెలవుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 27న సెలవు ఉంటుందా? 28కి మారుతుందా అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27నే దీపావళి ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు సమాచారం. చతుర్దశి ఘడియాలు ఆదివారం మధ్యాహ్నం తరువాత వస్తాయని కాబట్టి సోమవారమే పండుగ అని కొంతమంది అంటున్నారు. హైకోర్టు కూడా సోమవారం సెలవుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారమే …

Read More »

దీపావళి నాడు గిఫ్టులలో ఈ వస్తువులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదైనా పండుగకూ లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి చాలా మంది వారి స్నేహితులకు, బంధువులకు, ప్రేమికులకు బహుమతులు ఇస్తూ ఉంటారు, స్వీకరిస్తుంటారు. ఈ గిఫ్ట్ లు గురించి ఒకసారి పరిశీలిస్తే ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన సంప్రదాయం. మొదట్లో ఈ బహుమతులను కేవలం వివాహం మరియు పుట్టినరోజు, నామకరణం సందర్భాలలో మాత్రమే ఇచ్చేవారు. కానీ ఆధునికత పెరిగిన ఈ కాలంలో చీటికి మాటికీ …

Read More »

భారత్,పాక్ సరిహద్దుల్లో దీపావళి మిఠాయిల మార్పిడికి నో

వాఘా: భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వాఘా వద్ద ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా మిఠాయిలు, బాణసంచా మార్పిడికి తెరపడనుంది. వాఘా సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ పాకిస్థాన్ లోని ముఖ్యులందరికీ మిఠాయిలు పంపిస్తుండటం ఆనవాయితీ. దీంతోపాటు వాఘా సరిహద్దుల్లోనూ భారత, పాకిస్థాన్ రేంజర్లు బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో మిఠాయిలు, బాణసంచాను ఇచ్చి పుచ్చుకుంటారు. కాని ఈ …

Read More »

దీపావళికి బాణా సంచా అమ్మాలనుకుంటున్నారా.. ఇవి తప్పనిసరి

హైదరాబాద్‌ : దీపావళి సందర్భంగా టపాసుల అమ్మకానికి, బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్న వ్యాపారులు… ఈ నెల 21లోపు దరఖాస్తులు చేసుకోవాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సూచించారు. ప్రతి జోన్‌లో డీసీపీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు పొందవచ్చన్నారు. నింపిన ఫారములను ఈ నెల 21లోపు కార్యాలయాల్లో అందజేసి అనుమతి తీసుకోవాలన్నారు. 21 తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు. విశాలమైన మైదాన స్థలం ఉన్న ప్రాంతాల్లోనే దుకాణాలు …

Read More »

దివాలీ సేల్‌తో వచ్చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

న్యూఢిల్లీ: ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ముగిసి మూడు రోజులైనా కాకముందే ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌కు సిద్ధమైంది. ‘బిగ్ దివాలీ సేల్’ పేరుతో ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదు రోజులపాటు మరోమారు భారీ ఆఫర్లతో ముందుకొస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, వేరబుల్స్, టీవీలు, అప్లయెన్సెస్ తదితర వాటితోపాటు మరెన్నో ఉత్పత్తులపై ఆఫర్ల ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్ సేల్‌‌’కు మల్లే ‘బిగ్ దివాలీ’ సేల్‌లో …

Read More »