Breaking News
Home / Tag Archives: dk aruna

Tag Archives: dk aruna

ఢిల్లీ వెళ్లిన డీకే అరుణ..

హైదరాబాద్: బీజేపీ నాయకురాలు డీకే అరుణ న్యూఢిల్లీ వెళ్లారు. రెండు రోజులపాటు ఆమె ఢిల్లీలోనే పర్యటించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు.. పలువురు బీజేపీ పెద్దలను డీకే అరుణ కలవనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీలో డీకే అరుణ ఉన్నట్టు తెలుస్తోంది.

Read More »

దశల వారీగా పోరాటం కొనసాగిస్తాము….

హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద డీకే అరుణ చేపట్టిన బీజేపీ మహిళా సంకల్ప దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మద్యం మత్తులో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ఆగాలంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మద్యాన్ని నిషేధించే వరకు …

Read More »

బిజెపి వ్యూహం అదుర్స్

చాన్నాళ్ళ తర్వాత  అనే మాటను వింటున్నాం. 90వ దశకంలో దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం చివరికి మద్య నిషేధ ఉద్యమంగా మారి ఓ ఏడాదిన్నర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్టీయార్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఏపీలో మద్యనిషేధాన్ని క్రమంగా ఎత్తేశారు. ఆ తర్వాత మద్య నిషేధం అమలు సాధ్యం కాదన్న స్థిర …

Read More »

ఏపీ ప్రభుత్వ నిర్ణయం భేష్..

హైదరాబాద్ : మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశంసించారు. తెలంగాణలో కూడా మద్యాన్ని నిషేధించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలని సూచించారు. దిశ, మానస, సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని డీకే అరుణ అన్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు …

Read More »

మద్యం నిషేదంపై డీకే అరుణ దీక్ష….

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం నిషేధించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీమంత్రి డీకే.అరుణ ఇందిరా పార్క్ వద్ద ‘మహిళా సంకల్ప దీక్ష’ పేరుతో దీక్ష చేపట్టారు. అరుణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు మహిళా మోర్చా, బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు, విద్యార్థినులు భారీగా హాజరయ్యారు.

Read More »

రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిన సీఎం

ఖానాపూర్‌: రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చడంతో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. పొట్టకూటి కోసం వెళ్లిన వివాహితను దుండగులు కనికరం లేకుండా అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్యచేశారన్నారు. దిశ నిందితులకు ఒక న్యాయం.. ‘సమత’కు మరో న్యాయం సరికాదని …

Read More »

డీకే అరుణకు బీజేపీలో ముఖ్య పదవి?…

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ప్రశ్నకు త్వరలోనే ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. అయితే మరోసారి కూడా లక్ష్మణ్‌ కు పదవిని ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్ష పదవి తనదే అనే ధీమాలో మాజీమంత్రి డీకే అరుణ ఉందని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై దుడుకుగా ప్రవర్తిస్తున్నారనే …

Read More »

మహిళ సంకల్ప దీక్ష చేయనున్న మాజీ మంత్రి…

హైదరాబాద్: మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11, 12వ తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల పాటు ‘మహిళ సంకల్ప దీక్ష’ చేయనున్నారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దిశ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించకపోవటం బాధాకరమన్నారు. దిశ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరిగినా.. సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని డీకే అరుణ …

Read More »

డీకే అరుణకు సోషల్ మీడియా షాక్‌.. .

వైరల్ న్యూస్:సీనియర్ రాజకీయ నాయకురాలు, బీజేపీ నేత డీకే అరుణకు సోషల్ మీడియా వేదికగా ఊహించని షాక్ ఎదురైంది. గత కొద్దికాలంగా వినిపిస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తెరమీదకు వచ్చిన వార్తలతో డీకే అరుణ ఇరుకున పడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చనున్నారని, డిసెంబర్ నెలాఖరులోగా కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ తరుణంలో…మాజీ మంత్రి డీకే అరుణ కు ఢిల్లీ నుంచి పిలుపు …

Read More »

ప్రియాంక హత్యను నిరసిస్తూ బీజేపీ ధర్నా….

హైదరాబాద్: వైద్యురాలి హత్యను నిరసిస్తూ ఇందిరాపార్క్‌ దగ్గర బీజేపీ ధర్నా కార్యక్రమం చేపట్టనుందని ఆ పార్టీ నేత డీకే అరుణ తెలిపారు. ఉపఎన్నికల్లో గెలవగానే కేసీఆర్‌ ప్రెస్‌మీట్ పెడతాడని అలాంటిది.. రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరగుతుంటే కేసీఆర్‌ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరిగినా చెప్పుకోవడానికి దిక్కు లేదని డీకే అరుణ పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెను అణచివేయడానికి వేలాది మంది పోలీసులను వాడారని.. విపక్షాలను భయపెట్టడానికి ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారని డీకే …

Read More »