Breaking News
Home / Tag Archives: dwaraka tirumala

Tag Archives: dwaraka tirumala

21న ద్వారకా తిరుమల ఆలయం మూసివేత

ఏలూరు: ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నారు. 20న రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ, శుద్ధి చేయనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 21న సూర్య గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు తెలిపారు.

Read More »

‘ద్వారకా తిరుమల’లో హీరో బాలయ్య సందడి

ఏలూరు: పవిత్ర హృదయం, భక్తి ఉండటం వల్ల హీరో నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి .. ‘శ్రీనివాసో విజయతే’ వంటి గ్రంధాలను వేలమంది భక్తులకు సమర్పించగలిగారని ‘ద్వారకా తిరుమల’ అర్చక, వేదపండిత బృందం ప్రశంసలు కురిపించింది. హీరో నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ‘శ్రీనివాసో విజయతే’ ఏడువేల ప్రతులను ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు అందజేశారు. అటు భక్తులకు కూడా …

Read More »

దివ్యాంగులకు విఐఆర్ఆర్‌డి హ్యాపీ న్యూ ఇయర్

ద్వారకా తిరుమల: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో దివ్యాంగుల పాలిట కల్పవృక్షంగా పేరొందిన విఐఆర్ఆర్‌డి (వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ డిసేబుల్డ్)లో జరిగిన నూతన సంవత్సరం 2020 వేడుకలు రోగులకు ఆహ్లాదాన్ని మిగిల్చాయి. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్, సిబ్బంది వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి దివ్యాంగులు, రోగులకు పంచారు. విఐఆర్ఆర్‌డి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ స్వయంగా దివ్యాంగులైన చిన్నారులకు కేక్ తినిపించారు. …

Read More »

16 నుంచి సుదర్శన యాగం

పశ్చిమ గోదావరి/ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్త్రీ షోడశ కుండాత్మక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సుదర్శన యాగం ఈనెల 16 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. కొండపైన గల గోశాల పక్కన ఖాళీ ప్రదేశంలో మహాసుదర్శన యాగానికి నిర్మాణం చేపడుతున్నారు. మహాసుదర్శనయాగాన్ని లోకకల్యాణార్ధం నిర్వహిస్తున్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. మహాసుదర్శన యాగంలో పాల్గొనే దంపతులు రూ.5,116 రుసుము చెల్లించాలని తెలిపారు. ఆర్జిత, నిత్యార్జిత కల్యాణాలు జరపబడవు… స్వామి వారి …

Read More »

ముగియనున్న ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు…

పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వీజమాస బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు నేడు చిన వెంకన్న దర్శనమిస్తున్నారు. ఉదయం చుర్ణోత్సవం, వసంతోత్సవం రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షణములు, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Read More »

నేడు చిన్న వెంకన్న స్వామివారి కళ్యాణం….

పశ్చిమ గోదావరి: చిన వెంకన్న స్వామి వారి కళ్యాణాన్ని నేటి రాత్రి 9 గంటలకు శ్రీవారి పాదుకా మండపంలో వైభవంగా నిర్వహించనున్నారు. కళ్యాణం అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి సేవను నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఐదో రోజు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారికి ఉదయం సింహవాహనంపై ఊరేగింపు నిర్వహించారు.

Read More »

రెండో రోజు కాళీయమర్దనగా చిన వెంకన్న…

పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు కాళీయమర్దన అలంకరణలో చిన వెంకన్న స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గం.కు అంకురార్పణ, ధ్వజారోహణ రాత్రి 8 గంటలకు హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

Read More »