Breaking News
Home / Tag Archives: East Godavari district

Tag Archives: East Godavari district

తూర్పుగోదావరి జిల్లాలో రెడ్‌జోన్లు ఎత్తివేత…

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో గత 28 రోజులుగా ఎలాంటి కరోనా పాటిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్‌జోన్‌ను ఎత్తివేశారు. రాజమండ్రి వీరభద్రాపురం, శాంతినగర్‌లలో రెడ్‌జోన్‌ను ఎత్తివేశారు. కాగా రాజమండ్రిలో ఎనిమిది కంటైన్మెంట జోన్లు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపులో రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది.

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో ఆరు కరోనా కేసులు…

తూర్పుగోదావరి: జిల్లాలోని కత్తిపూడిలో ఆరు కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే మరో 16 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 25 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా కేసుల ప్రభావంతో కత్తిపూడిలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు.

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా కేసు….

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా కేసు నమోదైనట్టు డీఎంహెచ్‌వో సత్యసుశీల తెలిపారు. శంకవరం మండలం కత్తిపూడిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన ఓ వ్యక్తి గత నెల ఉగాది రోజున కుటుంబ సభ్యులతో కలిసి కత్తిపూడికి వచ్చాడు. ఇటీవల జ్వరం రావడంతో అతడికి వైద్య పరీక్షలు చేశారు. అతడికి పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. …

Read More »

ఏపీలో మరో ఇద్దరికి కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 21కేసులు నమోదు కాగా, ఇవాళ ఒక్క రోజే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటికే మూడు కేసులు నిర్ధారణ కాగా, తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. విజయవాడ, తూ.గో జిల్లాల్లో  కరోనా పాజిటివ్ కేసులను వైద్యులు నిర్ధారించారు. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరింది.

Read More »

ఏపీలో కరోనా అనుమానిత మహిళ మృతి…

తూర్పుగోదావరి: కరోనా అనుమానిత లక్షణాలున్న మహిళ మృతి చెందింది. కాకినాడ ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతూ అంతర్వేదిపాలెం మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలే దుబాయ్‌ నుంచి అంతర్వేదిపాలెం ఆమె వచ్చినట్లు గ్రామస్థులు చెప్పారు. నిన్న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు. ప్రాథమికంగా మెదడువాపుతో మృతి చెందినట్లు భావిస్తున్నామని, కరోనా పరీక్షలు రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం…

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండారులంక మట్టపర్తివారి పాలెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇల్లు కాలిబూడిదవడంతో ఆరు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.

Read More »

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు

రంపచోడవరం: తూర్పుగోదావరిజిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి(టీడీపీ), కోసూరి కాశీవిశ్వనాథ్‌(బీజేపీ), తిమ్మాపురానికి చెందిన టీడీపీ నాయకుడు సంగం శ్రీకాంత్‌ తమను అటకాయించి, దూషించారంటూ ఇద్దరు గిరిజనులు చేసిన ఫిర్యాదుపై ఐపీసీ, అట్రాసిటీ చట్టాల కింద అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్డతీగల మండలం తిమ్మాపురం ఇసుక ర్యాంపువద్దకు సోమవారం మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, కోసూరి కాశీ విశ్వనాథ్‌ తమ అనుచరులతో వెళ్లి అక్కడ ఇసుక ట్రాక్టర్లతో …

Read More »

రేపు అన్నవరం సత్తెన్న ఆలయం మూసివేత

తూర్పు గోదావరి: రేపు సూర్యగ్రహణం సందర్భంగా సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. సంప్రోక్షణ, శుద్ది కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సర్వదర్శనాలు, వ్రతాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ నిత్యం జరుగుతున్న సత్యదేవుని నిత్యకళ్యాణం, ఇతర ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేయనున్నారు.

Read More »

మోడల్ హస్పిటల్ గా తీర్చిదిద్దుతాము….

తూర్పు గోదావరి : రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ హాస్పిటల్‌ లో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ శనివారం తనిఖీలు చేపట్టారు. కేంద్ర మంత్రిని కలిసి హాస్పిటల్‌ స్థితిని ఎంపీ భరత్‌రామ్‌ వివరించారు. 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడంతో.. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ భరత్‌రామ్‌ ప్రకటించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి.. నాడు-నేడు ఆదర్శంగా ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను మోడల్‌ హాస్పిటల్‌ గా తీర్చిదిద్దుతామని ఎంపీ భరత్‌ రామ్‌ పేర్కొన్నారు.

Read More »

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి ఆరా….

అమరావతి : తూర్పు గోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్‌ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం ఆరా తీశారు. వెంటనే ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి నాని చర్చించారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Read More »