Breaking News
Home / Tag Archives: eluru

Tag Archives: eluru

పశ్చిమ గోదావరిలో 2762కు చేరుకున్న కరోనా కేసులు

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2762కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఏలూరులో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. జిల్లాలో కొత్తగా ఆరు కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కాలేజ్‌లో కోవిడ్ పరీక్షల కేంద్రం విస్తరిస్తున్నామని.. ఇకపై …

Read More »

మంత్రి తానేటి వనిత గన్‌మెన్‌ దాష్టికం

ఏలూరు: ఏలూరులో మంత్రి తానేటి వనిత గన్‌మెన్‌ చంద్రారావు దాష్టికానికి పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకున్న కూతురు, అల్లుడిపై చంద్రారావు దాడి చేశాడు. 5నెలల క్రితం పోలీసుల సమక్షంలో చంద్రారావు కూతురు గాయత్రి ప్రేమపెళ్లి చేసుకుంది. గాయత్రి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయినప్పటికీ కనికరం లేకుంగా చంద్రారావు ప్రవర్తించాడు. కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని చంద్రరావు అల్లుడిపై దాడికి తెగబడ్డాడు. ఎస్పీ ఆఫీసు దగ్గర్లో కూతురు, అల్లుడిని తరుముతూ చంద్రారావు …

Read More »

21న ద్వారకా తిరుమల ఆలయం మూసివేత

ఏలూరు: ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నారు. 20న రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ, శుద్ధి చేయనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 21న సూర్య గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు తెలిపారు.

Read More »

పశ్చిమ గోదావరిలో మరో 7 కరోనా కేసులు..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏలూరు అగ్రహారంలో రెండు, తూర్పు వీధిలో రెండు, మెయిన్ బజార్‌లో ఒకటి, పెదపాడు నిడదవోలులలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 133కు చేరుకుంది. అలాగే ప్రస్తుతం ఆస్పత్రిలో 76 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే 57 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరులో పాజిటివ్‌తో ఒక …

Read More »

పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆరు కరోనా కేసులు…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 110కి చేరింది. పెదవేగి మండలం పినకడిమి, భీమవరంలో ఒక్కో కేసు, ఉండి మండలం చెరకువాడ, పెనుగొండలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 52 మంది చికిత్స పొందుతుండగా, ఆస్పత్రి నుంచి 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34,692 మందికి కరోనా …

Read More »

కామంతో కళ్లు మూసుకుపోయి తండ్రి…?

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురి పాలిట కాలయముడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెనే కాటేయాలనుకున్నాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ నీచానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా.. ఇతరుల దగ్గరకు కూడా వెళ్లాలంటూ వేధింపులకు గురిచేశాడు. చుట్టు పక్కల వారికి విషయం తెలియడంతో దుర్మార్గపు తండ్రి ఇంటి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

దేవాలయాలు తెరవాలంటూ వినూత్న నిరసన…

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడులో ప్రజలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో లిక్కర్ షాపులకు అనుమతులు ఇచ్చి… దేవాలయాలకు అనుమతులు ఇవ్వకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు దేవాలయాల్లోకి షరతులతో కూడిన దర్శనం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More »

ఏలూరులో రెడ్‌జోన్ నిబంధనలు సడలింపు…

కాకినాడ: పశ్చిమగోదాపగోదావరి జిల్లా ఏలూరు విద్యానగర్‌లో అధికారులు రెడ్‌జోన్ నిబంధనలకు సడలింపునిచ్చారు. ఆ ప్రాంతంలో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దీంతో విద్యానగర్ ప్రాంతాన్ని రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్‌‌జోన్‌గా మార్చారు. గతంలో ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో విద్యానగర్‌లో రెడ్‌జోన్ నిబంధనలు అమలు చేసిన విషయం తెలిసిందే.

Read More »

బ్యాంకులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంకులను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. బ్యాంకులో గుంపులుగా జనాన్ని చూసి ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాదారులు కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.500 జమ చేయడంతో వాటిని తీసుకోవడానికి ఖాతాదారులు క్యూ కట్టారు. రెండు మీటర్ల దూరాన్ని పాటించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి …

Read More »

ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించండి…

ఏలూరు : కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్‌కు పంపించాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరులోని మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి ఆళ్లనాని అధికారులతో కలిసి శనివారం కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసు, మెడికల్‌ టీమ్స్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. …

Read More »