Breaking News
Home / Tag Archives: film news

Tag Archives: film news

ఇండియన్ బ్రాండ్లే కొనండి…

కరోనా దెబ్బతో పలు వ్యాపారాలు భారీగా దెబ్బతినగా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత స్థానిక వ్యాపారులు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కాజల్ కోరింది. ఇందుకోసం సెలవులను ఇండియాలోనే గడపాలని, బయట తినేవాళ్లు స్థానిక రెస్టారెంట్స్, హోటల్స్‌లో తినాలని కోరింది. అలాగే ఇండియాలో పండించే కూరగాయలను, పండ్లను, ఇండియన్ బ్రాండ్స్ వస్తువులను కొనాలంది. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంక్షోభం నుంచి బయటపడాలంది.

Read More »

PSPK27లో చరణ్?..

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. ఈ మూవీలో ఓ ముఖ్యపాత్ర ఉందని, దానిని ఎవరైనా హీరో చేస్తే బాగుంటుందని పవన్‌కు క్రిష్ చెప్పగా, చరణ్‌ను అడగమని పవన్ సలహా ఇచ్చాడట. దీంతో దర్శకుడు చరణ్‌ను సంప్రదించగా, బాబాయ్ సినిమా కావడంతో వెంటనే ఓకే చేశాడట. దీనిపై అధికారిక …

Read More »

ప్రజలకు విజయ్ సూచన…

దేశవ్యాప్తంగా మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లు సప్లై లేకపోవడంతో చాలా మంది మాస్కులు లేకుండానే బయటకు వెళ్తున్నారు. అయితే యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రజలకు ఓ సూచన చేశాడు. ముఖానికి క్లాత్ అడ్డుపెట్టుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నాడు. మాస్కులను డాక్టర్ల కోసం వదిలేయాలని.. దానికి బదులు హ్యాండ్ కర్చీఫ్, స్కార్ఫ్, చున్నీలను మాస్కులుగా వాడుకోండని సూచించాడు.

Read More »

ప్రేమలో పూజా హెగ్డే?

ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడైన రోహన్‌ మెహ్రాతో అమ్మడు ప్రేమాయణం నడుపుతోందని టాక్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పూజా ఇలా చేయడమేంటని అప్పుడే సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పూజా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, అఖిల్‌తో.. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో సినిమాలు చేస్తోంది.

Read More »

లక్ష కుటుంబాలకు అమితాబ్ సాయం

లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ పరిశ్రమకు చెందిన లక్ష కుటుంబాలకు సాయం చేయడానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు నెల వారి సరుకులను అందించనున్నారు. అమితాబ్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సాయం చేయనుండగా.. ‘దేశవ్యాప్తంగా లక్ష మంది రోజు వారీ సినీ కార్మికుల కుటుంబాలకు కావాల్సిన నెలవారీ రేషన్‌ను అందించనున్నాం’ అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Read More »

‘RRR’ విడుదలపై నిర్మాత క్లారిటీ…

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో ‘RRR’ మరోసారి వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. జనవరి 8న విడుదల కావాల్సిన సినిమా జూన్‌కు పోస్ట్‌పోన్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందించాడు. సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం లేదన్నాడు. కరోనా ప్రభావం సినిమాపై ఉండదన్న ఆయన.. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా దాదాపు పూర్తయిందన్నాడు.

Read More »

సినీ కార్మికులకు నయనతార సాయం…

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. లాక్‌డౌన్‌ వల్ల సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ వంతు సాయాన్ని అందించారు. తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా ఫిల్మ్ …

Read More »

బుట్ట బొమ్మ@ 100మిలియన్ వ్యూస్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట రికార్డు సృష్టించింది. ఈ పాట యూట్యూబ్‌లో 100మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ స్టెప్స్, తమన్ మ్యూజిక్, అర్మాన్ మాలిక్ గొంతు ఈ పాటకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. కాగా ‘అలవైకుంఠపురంలో’ సినిమాలో 100మిలియన్ వ్యూస్ సాధించిన మూడోపాటగా ‘బుట్టబొమ్మ’ నిలిచింది.

Read More »

మహానటి పెళ్లి ఫిక్స్ అయిందా?

త్వరలోనే ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడితో హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి జరగనుందని వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో పెళ్లి ఉంటుందని, త్వరలోనే కీర్తి సురేష్ ఫ్యామిలీ నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్. కాగా మహానటి సినిమాతో దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Read More »

2మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించిన చరణ్…

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియ‌న్స్ ఫాలోవర్స్‌ని సంపాదించాడు. కేవ‌లం 67 పోస్ట్‌లు మాత్ర‌మే పోస్ట్ చేసిన చ‌రణ్ ఈ ఘ‌న‌త ద‌క్కించుకోవ‌డం విశేషం. ఎక్కువ‌గా ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్‌లు పెట్టే చ‌ర‌ణ్‌.. అప్పుడప్పుడు సినిమా విశేషాల‌ని కూడా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తుంటాడు. అటు మరో సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్‌లోకి రామ్ చ‌ర‌ణ్ ఈ మధ్య కాలంలోనే అడుగు పెట్టడం తెలిసిందే.

Read More »