Breaking News
Home / Tag Archives: governor

Tag Archives: governor

నేటి ముఖ్యాంశాలు..

తెలంగాణ హైదరాబాద్‌: నేడు ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ ►కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న ఐదుగురు నిందితులు ►ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌రెడ్డిని.. నేడు కోర్టుకు హాజరు పరుస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఆంక్షలు ►నేటి నుంచి ఈనెల 31వరకు మూడురోజులపాటే కేసుల విచారణ ►సోమ, బుధ, శుక్రవారాల్లోనే హైకోర్టులో కేసుల విచారణ హైదరాబాద్‌: నేటి నుంచి …

Read More »

ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ వివరణ కోరారు. గవర్నర్‌ పిలుపుమేరకు రాజ్‌ భవన్‌కు చేరుకున్న రమేష్ ఎన్నికల వాయిదాపై వివరణ ఇస్తున్నారు. గంటకుపైగా సాగుతున్న వీరి భేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని గవర్నర్ ఈసీకి తెలిపినట్లు సమాచారం.

Read More »

గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

హైదరాబాద్: రాజ్‌భవన్ వర్గాలు… కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇందుకు ప్రధాన కారణం… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన సలహాయే. ప్రజలు సమూహాలుగా ఉండొద్దని ఆ శాఖ కోరింది. ఈ క్రమంలోనే… రాజ్‌భవన్ వర్గాలు… ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే రాజ్‌భవన్ వర్గాలు తదుపరి సమావేశాల తేదీలు నిర్ణయిస్తాయని తెలిసింది.

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్‌ ఆగ్రహం

తాడేపల్లి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన …

Read More »

మార్చి 6 నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ 2020-21 వార్షిక బడ్జెట్‌ సమావేశాలను మార్చి 6 నుంచి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం, మరుసటి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ ప్రారంభంకానుంది. మార్చి 8 ఆదివారం, మరుసటి రోజు హోళీ పండుగ కావడంతో పదో తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 25 వరకు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. 13 …

Read More »

ప్రొరోగ్ అంటే ఏమిటి?

ప్రొరోగ్ అంటే దీర్ఘకాలిక సెలవు అని అర్థం. సభ సమావేశాలు ముగియడం లేదా పరిసమాప్తం కావడాన్ని ప్రొరోగ్ అంటారు. పార్లమెంటును రాష్ర్టపతి, అసెంబ్లీ లేదా మండలిని గవర్నర్ దీర్ఘకాలిక వాయిదా వేస్తారు. తిరిగి రాష్ర్టపతి/ గవర్నర్ పిలుపు ఇచ్చేంతవరకు సభలు వాయిదా పడతాయి. గరిష్టంగా 6 నెలలు వాయిదా పడవచ్చు. ఈ సమయంలో ప్రభుత్వాలకు కావాల్సిన బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావచ్చు.

Read More »

రైతుసేవల కోసం శాస్త్రవేత్తలు కృషి చేయాలి: తమిళిసై

హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేవలందించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శాస్త్రవేత్తలు, ఆచార్యులకు గొప్ప అదృష్టం వరించిందని కొనియాడారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ గురువారం సందర్శించారు. తొలిసారిగా సందర్శనకు విచ్చేసిన గవర్నర్‌కు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఇతర శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ముందుగా వర్సిటీ ప్రాంగణంలోని ప్రొఫెసర్ …

Read More »

ఈ నెల 7న మేడారానికి గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 7న మేడారం జాతరకు వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా అక్కడి ఆదివాసీలను కలవనున్నట్లు చెప్పిన ఆమె.. తాను ఆదివాసీలకు అక్కలా ఉంటానని పేర్కొన్నారు. అటు ఢిల్లీలో ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చిన కోయ, గోండి, బంజారా, తోటి, ప్రధాన్, డోలీ గిరిజన కళాబృందాల సభ్యులు మంగళవారం గవర్నర్‌ను కలవగా.. వారితో కలిసి ఆమె కాసేపు నృత్యం చేశారు.

Read More »

కేరళ అసెంబ్లీలో షాకిచ్చిన గవర్నర్

CAAకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తీర్మానం పెట్టకన్నా ముందే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అది తనకు ఇష్టం లేదని చెప్పి అందరికీ షాకిచ్చారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన..‘ముఖ్యమంత్రి కోరుతున్నారు కాబట్టి నేను ఈ ప్యారాగ్రాఫ్ చదవబోతున్నాను. ఇది పాలసీ లేదా పథకం కిందకు రాదు. ముఖ్యమంత్రి స్వయంగా ఇది ప్రభుత్వ విధానం అన్నారు. కానీ నేను దీనితో అంగీకరించను. కానీ మర్యాద కొద్దీ దీన్ని చదువుతున్నాను’ అన్నారు.

Read More »

నేడు గవర్నర్‌తో అమరావతి జేఏసీ నేతల భేటీ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం సమావేశంకానున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై పోలీసుల దాడులు, 144 సెక్షన్ అమలుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే విజయవాడలో మహిళల ర్యాలీని అడ్డుకోవడం, పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించిన పరిణామాలను…రైతు ఆందోళనలు, రాజధాని మార్పు వల్ల కలిగే నష్టాన్ని గవర్నర్‌కు జేఏసీ నేతలు వివరించనున్నారు.

Read More »