Breaking News
Home / Tag Archives: grama sachivalayam

Tag Archives: grama sachivalayam

గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలు – 2020

Click here for Grama ward Sachivalayam Results 2020 ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్తీ తర్వాత మిగిలి పోయిన ఖాళీలు, అలాగే ఉద్యోగాలు మానేసిన వారి స్ధానంలో ఖాళీ అయిన ఉద్యోగాల కోసం సెప్టెంబర్లో ప్రభుత్వం మరోసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు ఈ పరీక్షలు …

Read More »

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు… పరీక్షలు

మీరు ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారా? శుభవార్త. వచ్చే నెలలో పరీక్షలు జరగనున్నాయి. జూలై చివరి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతేడాది భారీగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల గ్రామ సచివాలయాల్లో 14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 …

Read More »

కరోనాపై ఇంటింటి సర్వే

ఏపీ: కరోనా వైరస్‌ ప్రబలకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. అందులో భాగంగా గ్రామ/వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలతో మొబైల్ యాప్ ద్వారా నేడు, రేపు ఇంటింటి సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా? వారికి దగ్గు, జలుబు లాంటివి ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోనుంది. అటు కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులను శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read More »

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించే బాధ్యతలు వారికే

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఇకపై గ్రామ, పట్టణ వలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ వలంటీర్ల ద్వారా సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ, పట్టణ వలంటీరు ఉంటారు కాబట్టి విదేశాల నుంచి ఆయా గ్రామాలకు వచ్చిన వారిని తేలిగ్గా గుర్తించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాలకు వెళ్లి వచ్చిన వారుగానీ, …

Read More »

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీపికబురు

అమరావతి: కాస్ట్(కుల ధృవీకరణ) సర్టిఫికెట్లు కావాలంటే ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిందే. ఇకపై ఈ సమస్యకు చెక్ పెట్టేలా.. గ్రామ/వార్డు సచివాలయాల్లోనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, ఆపైన ఉండే అధికారి మంజూరు చేయనుండగా.. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

Read More »

వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామా…

అమరావతి: గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు మెరుగైన ఉద్యోగం వస్తే, దీన్ని వదిలి వెళ్లడం అంత తేలిక కాదు. శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తేనే రాజీనామా ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగం వదులుకోవాల్సిందే. సచివాలయాల్లో పీజీ, యూజీ చేసిన వారు ఎక్కువగా విధుల్లో ఉండగా… వీరిలో పలువురు రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాలకు వెళ్లాలనుకోవడంతో వేతనాలు తిరిగి చెల్లించాలని అధికారులు చెప్పారు.

Read More »

మీకు రేషన్ కార్డు కావాలా?

ఏపీలో కొత్త బియ్యం(రేషన్) కార్డుల పంపిణీ ప్రారంభం కాగా.. 18 లక్షల రేషన్ కార్డులను అనర్హులకు చెందినవిగా గుర్తించారు. వీరిలో కూడా పలువురు అర్హులు ఉండగా.. అలాంటి వారు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేస్తే ఐదు రోజుల్లో రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. రేషన్ కార్డు రాలేదని ఆందోళన చెందవద్దని.. పెన్షన్ రాని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే 2 నెలల పెన్షన్ మార్చిలో …

Read More »

బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రభుత్వ శాఖల ఉద్యోగుల తరహాలోనే రోజూ ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అలాగే వైద్య ఆరోగ్యశాఖలో కూడా బయోమెట్రిక్ హాజరుకు అనుగుణంగా ప్రభుత్వం వేతనాలు చెల్లించనుంది. దీంతో వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

Read More »

‘స్పందించకపోతే వారిది అరణ్యరోదనే అవుతుంది’

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని.. ఈ వ్యవస్థలు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని వివిధ వర్గాల …

Read More »

ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు డోర్ డెలివరీ

ఏపీలో దశల వారీగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా.. వీటి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామ సచివాలయానికి అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనుండగా.. ఈ కేంద్రాల్లో నమోదయ్యే రైతులకు 48-72 గంటల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటివి ఇంటికి డోర్ డెలివరీ చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీటిని సరఫరా చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Read More »