ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేసేందుకు అధికారులు, స్థానిక వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో వ్యాపార సంస్థలు నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించాలని గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ …
Read More »గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం…
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ…ఆటోను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »మాజీ స్పీకర్ కోడెల 74వ జయంతి…
గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి నేడు. కోడెల కుటుంబ సభ్యులు చిత్ర పటానికి నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌లో కోడెల శివరాం రక్తదానం చేశారు. నరసరావుపేట ప్రజల కోసం తన ఆసుపత్రిని, ఇంటిని క్వారంటైన్ సెంటర్‌కు ఇస్తామని శివరాం తెలిపారు. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని కోడెల శివరాం తెలిపారు.
Read More »బయటకొస్తే.. అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి
గుంటూరు: గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 90కు చేరుకోగా.. జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలు కోసం బయటకు వచ్చే వారు అడ్రస్ ప్రూఫ్ వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ఇంటి నుంచి ఒక కి.మీ దూరం వరకే వాహనాలపై తిరగాలని.. ఈ నిబంధన అతిక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేసి, వాహనం సీజ్ చేస్తామన్నారు. అటు గుంటూరు నగరానికి చెందిన ఇద్దరు కరోనాను …
Read More »గుంటూరు జిల్లాలో తొలి మరణం..
గుంటూరు జిల్లా నరసరావుపేటలో తొలి కరోనా మరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ వ్యక్తికి వైరస్ ఎలా వచ్చిందో ఎవరికీ అంతుబట్టకపోవడంతో జిల్లా వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ కనెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తికి కేబుల్ నగదు వసూలు చేసే క్రమంలో.. స్థానికుల ద్వారా వైరస్ వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలన్నారు.
Read More »జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండండి…
గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్ డౌన్ కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా సడలింపులు ఇచ్చామని, కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉదయం 9గంటల లోపు నిత్యవసరాలు కొనుగోలు చేయాలన్నారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read More »గుంటూరు జిల్లాలో విషాదం
గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం గ్రామానికి చెందిన కన్నా నరేష్(32) అనే యువకుడు.. పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఉదయం కురిసిన వర్షానికి పొలంలోకి వెళ్లిన నరేష్ పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురువారం ఉదయం కురిసిన అకాల వర్షానికి కల్లాలలోని పంటను పరిశీలించటానికి వెళ్లి.. మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read More »ఏపీలో కొత్తగా ఒకే కరోనా కేసు…
గుంటూరు: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు కేవలం ఒకే కరోనా కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గుంటూరులో ఈ కేసు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరుకుంది. మరోవైపు కర్నూలు జిల్లాలో ఈనెల 3న కరోనా కారణంగా ఓ వ్యక్తి మృతిచెందినట్లు నిర్థారించింది.
Read More »మీడియా ప్రతినిధుల సేవలు అమోఘం
గుంటూరు కన్వెన్షన్ హాల్లో వైసీపీ ఆధ్వర్యంలో పాత్రికేయులు, మీడియా ప్రతినిధులకు రాష్ట్ర హోంమంత్రి సుచరిత నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి పోలీసులు, వైద్య సిబ్బందితోపాటు మీడియా ప్రతినిధులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని మంత్రులు కొనియాడారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు చేరవేస్తూ.. వారిని చైతన్యవంతం చేయడంలో పాత్రికేయులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
Read More »గుంటూరులో 20కి పెరిగిన పాజిటివ్ కేసులు…
గుంటూరు: ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్ కేసులు 20కి పెరిగాయి. గతంలో ఉన్న ప్రాంతాలతోపాటు కొత్తగా అచ్చంపేట, క్రోసూరు, మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో గతంలో ఉన్న 4 కేసులకు మరో 5 కలవడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఇక క్రోసూరులో 3, అచ్చంపేట, …
Read More »