Breaking News
Home / Tag Archives: guntur

Tag Archives: guntur

రేపు గుంటూరుకు సీఎం జగన్‌

జీఎంసీలో రోగుల అలెవెన్స్‌ పథకం ప్రారంభం గుంటూరు(మెడికల్‌): డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో కొత్తగా రోగుల అలెవెన్స్‌ పథకం ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ రెండున గుంటూరుకు వస్తున్నారు. గుంటూరు వైద్యకళాశాల జింకానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసే కార్య క్రమంలో ఉదయం 11 గంటలకు ఈ కొత్త పథకం సీఎం ప్రారంభిస్తారు. సీఎం జగన్‌ టూర్‌ను పురస్కరించుకొని శనివారం సాయంత్రం కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ …

Read More »

రూ.27 కోట్లకు ఐపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్‌

గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఐపీ పెట్టిన మెడికల్‌ వ్యాపారి పట్టుబడ్డాడు. రూ.27 కోట్లకు ఐపీ పెట్టిన వ్యాపారి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు వ్యాపారిని అరెస్ట్‌ చేశారు.

Read More »

నేడు గుంటూరులో సీఎం జగన్‌ సభ

అగ్రి గోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ గుంటూరు: అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సీఎం జగన్‌ గుంటూరులో గురువారం చెక్కులను పంపిణీ చేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులు జిల్లాలో 19751 మం దికి రూ.14.09 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రులు తెలిపారు. దీనికి సంబంధించి అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం చెక్కులు పంపిణీ చేస్తారు. కాగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జగన్‌మోహన్‌రెడ్డి …

Read More »

గుంటూరులో నేటి కార్యక్రమాలు

ఉదయం 9.30 గంటలకు రింగ్‌ రోడ్డులోని శుభమ్‌ కల్యాణ మండపంలో ఆభరణాల ఎగ్జిబిషన్‌. ఉదయం 10 గంటలకు గుంటూ రు వైద్య కళాశాలలో మూడు రాష్ట్రాల టీబీ అధికారుల ప్రాంతీయ సదస్సు. ఉదయం 10.30 గంటలకు గుంటూరు మండల పరిషత్‌ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు శిక్షణా తరగతులు. ఉదయం 11 గంటలకు మల్లయ్య లింగం భవన్‌లో సీపీఐ కార్యకర్తలకు శిక్షణా తరగతులు. సాయంత్రం 6.30 గంటలకు గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో …

Read More »

విజయవాడలో నేటి కార్యక్రమాలు

సమావేశం విషయం: సెంటర్‌ ఫర్‌ రూరల్‌ స్టడీస్‌ డెవలప్‌మెంట్‌ సమావేశం సమయం: ఉదయం 10 గంటలకు వేదిక: ప్రెస్‌క్లబ్‌ సమావేశం విషయం: ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల సాధన సమితి సమావేశం సమయం: ఉదయం10.30 గంటలకు వేదిక: ప్రెస్‌క్లబ్‌ ఆవిష్కరణ విషయం: మేరువు నవల ఆవిష్కరణ సమయం: సాయంత్రం5.30గంటలకు వేదిక: కల్చరల్‌ సెంటర్‌

Read More »

మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి….

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 800 మంది సానుభూతిపరులపై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటివరకు ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. దీనిపై గత నెలలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

Read More »

కడుపునొప్పితో వస్తే ప్రాణమే పోయింది

అపెండిసైటిస్‌ సర్జరీలో ఘోర తప్పిదం పేగు కత్తిరించడంతో ఆగని రక్తస్రావం ఆపరేషన్‌ టేబుల్‌పైనే మహిళ మృతి గుంటూరు జీజీహెచ్‌లో దారుణం గుంటూరు: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ… వైద్యుల తప్పిదంతో ఏకంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వాస్పత్రిలోని సర్జరీ యూనిట్‌లో జరిగింది. పాత గుంటూరు రాజీవ్‌ గృహకల్పకు చెందిన పావనీ బాయ్‌(22)కి ఐదేళ్ల క్రితం కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన సాంబయ్య నాయక్‌తో వివాహమైంది. వీరికి …

Read More »

చెన్నై – సికింద్రాబాద్‌ – చెన్నై.. బైవీక్లీ స్పెషల్‌ ట్రైన్‌

గుంటూరు : గుంటూరు మీదుగా వారానికి రెండుసార్లు చెన్నై – సికింద్రాబాద్‌ – చెన్నై ప్రత్యేక రైళ్లని నడిపేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. ఇప్పటివరకు ఈమార్గంలో నిత్యం రాత్రి వేళ నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉండగా ఎప్పటినుంచో ప్రయాణికుల నుంచి వస్తోన్న డిమాండ్‌ మేరకు మరో రైలుని బోర్డు పట్టాలెక్కించింది. తొలుత ప్రత్యేక రైలుగా నడిపి ప్రయాణికుల నుంచి లభించే ఆదరణని బట్టి రెగ్యులర్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా …

Read More »

నాగార్జునసాగర్‌ నుంచి 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

గుంటూరు/విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ అధికారులు గురువారం 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 79,866 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 312.08 టీఎంసీలకు సమానం. నాగార్జునసాగర్‌ నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. ఇది 311.74 టీఎంసీలకు సమానం. కాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కుడికాలువ ద్వారా 10,120 …

Read More »