Breaking News
Home / Tag Archives: heavy flood water

Tag Archives: heavy flood water

మేడిగడ్డ బ్యారేజ్ 21 గేట్లు ఎత్తివేత…

జయశంకర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబట్‌పల్లి పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ  21 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహిత నదీ ప్రవహిస్తూ గోదావరిలోకి నీరు వచ్చి చేరుతోంది. ఈ నీరు లక్ష్మీ బరాజ్ మీదుగా ప్రవహిస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ప్రవాహం …

Read More »

శ్రీరాంసాగర్ కు భారీగా వరద నీరు…

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు ఇంకా కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 23,530 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో.. 20,500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం :1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం:1091 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 90 టీఎంసీలకు చేరుకుంది.

Read More »

తుంగభద్రకు కొనసాగుతున్న వరద….

కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 20,470 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 19,990 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1,633 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 100.855 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీటినిల్వ 100.855 టీఎంసీలు ఉంది. దీంతో అధికారులు తుంగభద్ర జలాశయం 5 గేట్లు ఎత్తి వేసి.. 7,685 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు.

Read More »

సాగర్ కు కొనసాగుతున్న వరద…

నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను 10 మీటర్లమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. మొత్తం 1.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ, …

Read More »

కొనసాగుతున్న వరద ఉధృతి….

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 6లక్షల క్యూసెక్కులు కాగా.. 4.8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు.

Read More »

నాగావళికి పెరుగుతున్న వరద ఉధృతి…

 శ్రీకాకుళం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వంగర నాగావళి నదిలో శుక్రవారం వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. వంగర సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించడంతో నదీపరివాహక గ్రామం కొప్పర ఎస్సీ కాలనీ, పాఠశాలలో వరద నీరు పొంగుతోంది. బూర్జ మండలంలో  రిజర్వాయర్‌కు గండి పడింది. పలాస మండలం అమలకుడియా – పురణభద్ర గ్రామాల రోడ్డుకు గండి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read More »

గొల్లప్రోలు ఏలేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి….

తూర్పు గోదావరి: గొల్లప్రోలు ఏలేరు ప్రాజెక్టు నుండి శుక్రవారం వరద నీరు ఉధృతస్థాయికి చేరుకుంది. 216 జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో కత్తిపూడి-కాకినాడ వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గొల్లప్రోలు ఏలేరు ప్రాజెక్టు నుండి నీటిని దిగువకు విడుదల చేయడంతో వేల ఎకరాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. గొల్లప్రోలు పట్టణంలో ఈబీసీ కాలనీ, ఎస్‌సి పేట, షోరూం పేట, దేవి నగరం, శివాలయం కాలనీ …

Read More »

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. భయం గుప్పిట్లో ప్రజలు..

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణలంక, గాంధీ కాలనీ, తారక రామారావు నగర్ కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read More »

వరదలో చిక్కుకున్న పలు కాలనీలు…

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. గాంధీ కాలనీ, తారకరామానగర్, భూపేష్ గుప్తానగర్ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను కార్పొరేషన్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు  తరలించారు. ముంపు బాధితుల కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులపాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read More »

పులిచింతలకు పెరిగిన వరద ఉద్ధృతి..

పులిచింతల: పులిచింతల జలాశయానికి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సాగర్ నుంచి 6.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అధికారులు 20 స్పిల్‌వే గేట్లను ఎత్తి 5.97 లక్షల క్యూసెక్కులను దిగువకు విడిచిపెడుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 172.37 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

Read More »