Breaking News
Home / Tag Archives: heavy rains

Tag Archives: heavy rains

తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను…

మహారాష్ట్ర: రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుఫాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను దృష్ట్యా కొన్ని రైళ్లు …

Read More »

యూపీలో భారీవర్షాలు…

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 43 మంది మరణించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం కురిసిన భారీవర్షాలు, పిడుగుల పాటుకు ఉన్నవ్ లో 8 మంది, కన్నౌజ్ లో ఐదుగురు మరణించారు. లక్నో నగరంలో ఓ ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు మరణించగా, …

Read More »

బెంగాల్ తీరాన్ని తాకిన అంఫన్ తుఫాను…

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి అంఫన్ తుఫానుగా మారింది. అయితే, బంగాళాఖాతంలో ఇప్పటి వరకు ఇలాంటి బలమైన తుఫాను ఏర్పడలేదని, సూపర్ సైక్లోన్ అని నిపుణులు చెప్తున్నారు. ఈ సూపర్ సైక్లోన్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతున్నది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటుగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తీరం దాటే సమయంలో నాలుగు గంటలు చాలా కీలంగా …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం…

హైదరాబాద్‌: ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎస్సాఆర్‌‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అయితే భారీ వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో స్థానికులు ఇబ్బందులకు …

Read More »

ఆస్ట్రేలియాలో కుండపోత వర్షం.. కార్చిచ్చు నుంచి ఉపశమనం !

ఓ వైపు కార్చిచ్చు… మరోవైపు భారీ వర్షాలు ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. అయితే … కార్చిచ్చుతో అడవులు తగలబడిన ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో కొంచెం ఉపశమనం లభించినట్లయింది. ఆస్ట్రేలియాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌ లాండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా క్వీన్స్‌లాండ్‌లో ప్రధాన రహదారులను మూసివేశారు. వరదలు ముంచెత్తటంతో జనజీవనం …

Read More »

మరో రెండు రోజుల పాటు వర్షాలు…

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దక్షిణాంద్ర, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. వరంగల్‌, ములుగు జిల్లాల్లో 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read More »

1900 మందిని పొట్టనబెట్టుకున్నవరదలు

ఢిల్లీ: భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది యావత్‌ భారతం అతలాకుతలమైంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల కుంభవృష్టి కురిసి వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరింత తీవ్రమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వరదల కారణంగా ఈ ఏడాది ఉత్తర భారతంలో 1900 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 30లక్షల మంది నిరాశ్రయులైనట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. యూకేకు చెందిన దాతృత్వ సంస్థ …

Read More »

కడప జిల్లాలో భారీ వర్షాలు…

కడప: కడప జిల్లాలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరులో నది ఉప్పొంగుతోంది. వరద ప్రవాహానికి తాత్కాలిక బ్రిడ్జి సైతం కొట్టుకుపోయింది. మరోవైపు నెల్లూరు జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు సమీపంలో పంబలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వంకినగుంట ప్రాతంలో ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరుకుంటోంది.

Read More »

తమిళనాడులో భారీ వర్షాలు…

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కోయంబత్తూరు మెట్టుపాళ్యం సమీపంలో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

Read More »

నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు…

న్యూఢిల్లీ : కేంద్ర వాతావరణశాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది. కోస్తా ఆంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు కూడా పడే ప్రమాదముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అసోం, మేఘాలయ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపిస్తుందని …

Read More »