Breaking News
Home / Tag Archives: high court

Tag Archives: high court

బడ్జెట్ సమావేశాలు మార్చి తొలివారం లేదా రెండోవారం

అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 25న హైకోర్టు తీర్పు రానుంది. ఒకవేళ హైకోర్టు తీర్పు సానుకూలంగా వస్తే.. వెంటనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే మార్చి 17,18వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. కానీ ఎన్నికలు ఆలస్యమయ్యే పరిస్థితి వస్తే.. మార్చి 6 నుంచి ప్రారంభమవుతాయని సమాచారం.

Read More »

26న ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 26వ తేదీన జరగనుంది. ఈ నెల 12న (రెండో బుధవారం) సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో స్థానిక ఎన్నికల సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు అభ్యర్ధులెవరైనా పాల్పడితే.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల తర్వాతా అనర్హుడిగా ప్రకటించేలా ఆర్డినెన్సు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్సు కూడా ఇచ్చారు. స్థానిక ఎన్నికల తర్వాతే …

Read More »

నిత్యానందపై అరెస్ట్‌ వారంట్‌

బెంగళూరు: అత్యాచారం, మహిళ కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానంద కు రామనగర కోర్టు అరెస్ట్‌ వారంట్‌ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్‌ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా …

Read More »

చిన్మయిపై కోర్టులో పిటిషన్‌ వేస్తా : రాధారవి

చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్‌ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని సీనియర్‌ నటుడు, సౌత్‌ ఇండియన్‌ డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ అధ్యక్షుడు రాధారవి చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్‌ కళాకారుల యూనియన్‌ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కాగా ఈ యూనియన్‌కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి. నటుడు …

Read More »

జీవోలను ఎందుకు పెట్టడం లేదు: హైకోర్టు

హైదరాబాద్:ప్రభుత్వ జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం లేదన్న పిటిషన్‌పై హైకోర్టులో  విచారణ జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన 40వేల జీవోలను వెబ్‌సైట్లలో పెట్టలేదని బీజేపీకి చెందిన పేరాల శేఖర్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని స్వీకరించిన కోర్టు.. జీవోలను ఎందుకు వెబ్‌సైట్లో పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో 28లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read More »

ఇంటర్‌ బోర్డు నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్: ఇంటర్‌ బోర్డు నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల వ్యవహారంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. 45 కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించాయని ఇంటర్‌బోర్డు కోర్టుకు తెలిపింది. ఈ కాలేజీల్లో 20 వేల మంది విద్యార్థులు ఉన్నారని, నిబంధనలు పాటించని కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. గుర్తింపులేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని తెలంగాణ ఇంటర్‌ బోర్డును కోర్టు …

Read More »

ఆర్మీలోనూ ‘ఆమె’కు అందలం..

న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్‌ పోస్టింగ్‌కూ అర్హులని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ హోదా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడునెలల్లోగా శాశ్వత కమిషన్‌ …

Read More »

జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతం: వైసీపీ నేతలు

జగన్ ఢిల్లీ పర్యటన విజయవంతం అయ్యిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 3 రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. హైకోర్టు తరలింపు ప్రక్రియ ప్రారంభానికి హామీ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. శాసనమండలి రద్దు తీర్మానం పార్లమెంట్ రెండో సెషన్‌లో ప్రవేశపెట్టే అంశం, పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Read More »

తెలుగు మాధ్యమాన్ని తీసేస్తామనడం సరికాదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసివేసి, ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ హైకోర్టులో వాదించారు. కనీసం ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన హైకోర్టుకు వివరించారు. జాతీయ విద్యా విధానంలోనూ ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం కల్పించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.

Read More »

జస్టిస్‌ ధర్మాధికారి రాజీనామా

ముంబై: బొంబాయి హైకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తుల్లో రెండో వారైన జస్టిస్‌ సత్యరంజన్‌ ధర్మాధికారి రాజీనామా చేశారు. కుటుంబపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెలుపల తాను విధులు నిర్వర్తించలేనని ఆయన పేర్కొన్నారు. పదోన్నతిపై తనను వేరే రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పటికీ.. ముంబై నుంచి బయటకు వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించానన్నారు. ‘పూర్తిగా వ్యక్తిగత, కుటుంబ …

Read More »