Breaking News
Home / Tag Archives: huge rally

Tag Archives: huge rally

మూడు రాజధానులు వద్దు…అమరావతే ముద్దు

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో విద్యార్థులు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు…అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు.

Read More »

వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల అరెస్ట్!

అమరావతి : రాజధానిగా అమరావతి వద్దని, అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని చెబుతూ, మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఈ ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వరకు భారీ ర్యాలీ తలపెట్టగా, పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు, తన మద్దతుదారులతో ఆయన బయలుదేరగా, ఈ ప్రాంతంలో ర్యాలీలకు …

Read More »

శ్రీకాకుళంలో వామపక్షాలు-ముస్లింల నిరసన

శ్రీకాకుళం : మత విభజనతో కూడిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు.. గురువారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీలో వామపక్ష నాయకులు, ముస్లింలు కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read More »

మహిళలపై అత్యాచారాలకు నిరసనగా భారీర్యాలీ

అమరావతి న్యూస్, నెల్లూరు : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ల ఆధ్వర్యంలో దిశ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ.. సోమవారం ఉదయం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి దాదాపుగా 3 వేల మంది విద్యార్థులతో మహా ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా సంఘం మండల కమిటి …

Read More »

పెద్దవడుగూరులో ఎస్‌ఎఫ్‌ఐ భారీ ర్యాలీ….

అనంతపురం: అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు పరమేష్‌, మండల అధ్యక్ష కార్యదర్శి రమేష్‌, చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో పెద్దవడుగూరు ప్రధాన వీధుల గుండా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్‌ ఆవరణంలో మానవహారంగా పలు నినాదాలు చేపట్టారు. అక్కడ నుండి తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని …

Read More »

పాలకొల్లులో నిర్వహించిన భారీ ర్యాలీ…

పశ్చిమ గోదావరి: పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని పాలకొల్లు పట్టణ సిఐ సిహెచ్‌ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రూరల్‌ సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐ జివిఎస్‌ఎన్‌ మూర్తి, రూరల్‌ ఎస్‌ఐ పాలవలస అప్పారావు, ఎఎస్‌ఐ ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

శ్రీకాకుళంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ ర్యాలీ….

శ్రీకాకుళం: సంతబొమ్మాళిలో సంతబొమ్మాళి యూత్, మండల పరిషత్ ఆదర్శ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను వాడొద్దని, బహిరంగంగా మలవిసర్జన చేయరాదని, మరుగుదొడ్లునే వాడాలని, ఆరు బయట చెత్తను వేయొద్దని అంటూ నినాదిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. ముందుగా పాఠశాలలో ప్రధానోపాధ్యాలు యస్.అప్పలరాజు, యూత్ ప్రధాన బాధ్యులు కూచెట్టి భానుప్రకాష్, అట్టాడ సాయికుమార్ విధ్యార్ధులకు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్ధాలు వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీని …

Read More »