Breaking News
Home / Tag Archives: india

Tag Archives: india

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. నేపాల్‌లో చైనా రాయబారి హావో యాంగ్ చీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కావడంపై కొన్ని భారతీయ మీడియా సంస్థలు అవహేళనకరమైన రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేశాయని నేపాల్ ఆరోపించింది. గురువారం సాయంత్రం నుంచి నేపాల్ కేబుల్ ఆపరేటర్లు భారత టెలివిజన్ చానళ్ల …

Read More »

కరోనా ఊరట..62 శాతం దాటిన రికవరీ రేటు

దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,879 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. కొవిడ్‌ బారిన పడి కొత్తగా 487 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 21,129కి పెరిగింది. 487 మరణాల్లో 198 మహరాష్ట్రలోనివే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన …

Read More »

గల్వాన్‌ లోయలో కీలక పరిణామం

న్యూఢిల్లీ: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయలో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు …

Read More »

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా ఆపిల్ సంస్థ.. చైనాకు మరో షాక్ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏకంగా 4,500 చైనీస్ గేమ్స్‌ను తొలగించింది. మొబేల్ గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో ఆపిల్ పలు సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా చైనా గేమ్స్‌ యాప్స్ ను రిమూవ్ చేసింది. లైసెన్స్ నిబంధనల్ని కఠినతరం చేసిన ఆపిల్ సంస్థ అనుమతి లేని యాప్స్ …

Read More »

చైనాకు ‘హీరో సైకిల్స్’ షాక్.. వందల కోట్ల డీల్ రద్దు…?

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న 900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో ఒప్పందం ప్రకారం చైనాతో 900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని.. కానీ ఈ ఒప్పందాన్ని తాము రద్దు …

Read More »

సరిహద్దు వివాదం: భారత్‌కు పెరుగుతున్న మద్దతు!

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా హద్దులు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టమైన సంకేతాలు జారీ చేసిన విషయం విదితమే.‘బలహీనులు, పిరికివారు శాంతిని సాధించలేరు. శాంతి స్థాపనకు ముందుగా ధైర్య సాహసాలు అత్యంత ఆవశ్యకం. అవి భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి’అంటూ భారత ఆర్మీ శక్తిసామర్థ్యాల గురించి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. అదే విధంగా సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి …

Read More »

పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చొద్దు: చైనా

గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం లఢఖ్‌లో ఆకస్మిక పర్యటనకు వెళ్లారు. మిలిటరీ ఉన్నతాధికారులతో కలిసి ప్రస్తుతం గల్వాన్‌లో నెలకొని ఉన్న పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్రధాన లఢఖ్ పర్యటనతో చైనా ఉలిక్కిపడుతున్నది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ఈ ఉదయం మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌.. మోదీ లఢఖ్ పర్యటన గురించి ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొని …

Read More »

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

తమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇండియా విధించిన బ్యాన్‌పై లీగల్‌గా సవాల్ చేయమని టిక్‌టాక్ వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని అనుకుంటున్నామని, ప్రభుత్వం అమలు పరిచే నియమ, నిబంధనలకు లోబడి ఉంటామంది. తమ వినియోగదారుల భద్రత, సౌర్వభౌమత్వానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామంది.

Read More »

దేశంలో ఆగని కరోనా విలయం.. 24 గంటల్లో

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 19148 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం భాదితుల సంఖ్య 604641 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 434 మంది మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 17834 కి చేరింది. ఇక మొత్తం బాధితుల్లో 359860 మంది కోలుకోగా, ప్రస్తుతం మరో 226947 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా భారిన పడి …

Read More »

భారత వెబ్ సైట్లను బ్లాక్ చేస్తున్న చైనా.!

భారత్-చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్ టిక్ టాక్ తో సహా 59 చైనా ఆప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసందే. కాగా చైనా కూడా ఇప్పటికే భారత వెబ్ సైట్ లను సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియాకు చెందిన వెబ్ సైట్ లు చైనాలో కనిపించకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది.మరోవైపు భారత …

Read More »