Breaking News
Home / Tag Archives: INX Media case

Tag Archives: INX Media case

ఎన్ని కుట్రలు చేసినా…న్యాయమే గెలుస్తుంది..

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలు నుంచి విడుదలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చిదంబరం పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికీ తెలుసు. తనతో పని చేసిన అధికారులు, తనను గమనించిన జర్నలిస్టులకు బాగా తెలుసు అని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ‘ ఆర్థిక …

Read More »

చిదంబరంను కలిసిన కాంగ్రెస్ నేతలు….

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్‌ చేసింది. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా …

Read More »

సుప్రీంను ఆశ్రయించిన మాజీ మంత్రి….

ఢిల్లీ: ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’ కేసులో తనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరపున న్యాయవాది కపిల్‌ సిబల్‌ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ విచారణకు అంగీకరించింది. గత 90రోజులుగా చిదంబరం జైల్లోనే ఉన్నారని వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని …

Read More »

కేంద్ర మాజీ మంత్రికి బెయిల్ నిరాకరణ….

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా వ్యవహారంలో చిదంబరం అరెస్టయిన నేపథ్యంలో.. ప్రస్తుతం చిదంబరం తీహార్‌ జైల్లో ఉండి సిబిఐ, ఇడి దర్యాప్తులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మరోసారి బెయిల్‌ కు దరఖాస్తు చేసుకున్న ఈ సీనియర్‌ రాజకీయవేత్తకు నిరాశ తప్పలేదు. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సాధారణ బెయిల్‌ తిరస్కరించింది. దాంతో చిదంబరం మరికొంతకాలం తీహార్‌ …

Read More »

చిదంబరానికి బెయిల్ మంజూరు….

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి, ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరానికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ నెల 24 వరకూ ఈడీ కస్టడీ కొనసాగనుంది. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ఈడీ కస్టడీలో …

Read More »

చిదంబరం పిటిషన్ పై సుప్రీం రిజర్వు….

న్యూఢిల్లీ: అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పులు చిదంబరంకు ఆయన కూమరుడు కార్తీ చిదంబరంకు సిబిఐ రూపంలో కష్టాలు మొదలాయ్యాయి. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీమంత్రి పి.చిదంబరంకు మరియు ఈ కేసులో సంబధం ఉన్న ఇతరులకు ఢిల్లీ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. ఈ ఛార్జ్ షీట్ లో పీటర్‌ ముఖర్జీ, చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఎస్‌. భాస్కర రామన్‌, నీతి ఆయోగ్‌ మాజీ సిఈవో …

Read More »

చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ…

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని బుధవారం ఉదయం ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసేందుకు ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఈడీకి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయనను ఈడీ అధికారులు బుధవారం జైలుకు వెళ్లి ప్రశ్నించారు.

Read More »

జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కావడంతో….

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరంను నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న చిదంబరం జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. జైలులో ఉన్న తనకు ఇంటినుంచి ఆహారం తెప్పించుకునే సౌలభ్యాన్ని కలుగజేయాలంటూ చిదంబరం దాఖలు చేసిన దరఖాస్తుపై కూడా నేడు కోర్టులో విచారణ జరుగనున్నది.

Read More »

చిదంబరానికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు…

ఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం బెయిల్‌ నిరాకరించింది. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేయలేదు.

Read More »